BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్స్, మరిన్ని బెనిఫిట్స్

BSNL Independence day special Plan | బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శుభవార్త. ఇండిపెండెన్స్ డే సందర్భంగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది బీఎస్ఎన్ఎల్.

news18-telugu
Updated: August 7, 2020, 12:59 PM IST
BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్స్, మరిన్ని బెనిఫిట్స్
BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్స్, మరిన్ని బెనిఫిట్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.147 ధరతో కొత్త ప్లాన్ అందిస్తోంది. రూ.147 ప్లాన్ రీఛార్జ్ చేసిన వారికి 250 నిమిషాల వరకు లోకల్, ఎస్‌టీడీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌తో 10జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు మాత్రమే. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కూడా లభిస్తాయి. కస్టమర్లు ఓ ఎస్ఎంఎస్ పంపి ఇండిపెండెన్స్ డే స్పెషల్ రూ.147 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. STV COMBO147 అని టైప్ చేసి 123 నెంబర్‌కు మెసేజ్ చేస్తే ఈ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. బీఎస్ఎన్ఎల్ సైట్ ద్వారా లేదా ఛానల్ టాప్ అప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Personal Loans: పర్సనల్ లోన్ కావాలా? ఏ బ్యాంకులో వడ్డీ రేటు ఎంతో తెలుసుకోండి

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం... వారికి మాత్రమే

దీంతో పాటు రూ.247 ప్లాన్‌కు 6 రోజులు, రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 74 రోజులు వేలిడిటీని పొడిగించింది బీఎస్ఎన్ఎల్. దీంతో రూ.247 ప్లాన్‌పై 36 రోజులు, రూ.1,999 ప్లాన్‌పై 439 రోజుల వేలిడిటీ పొందొచ్చు. ఈ ప్లాన్స్‌పై ఎరాస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. 30 రోజుల వరకు ఎరాస్ నౌ కంటెంట్ ఉచితంగా చూడొచ్చు. రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్ పైనా ఎరాస్ నౌ సర్వీస్ వస్తుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అందించే ఈ ప్రమోషనల్ ఆఫర్స్ అన్నీ ఆగస్ట్ 31 వరకే. ఇక బీఎస్ఎన్ఎల్ రూ.78, రూ.551, రూ.249, రూ.447 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌, రూ.144, రూ.792, రూ.1,584 పతంజలి ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని రద్దు చేసింది.
Published by: Santhosh Kumar S
First published: August 7, 2020, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading