news18-telugu
Updated: November 14, 2020, 11:12 AM IST
ప్రతీకాత్మకచిత్రం
ఈ రోజు దీపావళి పర్వదినం. లక్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన దినం...అందుకే స్టాక్ మార్కెట్లకు కూడా దీపావళి ప్రత్యేకమైనదని చెప్పాలి. ఈ రోజు ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. సాధారణంగా ఈ రోజు శనివారం. అంటే, ఈ రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు...కానీ దీపావళి రోజు మాత్రం అలా కాదు. ఈ రోజు స్టాక్ మార్కెట్లో ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. ఈ ముహూరత్ ట్రేడింగ్ ఈ రోజు సాయంత్రం నిర్వహిస్తారు. ముహూరత్ ట్రెండింగ్ సమయంలో షేర్లను కొనుగోలు చేస్తే వచ్చే దీపావళి నాటికి ఈ షేర్లు సంపద సృష్టిస్తుందని నమ్ముతారు. ఈ ముహూరత్ సెషన్ ప్రారంభానికి ముందు స్టాక్ మార్కెట్లో ట్రేడర్లు పూజ కూడా చేస్తారు. అంతేకాదు సాయంత్రం సమయంలో బిఎస్ఇ, ఎన్ఎస్ఇలలో ప్రత్యేకంగా ఓ గంటసేపు ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో షేర్లను కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని మార్వాడీల విశ్వాసం.
ఇదీ ముహూరత్ ట్రేడింగ్ సమయంఈ రోజు ముహూరత్ ట్రేడింగ్ సమయం సాయంత్రం 6:15 నుండి 7:15 వరకు. దీనికి ముందు, సాయంత్రం 6:00 నుండి 6:08 వరకు 8 నిమిషాల ప్రీ ఓపెన్ ముహూరత్ సెషన్ కూడా ఉంటుంది. అదే సమయంలో, పోస్ట్ క్లోజింగ్ ముహూరత్ ఉదయం 7.25, రాత్రి 7.35 మధ్య జరుగుతుంది. ఇది కాకుండా, బ్లాక్ డీల్ సెషన్ సమయం సాయంత్రం 5:45 నుండి 6 గంటల వరకు ఉంటుంది. ముహూరత్ ట్రేడింగ్ ను ప్రధానంగా వ్యాపార సమాజం తమ సంపద, శ్రేయస్సు కోసం సిరి సంపదల దేవత లక్ష్మి దేవిని ఈ సందర్భంగా స్మరించుకుంటారు. అదే సమయంలో, కొత్త శకం లేదా కొత్త సంవత్సరం ప్రారంభం జరుగుతుందని ట్రేడర్లు నమ్ముతారు. కాగా సంవత్ 2076 చివరి రోజున స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇదిలా ఉంటే శుక్రవారం బిఎస్ఇ సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 43,443కు చేరగా.. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 12,720 వద్ద ముగిశాయి. సోమవారం దివాలీ-బలిప్రతిపడ సందర్బంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మార్కెట్లు తిరిగి 17న తెరుచుకోనున్నాయి.
ముహూరత్ ట్రేడింగ్ చరిత్ర తెలుసుకోండి
1957 నుండి, బిఎస్ఇలో ముహూరత్ వ్యాపారం జరుగుతోంది. దీనిని 2 ప్రధాన వాణిజ్య వర్గాలైన గుజరాతీలు, మార్వాడీలు దీన్ని ప్రారంభించారు. ఈ సమాజం ప్రతి దీపావళి సందర్భంగా ఈ రకమైన ఆరాధన చేస్తారు. అయితే ఈ సంప్రదాయం 1992 లో ఎన్ఎస్ఇలో ప్రారంభమైంది. దీని తరువాత, బిఎస్ఇ, ఎన్ఎస్ఇ దీపావళి సాయంత్రం 1 గంట పాటు కలిసి ట్రేడింగ్ ప్రారంభించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీపావళికి ముహూరత్ సెషన్ ప్రారంభమయ్యే ముందు వ్యాపారవేత్తలు అకౌంటింగ్ పుస్తకాన్ని ఆరాధిస్తారు.
ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌ను పరిశీలించండి
-బ్లాక్ డీల్ సెషన్ సాయంత్రం 5:45 నుండి 6:00 వరకు- ప్రీ ఓపెన్ ముహూరత్ సెషన్ సాయంత్రం 6:00 నుండి 6:08 వరకు
- ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సాయంత్రం 6:15 నుండి 7:15 వరకు
మనీ కంట్రోల్ రికమండ్ చేసిన కొన్ని దివాళి స్టాక్స్ ఇవే..
Published by:
Krishna Adithya
First published:
November 14, 2020, 11:12 AM IST