మీరు కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. 2023 మార్చి 31 లోపు కొత్త కార్ కొంటే మీకు రూ.90,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందుకు కారణం ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 ఫేజ్ 2 అమలులోకి వస్తుండటమే. భారతదేశంలో బీఎస్6 మొదటి ఫేజ్ 2020 ఏప్రిల్ 1న అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 రెండో దశ అమలులోకి రానుంది. కొత్త కార్లు, బైకుల ధరలు రూ.10,000 నుంచి రూ.50,000 వరకు పెరుగుతుందని అంచనా. మరి ఈ రెండు దశల మధ్య తేడాలు ఏంటీ? కొత్త నిబంధనలు కార్ల రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి.
కారు నడుస్తుంటే అందులో ఇంధనం కాలుతుంది. చమురు కాలినప్పుడు, వాహనం సైలెన్సర్ నుంచి పొగ వస్తుంది. ఈ పొగలో కార్బన్‌తో పాటు పర్యావరణానికి హాని కలిగించే కణాలు కూడా ఉంటాయి. ఈ పొగ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. దీంతో రోడ్లపై నడిచే వాహనాల పొగపై నిఘా ఉంచడం కోసం పలు నిబంధనలున్నాయి. ఈ నిబంధనలు 2000 సంవత్సరంలో అమలులోకి వచ్చాయి. దీన్నే భారత్ స్టేజ్ నిబంధనలుగా పిలిచేవారు. 2005లో బీఎస్2 రూల్స్, 2010లో బీఎస్3 నిబంధనలు, 2017లో బీఎస్4 నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఆ తర్వాత మూడేళ్లకు నేరుగా బీఎస్6 నిబంధనలు అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవి బీఎస్6 మొదటి దశ నిబంధనలు. ఇక 2023 ఏప్రిల్ 1న బీఎస్6 రెండో దశ నిబంధనలు అమలులోకి రానున్నాయి.
Indian Railways: రైలు మిస్ అయితే అదే టికెట్‌పై మరో రైలు ఎక్కొచ్చు... కానీ ఓ కండీషన్
BS6 నిబంధనల ప్రకారం, వాహనాల నుంచి వెలువడే పొగలో కాలుష్య కారకాల గరిష్ట పరిమితిని నిర్ణయించారు. కార్బన్ మోన్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్, PM10, PM2.5 లాంటివి కాలుష్య కారకాలు. వాహనం పొగలో ఈ కారకాలు నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా కనిపిస్తే, వాహనం అనర్హమైనదిగా పరిగణించబడుతుంది. కాలుష్య ఉద్గారాల గరిష్ట పరిమితి BS4తో పోలిస్తే BS6లో చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు, డీజిల్ వాహనాల్లో నైట్రోజన్ ఆక్సైడ్‌ల పరిమితి BS4తో పోలిస్తే BS6లో 70 శాతం వరకు తక్కువగా ఉంటుంది.
BS6 ఫేజ్ 2లో, వాహనాలు తప్పనిసరిగా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇంజిన్ సిద్ధంగా ఉన్నప్పుడు, అది ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొదట ల్యాబ్‌లో పరీక్షించబడుతుంది. ఇది ఇప్పటివరకు జరిగింది. కానీ ల్యాబ్ పరిస్థితులు అనువైనవి. నిజ జీవిత పరిస్థితులలో ఇతర అంశాలు ప్రభావితం చేస్తాయి. అందుకే రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అంటే ఆర్‌డీఈ BS6 ఫేజ్ 2లో వర్తిస్తుంది. వాహనాలు రోడ్డుపై నడుస్తున్నప్పుడు నిజ జీవితంలో కూడా ఉద్గార నిబంధనలను పాటించాలి.
Aadhaar Mitra: మీ ఆధార్ సమస్యల్ని ఏఐ ఛాట్‌బాట్‌లో పరిష్కరించుకోండి ఇలా
రోడ్లపైనే వాహనాలకు ఆర్‌డీఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వాహనంలోని పొగలోని కాలుష్య కారకాలు నిర్దేశిత పరిమితికి మించి బయటకు రావడం లేదా అన్నది తేలుతుంది. కొత్త వాహనాలు రోడ్డుపైకి రావాలంటే ఆర్‌డీఈ ధ్రువీకరణ తప్పనిసరి. దీనితో పాటు, వాహనాలు పోర్టబుల్ ఎమిషన్ మెజర్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంటాయి. తద్వారా వాహనాల నుండి వచ్చే పొగను రియల్ టైమ్‌లో తనిఖీ చేయవచ్చు.
ఆర్డీఈ పరీక్షలో పాస్ కావడానికి వాహన తయారీదారులు తమ వాహనాల ఇంజిన్‌లను మరింత అధునాతనంగా తయారు చేయడం అవసరం. ఆర్‌డీఈ పరీక్ష ప్రయోగశాల పరీక్ష కంటే చాలా క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ. దీని కోసం తయారీదారులు ఖరీదైన సాంకేతికతను ఉపయోగించాలి. వారి ఇంజిన్లకు మెరుగులు దిద్దాలి. అందుకే బీఎస్6 వాహనాల కన్నా బీఎస్6 రెండో దశకు అనుగుణంగా రాబోయే వాహనాల ఖరీదు కాస్త ఎక్కువ. కార్ల ధరలు రూ.10,000 నుండి రూ.50,000 వరకు పెరగవచ్చని ఓ అంచనా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Cars, Two wheeler