• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • BRITAIN TO SEND 1000 MORE VENTILATORS TO INDIA AMID COVID 19 CRISIS MK GH

Britain Help: భారత్​కు అండగా బ్రిటన్​.. 1,000 వెంటిలేటర్లు పంపిస్తామని వెల్లడి

Britain Help: భారత్​కు అండగా బ్రిటన్​.. 1,000 వెంటిలేటర్లు పంపిస్తామని వెల్లడి

ప్రతీకాత్మకచిత్రం

Britain Help: కరోనా సంక్షోభంలో భారత్​కు అండగా బ్రిటన్​.. మరో 1,000 వెంటిలేటర్లు పంపిస్తామని వెల్లడి

  • Share this:
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. మరే ఇతర దేశాల్లో లేని విధంగా ప్రతి రోజూ 4 లక్షల చేరువలో పాజిటివ్​ కేసులు, 3 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలతో ఆసుప్రత్రులపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. దీంతో బెడ్లు, ఆక్సిజన్​ లభించడం కష్టంగా మారింది. సకాలంలో ఆక్సిజన్​ లభించక రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. ఈ ఆపత్కాలం నుంచి బయట పడేందుకు భారత్​ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. భారత్​కు మద్ధుతుగా అంతర్జాతీయ సమాజం తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే గత వారం అమెరికా పెద్ద ఎత్తున ఆక్సిజన్​ సిలిండర్లు, మెడిసిన్​ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా ముందడుగు వేసింది.

ఇప్పటికే 495 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు, 120 నాన్​ ఇన్వేజిబుల్​ వెంటిలేటర్లు, 20 మాన్యువల్​ వెంటిలేటర్లను భారత్​కు పంపిన బ్రిటన్​.. ఇప్పుడు మరో 1,000 వెంటిలేటర్లను భారతదేశానికి పంపిస్తామని తెలిపింది. వీటితో పాటు 600 వైద్య పరికరాలను పంపడానికి సిద్ధమైంది. కోవిడ్-19తో పొరాడుతున్న భారత్ త్వరగా కోలుకోవాలి బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఆకాంక్షించారు.

"ఈ ఆపత్కాల సమయంలో భారత్​కు సహాయ పడటం మా విధి. గతేడాది యావత్​ ప్రపంచం కష్ట కాలంలో ఉన్నప్పుడు భారత్​ అండగా నిలిచింది. ఇప్పుడు భారత్​కు సహాయం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం భారత్​లో కరోనా తీవ్రత కారణంగా రోగులు పడుతున్న బాధలను గమనించాం. వారికి అత్యవసర సాయం చేయడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇందులో భాగంగా వెంటిలేటర్లను, ఆక్సిజన్​ను భారత్​కు పంపిస్తున్నాం. భారతదేశంలోని రోగులకు ఆక్సిజన్‌ను కొరత తీర్చడంలో ఇవి సహాయపడతాయి. ఇవేకాక రాబోయే రోజుల్లో మరిన్ని మందులను, మెడికల్​ పరికరాలను పంపడానికి సిద్దంగా ఉన్నాం" అని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇరు దేశాల మధ్య వర్చువల్​ సమ్మిట్​
మే​ 4న ఇరు దేశాల మధ్చ ద్వైపాక్షిక సంబంధాలపై వర్చువల్​ సమ్మిట్​ జరగనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్​ ప్రభుత్వం భారత్​కు పెద్ద ఎత్తున సహాయం చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఏప్రిల్‌ నెలలోనే బోరిస్​ జాన్సన్​ నేరుగా భారత్​కు వచ్చి మోదీతో చర్చించాలని నిర్ణయించుకున్నప్పటికీ కేసులు వేగంగా వృద్ధి చెందుతున్న కారణంగా ఈ సమావేశం రద్ధయ్యింది. ఇదిలా ఉంటే, కరోనా కట్టడికి లాక్​డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. అందువల్ల, లాక్​డౌన్​ విధించడానికి విముఖత చూపుతోంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతుండటంతో కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాలు నైట్​కర్ఫ్యూ, లాక్​డౌన్లను విధిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published: