Home /News /business /

BRIGHTCOM GROUP THIS IS THE STOCK THAT TURNED AN INVESTMENT OF ONE LAKH INTO RS 19 LAKH MK

Brightcom Group: ఒక లక్ష పెట్టుబడిని రూ.19 లక్షలుగా మార్చిన స్టాక్ ఇదే...మీరు ఓ లుక్కేయండి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిర్ణీత వ్యవధిలో 100% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే ఈక్విటీ స్టాక్‌ను మల్టీబ్యాగర్ స్టాక్ అంటారు. గత ఆరు నెలల్లో ఈ జాబితాలో పెద్ద మొత్తంలో స్టాక్స్ ప్రవేశించాయి. అయితే ఈ కోవలో బ్రైట్‌కామ్ గ్రూప్ (Brightcom Group) తన పెట్టుబడిదారుల కలలను నెరవేరుస్తోంది.

ఇంకా చదవండి ...
    కరోనా మహమ్మారి (Corona pandemic) తర్వాత స్టాక్ మార్కెట్లు (Stock Markets) కొత్త రికార్డులతో దూసుకుపోతున్నాయి. మార్కెట్ పరిస్థితులు అనుకూలించడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని స్టాక్స్ రెట్టింపు స్థాయిలో లాభాలను ఆర్జిస్తూ మల్టీబ్యాగర్ స్టాక్స్ జాబితాలో చేరుతున్నాయి. నిర్ణీత వ్యవధిలో 100% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే ఈక్విటీ స్టాక్‌ను మల్టీబ్యాగర్ స్టాక్ అంటారు. గత ఆరు నెలల్లో ఈ జాబితాలో పెద్ద మొత్తంలో స్టాక్స్ ప్రవేశించాయి. అయితే ఈ కోవలో బ్రైట్‌కామ్ గ్రూప్ (Brightcom Group) తన పెట్టుబడిదారుల కలలను నెరవేరుస్తోంది.  కంపెనీ షేరు ధర గత ఏడాది కాలంలో 2,700 శాతానికి పైగా పెరిగింది. అయితే గడిచిన మూడేళ్లలో ఈ స్టాక్ 7,000 కంటే ఎక్కువ లాభపడింది. గతేడాది జనవరిలో బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ షేర్లు రూ. 5 ధరతో ట్రేడయ్యాయి. గత ఏడాది కాలంలో రాకెట్ వేగంతో పెరిగిన దీని ధర ఇప్పుడు రూ.190 స్థాయికి చేరుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు బ్రైట్‌కామ్ గ్రూప్ (Brightcom Group) షేర్లలో ఒక సంవత్సరం క్రితం రూ. 50,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ రోజు మీ డబ్బు విలువ రూ.19 లక్షలకు పెరిగి ఉండేది. బ్రైట్‌కామ్ గ్రూప్ (Brightcom Group) ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. ఇది ప్రపంచంలోని అనేక దేశాలలో Ad-tech, New Media , IoT ఆధారిత వ్యాపారాల ద్వారా ఆదాయం పొందుతోంది. కంపెనీ అమెరికా, ఇజ్రాయెల్, లాటిన్ అమెరికా ME, వెస్టన్ యూరప్ , ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వ్యాపారం చేస్తుంది. దీని క్లయింట్ జాబితాలో Airtel, British Airways, Coca-Cola, Hyundai Motors, ICICI Bank, ITC, LIC, Maruti Suzuki, MTV, P&G Qatar Airways, Samsung, Viacom, Sony, Star India, Vodafone, Titan వంటి క్లయింట్స్ ఉన్నారు.

    జనవరి 25న కంపెనీ బోర్డు మీటింగ్ జరగనుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన నోటీసులో బ్రైట్‌కామ్ గ్రూప్ (Brightcom Group) తెలిపింది. ఈ కాలంలో బోనస్ షేర్ల జారీ ప్రతిపాదనను పరిశీలిస్తారు. 12 నెలల్లో బ్రైట్‌కామ్ గ్రూప్ (Brightcom Group) షేర్లు అనేక రెట్లు పెరిగాయని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇది ఇప్పుడు చాలా మంది చిన్న-పెట్టుబడిదారులకు అందుబాటులో లేని దశకు చేరుకుంది. అటువంటి పరిస్థితిలో, బోనస్ షేర్లను జారీ చేయడం ద్వారా, ఈ షేర్ చిన్న పెట్టుబడిదారులకు చౌకగా మారుతుంది. తద్వారా మా షేర్‌హోల్డర్‌ల జాబితాలో కొత్త సభ్యులను చేర్చుకోవచ్చు. ఎన్‌ఎస్‌ఈలో మంగళవారం బ్రైట్‌కామ్ గ్రూప్ (Brightcom Group) షేర్లు 5.00 శాతం నష్టపోయి రూ.181.50 వద్ద ముగిసింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Multibagger stock

    తదుపరి వార్తలు