హోమ్ /వార్తలు /బిజినెస్ /

ఇండియా యొక్క సాంకేతిక అంతరాన్ని తొలగించడం మన చేతుల్లోనే ఉంది –ఎలాగో చూడండి..

ఇండియా యొక్క సాంకేతిక అంతరాన్ని తొలగించడం మన చేతుల్లోనే ఉంది –ఎలాగో చూడండి..

Delivering Smiles

Delivering Smiles

విద్యా మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ - ఏడు పెద్ద రాష్ట్రాల్లో 40% నుండి 70% పాఠశాలకు వెళ్ళే పిల్లలకు డిజిటల్ పరికరాలు అందుబాటులో లేవు.

కోవిడ్-19 కారణంగా, దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు అకస్మాత్తుగా కోల్పోయిన పాఠశాల జీవితాలవైపు ఆశగా చూస్తున్నారు, ఎందుకంటే వారికి మొబైల్ ఇంటర్నెట్‌తో పాటు స్మార్ట్ ఫోన్లు మరియు టాబ్లెట్లు అందుబాటులో లేవు, అవి మహమ్మారి విజృంభించిన సమయంలో ఆన్‌లైన్ తరగతులను యాక్సెస్ చేసుకోవడానికి మరియు హాజరు కావడానికి అవసరం అయ్యాయి. ఇప్పుడు కూడా, పిల్లలకు వ్యాక్సినేషన్లు ఇంకా పెద్ద ఎత్తున ప్రారంభం కాలేదు, కాబట్టి ఈ ఆన్‌లైన్ విధానం కొత్త విధానంగా మారింది. విద్యా మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ - ఏడు పెద్ద రాష్ట్రాల్లో 40% నుండి 70% పాఠశాలకు వెళ్ళే పిల్లలకు డిజిటల్ పరికరాలు అందుబాటులో లేవు.

మరోవైపు, నిపుణులు తమ స్మార్ట్ ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేయడంలో ఆలస్యం చేయలేదు, ఇవి పని చేసేటప్పుడు వీడియో సమావేశాలకు హాజరు కావడానికి మరియు రాత్రి పూట తమకు ఇష్టమైన ప్రదర్శనలను చూడటానికి వీలు కల్పించింది. మధ్య మధ్యలో కోల్పోయిన లెక్కలేనన్ని సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు ఉన్నాయి, అవి అట్టడుగు వర్గాల పిల్లలు ఆ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి తమ అధ్యయనాలను కొనసాగించడానికి సహాయపడ్డాయి.

ఈ మహమ్మారి ద్వారా పెరిగిన డిజిటల్ అంతరం, మనం సమిష్టిగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. విద్య నుండి, ఆరోగ్య సంరక్షణ మరియు ఫైనాన్స్ సౌకర్యాల వరకు, తక్కువ ఆదాయం ఉన్న సమాజాలకు అడ్డంకులు ఎక్కువ అయ్యాయి. వెనుకబడిన విద్యార్థులు నిశ్శబ్దంగా చదువు నుండి బయటకి వచ్చేయడంతో బాల కార్మికులు మరియు బాల్య వివాహాల సమస్యలను పెంచవచ్చు.

ఈ ఏడాది అక్టోబర్‌లో Amazon India’s Delivering Smiles కార్యక్రమం దేశంలో ఈ విస్తరిస్తున్న డిజిటల్ అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. Delivering Smiles కార్యక్రమం ద్వారా, Amazon India అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు మరియు యువతకు డిజిటల్ పరికరాల సహకారాన్ని సులభతరం చేస్తుంది లేదా నేరుగా అందిస్తుంది, ఇది భారతదేశం యొక్క డిజిటలైజేషన్ లక్ష్యాలకు కూడా దోహదపడుతుంది.

Amazon నేరుగా 20,000 డిజిటల్ పరికరాలను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న యువతకు అందిస్తుంది, 150కి పైగా పెద్ద మరియు చిన్న లాభాపేక్ష లేని సంస్థల భాగస్వామ్యంతో, దేశవ్యాప్తంగా 100,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అదనంగా, లక్షలాది మంది Amazon వినియోగదారులు Amazon Payపై నగదు విరాళాన్ని అందించవచ్చు లేదా మరమ్మత్తుల చేసి యువతకు డిజిటల్ అభ్యసన పరికరాలను అందించడానికి పంపిణీ చేయబడేలా వారి పాత మొబైల్ ఫోన్లను ఇవ్వవచ్చు.

విజయగాథలు:

Delivering Smiles కార్యక్రమం నుండి ప్రయోజనం పొందిన విద్యార్థుల కథలలో కొన్ని, బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల అనితా పి, 9వ తరగతి చదువుతోంది, మహమ్మారి విజృంభించిన సమయంలో ఆమె కుటుంబాన్ని పోషించడానికి నిర్మాణ ప్రదేశాలలో పనిచేయాల్సి వచ్చింది. ఆమె కుటుంబం ఆమె చదువును కొనసాగించడానికి టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను భరించలేక ఆమె చదువును అకస్మాత్తుగా ఆపేసింది. Amazon విరాళంగా ఇచ్చిన టాబ్లెట్ అందుకున్నప్పటి నుండి, ఆమె అభ్యసన పెరిగింది మరియు ఆమె స్కోర్లు క్రమంగా మెరుగుపడ్డాయి.


హర్యానాకు చెందిన 12 ఏళ్ల హిమాన్షు చదువు కొనసాగించాలని కోరుకున్నాడు, కానీ ఈ మహమ్మారి సమయంలో అతని తండ్రి వార్తాపత్రిక అమ్మకందారుగా ఉద్యోగం కోల్పోయినప్పుడు, ఇంజనీర్ కావాలనే అతని కల మసకబారడం ప్రారంభించింది. Amazon యొక్క స్థానిక NGO భాగస్వాములు అతన్ని గుర్తించి, టాబ్లెట్ అందించిన్నప్పుడు మాత్రమే, అతని ఉపాధ్యాయుల సహాయంతో అతని కలలకు జీవం వచ్చింది.


హరిద్వార్‌కు చెందిన 11 ఏళ్ల తరుణ్ కుమార్ Amazon విరాళంగా ఇచ్చిన టాబ్లెట్ పొందిన మరొక లబ్ధిదారుడు, ఇది తన స్నేహితుడితో స్మార్ట్ ఫోన్ పంచుకోవడానికి ఎక్కువ దూరం ప్రయాణించవలసి వచ్చిన అలసి పోయిన తరువాత విద్యపై తిరిగి దృష్టి పెట్టడానికి సహాయపడింది. రోజువారీ వేతన కార్మికుడైన అతని తండ్రి అదనపు ఖర్చును భరించలేకపోయాడు, ఈ రోజు, తరుణ్ మరియు అతని సోదరి ఇద్దరూ తమ చదువు కోసం టాబ్లెట్‌ను ఉత్తమంగా ఉపయోగించుకుంటున్నారు.


ఒక చిన్న పరికరాన్ని సురక్షితంగా యాక్సెస్ చేసుకోవడం అనేది మహమ్మారి కారణంగా రోజువారీ మరియు అభ్యసన విధానం శాశ్వతంగా మారిపోయిన ఒక వ్యక్తి జీవితంలో ఎంతటి భారీ ప్రభావాన్ని తీసుకురాగలదో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇది మన సెకండ్‌హ్యాండ్ పరికరాలపై మన దృష్టిని మార్చుకునేలా చేస్తుంది మరియు వాటికి కొత్త అర్థాన్ని ఇవ్వడానికి, కోల్పోయిన చిరునవ్వును తిరిగి తీసుకురావడానికి మరియు దేశం యొక్క డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడటానికి ఒక ప్రేరణ ఇస్తుంది. కాబట్టి ముందుకు సాగండి, మీ పాత ఫోన్‌కు కొత్త గుర్తింపును ఇవ్వండి, లేదా నగదు రూపంలో దోహదపడండి మరియు ఉజ్వలమైన భవిష్యత్తుతో వెనుకబడిన పిల్లలను శక్తివంతం చేయడానికి సహాయపడండి. సహకారం అందించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

This article has been created by Studio 18 team on behalf of Amazon India.

First published:

Tags: Amazon, AMAZON INDIA, AMAZON PAY, Digital Platform

ఉత్తమ కథలు