Home /News /business /

BREAKING NEWS MAN DETAINED BY MUMBAI POLICE FROM BORIVALI AREA IN THREAT CALLS TO MUKESH AMBANI CASE SS

Breaking News: ముకేష్ అంబానీకి బెదిరింపు కేసులో ఒకర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Breaking News: ముకేష్ అంబానీకి బెదిరింపు కేసులో ఒకర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
(File Photo: Mukesh Ambani)

Breaking News: ముకేష్ అంబానీకి బెదిరింపు కేసులో ఒకర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు (File Photo: Mukesh Ambani)

Breaking News | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని (Mukesh Ambani) చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేసిన కేసులో పోలీసులు ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని (Mukesh Ambani) మూడు గంటల్లో చంపేస్తానంటూ ఓ వ్యక్తి పదేపదే ఫోన్ కాల్స్ చేయడం కలకలం రేపింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి (Reliance Foundation Hospital) ఈ కాల్స్ వచ్చాయి. ఈ కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ బోరివలి MHB కాలనీకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దహిసర్ నివాసిగా చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. సీఆర్‌పీఎఫ్ పోలీసులు బలగాలు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. ఆంటీలియా దగ్గర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నాయి. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్‌కు ఫోన్ కాల్స్ చేశాడు. తాను నెంబర్ వన్ టెర్రరిస్ట్ అని, ముకేశ్ అంబానీ అంతుచూస్తానని బెదిరించడంతో పాటు ఎన్ఐఏ, ఏటీఎస్, ముంబై పోలీసులపై దుర్భాషలాడాడు. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు అఫ్జల్ అని చెప్పినట్టు తెలుస్తోంది.
మేము మా ఆస్పత్రిలో జెండా వందన కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య మా ఛైర్మన్‌ను బెదిరిస్తూ ఒకే నెంబర్ నుంచి 8 నుంచి 9 కాల్స్ వచ్చాయి. ముంబై పోలీసుల్ని అప్రమత్తం చేశాం. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దర్యాప్తు మొదలైంది.
డాక్టర్ తారంగ్ గ్యాన్‌చందని, సీఈఓ, హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్

రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి అధికారుల నుంచి కంప్లైంట్ తీసుకున్న డీబీ మార్గ్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ రికార్డుల్ని విన్నారు. అతను మానసిక రోగి కావచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. మానసిక ఒత్తిడితో ఉన్న వ్యక్తి తన కోపాన్ని వ్యక్తపరిచేందుకు పదేపదే కాల్స్ చేసి ఉండొచ్చని భావించారు. అయినా దర్యాప్తు కొనసాగించి కొన్ని గంటల వ్యవధిలోనే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు డీసీపీ చేరుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతను ముంబై శివారులోని దహిసర్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.

ఆంటిలియా భవనం బయట భద్రతను పెంచుతామని, ప్రైవేట్ భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే పెంచామని పోలీసు ఉన్నతాధికారులు CNN News18 కి తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలు ఉన్న వాహనం ఆంటీలియా భవనం బయట కనుగొన్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను కొనసాగించాలని ఈ ఏడాది జూలైలో సుప్రీం కోర్టు అనుమతిస్తూ, త్రిపుర హైకోర్టు ముందు ఉన్న పిల్‌పై ప్రొసీడింగ్స్‌ని రద్దు చేసింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Mukesh Ambani, Reliance, Reliance Industries

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు