WhatsApp Payments: బ్రెజిల్‌లో వాట్సప్ పేమెంట్స్ బంద్... ఇండియాలో పరిస్థితేంటీ?

WhatsApp Payments Service | పేమెంట్ సేవల్ని ప్రారంభించాలని వాట్సప్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలు ఎక్కువవుతున్నాయి. బ్రెజిల్‌లో వాట్సప్ పేమెంట్ సేవల్ని నిలిపివేసింది అక్కడి ప్రభుత్వం.

news18-telugu
Updated: June 25, 2020, 12:06 PM IST
WhatsApp Payments: బ్రెజిల్‌లో వాట్సప్ పేమెంట్స్ బంద్... ఇండియాలో పరిస్థితేంటీ?
WhatsApp Payments: బ్రెజిల్‌లో వాట్సప్ పేమెంట్స్ బంద్... ఇండియాలో పరిస్థితేంటీ? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్రెజిల్‌లో వాట్సప్ పేమెంట్స్ లాంఛ్ చేసిన వారం రోజుల్లోనే ప్రభుత్వం ఈ సేవల్ని నిలిపివేయడం సంచలనంగా మారింది. అయితే ఇండియాలో వాట్సప్ పేమెంట్స్ సర్వీస్‌ను విజయవంతంగా లాంఛ్ చేస్తామని వాట్సప్ ప్రకటించింది. ఇందుకోసం స్థాని బ్యాంకులు, రెగ్యులేటర్స్‌తో కలిసి పనిచేస్తున్నామని వాట్సప్ వివరించింది. వాస్తవానికి భారతదేశంలో యూనిఫైడ్ పేమెట్స్ ఇంటర్‌ఫేస్-UPI ద్వారా వాట్సప్ పేమెంట్ సర్వీస్ రెండేళ్ల క్రితమే రావాల్సి ఉండగా రెగ్యులేటరీ సమస్యలతో బీటా దశలోని ఆగిపోయింది. ఇటీవల వాట్సప్ పేమెంట్ సేవల్ని తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NCPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI ఆధారంగా వాట్సప్ పేమెంట్స్ పనిచేస్తుంది. ఇండియాలో పేమెంట్ సేవల్ని అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది వాట్సప్. రెగ్యులేటరీ పనులు పూర్తి కాగానే వాట్సప్ పేమెంట్ పూర్తి స్థాయిలో లాంఛ్ చేసేందుకు అనుమతి రానుంది.

బ్రెజిల్‌లో పేమెంట్ సేవలు నిలిపివేయడంతో అక్కడి సెంట్రల్ బ్యాంకుతో కూడా సంప్రదింపులు జరుపుతోంది వాట్సప్. దాంతో పాటు ఇక్కడ భారతదేశంలో కూడా సంబంధిత వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటోంది. ప్రస్తుతం భారతదేశంలో వాట్సప్ పేమెంట్స్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. టెస్టింగ్ స్టేజ్ కాబట్టి 10 లక్షల మంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందించాలన్న నిబంధన ఉంది. అందుకే కొందరికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సప్ పేమెంట్ ఫీచర్ ద్వారా ఉపయోగించి డబ్బులు పంపొచ్చు. స్వీకరించొచ్చు. ఇందుకోసం యూజర్లు తమ బ్యాంకు అకౌంట్‌ను వాట్సప్ పేమెంట్స్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్ పే, గూగుల్ పే లాగే వాట్సప్ పేమెంట్స్ పనిచేస్తుంది.

 
First published: June 25, 2020, 9:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading