హోమ్ /వార్తలు /బిజినెస్ /

Brahmastra: వారి కొంప ముంచిన బ్రహ్మాస్త్ర.. ఇదెక్కడి వింత!

Brahmastra: వారి కొంప ముంచిన బ్రహ్మాస్త్ర.. ఇదెక్కడి వింత!

కొంప ముంచిన బ్రహ్మాస్త్ర.. ఒకే రోజు రూ. 940 కోట్ల నష్టం!

కొంప ముంచిన బ్రహ్మాస్త్ర.. ఒకే రోజు రూ. 940 కోట్ల నష్టం!

Brahmastra Collection | బ్రహ్మాస్త్ర సినిమా ఎఫెక్ట్ గట్టి గానే పడింది. స్టాక్ మార్కెట్‌లో ఐనాక్స్, పీవీఆర్ షేర్లు భారీగా నష్టపోయాయి. 5 శాతం మేర క్షీణించాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీగా కోల్పోయారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Alia Bhatt | బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ సినిమా బ్రహ్మాస్త్ర ఎట్టకేలకు బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ కలెక్షన్లు ఆశించినంత స్థాయిలో లేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ కావడంతో పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. తొలి రోజు వసూళ్ల దెబ్బ మాత్రం కొంత మందిపై భారీగానే పడింది. మల్టీప్లెక్స్ కంపెనీలు బ్రహ్మాస్త్ర (Brahmastra) దెబ్బకు కుదేలయ్యాయి. భారీగానే నష్టపోయాయి. పీవీఆర్ (PVR), ఐనాక్స్ (INOX) వంటి కంపెనీల షేర్లలో అమ్మకాల సునామీ కొనసాగింది. భారీగా షేర్లు పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు కొన్ని వందల కోట్ల రూపాయల మేరinox నష్టపోయారు.

  బ్రహ్మాస్త్ర సినిమాకు తొలి రోజు కలెక్షన్లు అంచనాల కన్నా తక్కువగా ఉండటంతో ఆ ప్రభావం మల్టీప్లెక్స్ కంపెనీల స్టాక్స్‌పై తీవ్రంగానే పడింది. పీవీఆర్ స్టాక్స్ రూ. 1,834 వద్ద క్లోజ్ అయ్యాయి. షేరు ధర 5.27 శాతం లేదా రూ. 102 మేర పడిపోయింది. ఇంట్రాడేలో షేరు ధర రూ. 1825 స్థాయికి కూడా పతనం అయ్యింది. అలాగే ఐనాక్స్ షేరు కూడా ఇదే దారిలో నడిచింది. ఈ స్టాక్ ధర రూ. 494 వద్ద క్లోజ్ అయ్యింది. షేరు ధర దాదాపు 5 శాతం పడిపోయింది. లేదా రూ. 25 మేర క్షీణించింది. ఈ కంపెనీల షేర్లు పడిపోవడం వల్ల ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 940 కోట్ల మేర కోల్పోయారు.

  ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వాడుతున్నారా? రోజుకు ఎంత డబ్బు పంపొచ్చొ తెలుసుకోండి!

  భారీ బడ్జెట్ సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయని, అయితే సినిమా మాత్రం అంచనాలకు అందుకోలేక పోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌని రాయ్ వంటి స్టార్లు ఇందులో నటించారు. షారూఖ్ ఖాన్‌తో కామియో రోల్ చేయించారు.

  ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు షాక్.. ఈ రోజు నుంచి కొత్త నిర్ణయం అమలులోకి

  కాగా బ్రహ్మాస్త్ర సినిమా తొలి రోజు రూ. 35 కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. టాక్ ఆశాజనకంగా లేకపోవడం వల్ల పెట్టిన డబ్బులను సినిమా రికవరీ చేయకపోవచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బిగ్ స్టార్స్ ఉన్నా కూడా సినిమా గట్టెక్కేలా లేదని చెబుతున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెలకొన్న నెగటివిటీ అంతా ఇంతా కాదని చెప్పుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Alia bhat, Alia Bhatt, Bollywood Movie, Brahmastra, Ranbir Kapoor

  ఉత్తమ కథలు