Home /News /business /

Bounce-E Electric Scooter: ఎన్నో ప్రత్యేకతలతో లాంఛ్ అయిన బౌన్స్‌-ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. షాకింగ్ ఫీచర్లు ఇవే.. తెలుసుకోండి

Bounce-E Electric Scooter: ఎన్నో ప్రత్యేకతలతో లాంఛ్ అయిన బౌన్స్‌-ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. షాకింగ్ ఫీచర్లు ఇవే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ మొబిలిటీ సొల్యూష‌న్స్‌ను అందించే బెంగ‌ళూరుకు చెందిన బౌన్స్ (Bounce) ఇప్పుడు మ‌రో మైలురాయిని చేరుకుంది. త‌మ ప్ర‌యాణంలో బౌన్స్‌‌-ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను జ‌త చేసుకుంది.

స్మార్ట్ మొబిలిటీ సొల్యూష‌న్స్‌ను అందించే బెంగ‌ళూరుకు చెందిన బౌన్స్ (Bounce) ఇప్పుడు మ‌రో మైలురాయిని చేరుకుంది. త‌మ ప్ర‌యాణంలో బౌన్స్‌‌-ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను జ‌త చేసుకుంది. ఇది బౌన్స్ యాప్‌లో ల‌భిస్తుంది. వినియోగ‌దారులు స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ల ద్వారా, అలాగే లాంగ్-ట‌ర్మ్ రెంట్ బేసెస్‌లో ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను పొంద‌వ‌చ్చు. బౌన్స్-ఈ. కోడ్ పేరు ఎన్‌3310. కొన్నినెల‌లుగా దీన్ని డెవ‌ల‌ప్ చేస్తున్నారు. అందులోనూ ఇది పూర్తిగా సొంత‌ంగా అభివృద్ధి చేసుకున్న‌ది. గ‌త సంవ‌త్స‌రం చూపించిన ఒరిజిన‌ల్ వ‌ర్ష‌న్‌తో పోల్చితే ఈ వేరియంట్‌లో కొన్ని చిన్న మార్పులు చేశారు. ఉదాహ‌ర‌ణకు.. వైజ‌ర్ ఇప్పుడు లేదు. ప్రొట్రూడింగ్ హెడ్ ల్యాంప్ చిన్న‌గా క‌నిపిస్తోంది. మ‌రో మార్పు ఏంటంటే, మామూలుగా ముందు ఉండే స్ప్రింగ్ లోడెడ్ స‌స్పెన్ష‌న్ ను అంత‌కుముందు చూపించిన టెలిస్కోపిక్ స‌స్పెన్ష‌న్ స్థానంలో ఉంచారు. ఇప్పుడు సీటు కాంట్రాస్టింగ్ పైపింగ్ తో ఉంది. ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ (electric scooter) కి ఉన్న డ్యూయ‌ల్‌-టోన్ థీమ్ అంత‌టికీ మ్యాచింగ్ గా ఉంటుంది. బౌన్స్‌-ఇ మొత్తం డిజైన్‌ చాలా త‌క్కువ వైబ్స్ తో ఉంది. అలాగే ఇది అచ్చంగా 100సీసీ మోపెడ్‌లా క‌నిపిస్తుంది. న‌డిపే పొజిష‌న్‌లో ఫుట్‌రెస్ట్ ఉండ‌టంతో మొత్తానికి దీన్ని న‌డిపై తీరు కాస్త వేరుగానే ఉంటుంది. ఎక్కువ సౌక‌ర్య‌వంతంగా ఉండేలా క‌నిపిస్తోంది. అలాగే, ఒక‌వేళ స్కూట‌ర్ ముందు భాగంలో ఎక్కువ ల‌గేజీ ఉన్నా మంచి కంట్రోల్‌ల్లోనే ఉండే విధంగా ఉంది.

మార్చుకోద‌గిన బ్యాట‌రీ
ఇంట‌‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఆటోమోటీవ్ టెక్నాల‌జీ (ఐసిఎటి) నుంచి గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో బౌన్స్-ఇ హోమోలోగేష‌న్ స‌ర్టిఫికేట్‌ను అందుకుంది. ఈ ఎల‌క్ట్రిక‌ల్ స్కూట‌ర్‌ స్వాప‌బుల్ బ్యాట‌రీతో వ‌స్తుంద‌ని కంపెనీ క‌న్‌ఫార్మ్ చేసింది. ఈ బౌన్స్‌-ఇ స్కూట‌ర్‌ను ఉప‌యోగించ‌డం చాలా సులువు. ఈ స్కూట‌ర్ పూర్తిగా చార్జింగ్ చేస్తే 60 కి.మీ. వరకూ ప్రయాణించవచ్చు. ఇది ఖ‌చ్ఛిత‌మైన బ్యాట‌రీ-స్వాపింగ్ నెట‌్ వ‌ర్క్‌తో ఉంటుంది. అందుకే వినియోగ‌దారులు ఛార్జింగ్ అయిపోయిందేమోన‌ని బాధ‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు.

ఎల‌క్ట్రిక్ టూ-వీల‌ర్ సెగ్మెంట్‌లో బ్యాట‌రీ స్వాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను రివోల్ట్ మోటార్స్ డెవ‌ల‌ప్ చేశారు. రిచార్జ్ స్టేష‌న్ల‌తో పోల్చుకుంటే వినియోగ‌దారుల‌కు బ్యాట‌రీ స్వాపింగ్ చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఇలా ఎందుకంటే, ఎంత వేగంగా చార్జింగ్ చేసినా ఎల‌క్ట్రిక్ టూ-వీల‌ర్ (two-wheeler)‌ను రీచార్జ్ చేయ‌డానికి కొన్ని నిమిషాలు తీసుకుంటుంది. అయితే వినియోగ‌దారులుఈ బ్యాట‌రీ స్వాపింగ్ తో దాదాపుగా వెంట‌నే ఫుల్ చార్జ్ చేయ‌వ‌చ్చు. బౌన్స్-ఇ విష‌యానికొస్తే, ఒక నిమిషం కంటే త‌క్కువ స‌మ‌యంలోనే ఈ బ్యాట‌రీని స్వాప్ చేయొచ్చు.

బౌన్స్‌-ఈ (Bounce-E) ధ‌ర
దీన్ని అంద‌రికీ అందుబాటులో ఉంచ‌డానికి, కంపెనీ ఒక డైన‌మిక్ ప్రైజింగ్ ప్యాకేజ్‌ని ప్ర‌వేశ‌పెట్టింది. బ్యాట‌రీ లేకుండా ఉన్న యూనిట్ల‌న్నింటినీ రూ. 46,000కే అందిస్తోంది. బ్యాట‌రీని అద్దెకి ఆఫ‌ర్ చేస్తున్నారు. ఇది వినియోగ‌దారుల‌కు మొత్తం కొనుగోలు ఖ‌ర్చును త‌గ్గిస్తుంది. ఇప్ప‌టికైతే బౌన్స్ బెంగ‌ళూరు (Bangalore), హైద‌రాబాద్‌ (Hyderabad)లో ఉంది. బెంగ‌ళూరులో 22 వేల టూ-వీల‌ర్ల‌ను క‌లిగి ఉంటే, హైద‌రాబాద్‌లో 5 వేల వ‌ర‌కూ ఉన్నాయి. భ‌విష్య‌త్తులో ఇత‌ర న‌గ‌రాల్లోనూ బౌన్స్ త‌న ఆప‌రేష‌న్ల‌ను వ్యాపింప‌చేయాల‌ని ప్లాన్ చేస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Bangalore, Electric Bikes, Electric vehicle

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు