Home /News /business /

BOULT AUDIO FREEPODS PRO TWS EARBUDS WITH 32 HOUR BATTERY LIFE LAUNCHED IN INDIA MK GH

Boult Freepods Pro: బౌల్ట్ నుంచి సరికొత్త టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ వరుసగా స్మార్ట్​ ఉత్పత్తులను విడుదల చేస్తూ దూకుడుమీదుంది. బౌల్ట్ ఇటీవల వైర్​లెస్​ హెడ్​ఫోన్స్​ను లాంచ్​ చేయగా.. ఇప్పుడు ఆడియో ఫ్రీపాడ్స్ ప్రో వైర్‌లెస్ టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్​ను విడుదల చేసింది.

ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ వరుసగా స్మార్ట్​ ఉత్పత్తులను విడుదల చేస్తూ దూకుడుమీదుంది. బౌల్ట్ ఇటీవల వైర్​లెస్​ హెడ్​ఫోన్స్​ను లాంచ్​ చేయగా.. ఇప్పుడు ఆడియో ఫ్రీపాడ్స్ ప్రో వైర్‌లెస్ టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్​ను విడుదల చేసింది. ఈ వైర్​లెస్ ఇయర్​బడ్స్​లో​ ఇన్-ఇయర్ డిజైన్, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్స్​ట్రా బాస్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించింది. వీటిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే చాలు 8 గంటలు వరకు పనిచేస్తాయి. అయితే ఛార్జింగ్ కేసులో ఉంటే 32 గంటల వరకు పనిచేయగలవు. ఈ ఫ్రీపాడ్స్ ప్రోలో యూఎస్​బీ టైప్-సి పోర్టును అందించారు. కేవలం 10 నిమిషాల ఛార్జ్​తో ఇవి 100 నిమిషాల ప్లేబ్యాక్ అందిస్తాయని కంపెనీ పేర్కొంది.

బౌల్ట్ ఆడియో ఫ్రీపాడ్స్ ప్రో ధర

కొత్త బౌల్ట్ ఆడియో ఫ్రీపాడ్స్ ప్రో ఇయర్​బడ్స్​ భారత మార్కెట్​లో రూ. 1,299 ధర వద్ద లభిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్​ బ్లాక్, బ్లూ, వైట్ అనే మూడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఇవి ఏడాది పాటు వారెంటీతో వస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్లు

బౌల్ట్ ఆడియో ఫ్రీపాడ్స్ ప్రో టీడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్‌లో అదనపు బాస్ కోసం మైక్రో-సబ్‌ వూఫర్, కాల్ క్వాలిటీ కోసం రెండు మైక్రోఫోన్‌లను అందించింది. వీటిని ఎర్గోనామిక్ షేప్​లో రూపొందించింది. వర్షం, నీరు, చెమట నుండి ఇయర్​బడ్స్​ పాడవ్వకుండా ఉండేందుకు IPX5 వాటర్​ రెసిస్టన్ట్ వంటివి చేర్చింది. ఈ ఇయర్‌బడ్స్​ బ్లూటూత్ వి 5కి మద్దతిస్తాయి. ఆడియో ఫ్రీ పాడ్స్​లో కాల్స్​ యాక్సెప్ట్​ లేదా రిజెక్ట్, వాల్యూమ్‌,​ మ్యూజిక్ ట్రాక్‌లను కంట్రోల్​ చేయడానికి వీటిలో టచ్ కంట్రోల్స్​ను అందించింది. ఇక. బౌల్ట్ ఆడియో ఫ్రీపాడ్స్ ప్రోను ఒక్కసొరి ఛార్జ్​ చేస్తే 8 గంటల బ్యాటరీ బ్యాకప్​ అందిస్తుంది. ఛార్జింగ్​ కేసులోనే ఉంచితే మొత్తం 32 గంటల బ్యాటరీ లైఫ్​ ఇస్తుంది. ఫ్రీపాడ్స్ ప్రో ఛార్జింగ్​ కోసం ప్రత్యేకంగా యూఎస్‌బి టైప్-సి పోర్ట్‌ను చేర్చింది. ఇది కేవలం 10 నిమిషాల ఛార్జ్​తో 100 నిమిషాల ప్లేబ్యాక్​ను అందించగలదు. ఈ ఇయర్‌బడ్స్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి రెండు గంటల సమయం పడుతుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Gadget, Technology

తదుపరి వార్తలు