హోమ్ /వార్తలు /బిజినెస్ /

Car Insurance: ఈ దీపావళికి కొత్త కారు కొన్నారా? మోటార్ ఇన్సూరెన్స్ ఖర్చు ఇలా తగ్గించుకోండి

Car Insurance: ఈ దీపావళికి కొత్త కారు కొన్నారా? మోటార్ ఇన్సూరెన్స్ ఖర్చు ఇలా తగ్గించుకోండి

Car Insurance: ఈ దీపావళికి కొత్త కారు కొన్నారా? మోటార్ ఇన్సూరెన్స్ ఖర్చు ఇలా తగ్గించుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Car Insurance: ఈ దీపావళికి కొత్త కారు కొన్నారా? మోటార్ ఇన్సూరెన్స్ ఖర్చు ఇలా తగ్గించుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Car Insurance | దీపావళికి ఆటోమొబైల్ కంపెనీలు, బ్యాంకులు ఆఫర్ల మీద ఆఫర్స్ ప్రకటించడంతో పోటీపడి మరీ కార్లు కొన్నారు కస్టమర్లు. కొత్త కారైనా, పాత కారైనా వాహనానికి ఇన్స్యూరెన్స్ (Vehicle Insurance) తప్పనిసరి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పండుగ సీజన్ (Festival Season) సందర్భంగా భారతదేశంలో కార్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు (Car Sales) భారీగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దసరా, ధన త్రయోదశి, దీపావళి సందర్భంగా ఆటో మొబైల్ కంపెనీలు, బ్యాంకులు ప్రకటించిన స్పెషల్ డిస్కౌంట్లు, లోన్ ఆఫర్ల (Loan Offers) కారణంగా సేల్స్ పెరిగాయి. అయితే కొత్త కార్లకు మోటార్ ఇన్సూరెన్స్ (Motor Insurance) తప్పనిసగా తీసుకోవాలి. దీనికి చెల్లించే ప్రీమియం భారం కాకూడదంటే, కార్ల యజమానులు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అవేంటో చూద్దాం.

నో-క్లెయిమ్ బోనస్‌

ప్రీమియం ధరను తగ్గించుకోవడానికి నో-క్లెయిమ్ బోనస్ అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం. పాలసీదారులు కారును బాగా చూసుకున్నందుకు, సంవత్సరంలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయనందుకు బీమా సంస్థ అందించే బోనస్ ఇది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయని ప్రతి సంవత్సరానికి, బీమా చేసిన వ్యక్తి మంచి తగ్గింపులను పొందుతారు. అంటే రెన్యువల్ సమయంలో బీమా ప్రీమియం తగ్గుతుంది. ఇది వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకుంటే.. ఆ మేరకు ప్రీమియం భారం ఆదా అవుతుంది. నిబంధనల ప్రకారం.. క్లెయిమ్‌లు లేకుంటే మొదటి సంవత్సరంలో 20 శాతం తగ్గింపు, రెండేళ్ల తర్వాత 25 శాతం తగ్గింపు, మూడేళ్ల తర్వాత 35 శాతం తగ్గింపు, నాలుగేళ్ల తర్వాత 45 శాతం తగ్గింపునకు పాలసీ హోల్డర్స్ అర్హులు.

Savings Rule: మీరు కోటీశ్వరులు కావడానికి ఈ ఒక్క రూల్ చాలు... ఇలా పొదుపు చేయండి

పే యాజ్ యు డ్రైవ్ పాలసీ

కారును చాలా తక్కువగా బయటకు తీసేవారు, తాము వాహనాన్ని నడిపే సమయానికే ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది 'పే యాజ్ యు డ్రైవ్' పాలసీ. ఈ టెక్-ఎనేబుల్డ్ పాలసీని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) 2020లో ప్రవేశపెట్టింది. కారు వినియోగం ఆధారంగా బీమా ప్రీమియం చెల్లించే ఈ విధానంలో పాలసీదారుడు బైండింగ్ థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని పొందుతారు. కానీ ఓన్ డ్యామేజ్ కాంపోనెంట్ అనేది కారు వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా ట్రాకింగ్ డివైజ్ లేదా మొబైల్ యాప్‌తో కారు ఎన్ని కిలోమీటర్లు నడిచిందో లెక్కించి, ఆ ప్రకారంగానే ప్రీమియం ఎంత అనేది నిర్ధారిస్తారు. వాహనాన్ని నడపని రోజుల్లో ఇన్సూరెన్స్‌ను స్విచ్ ఆఫ్ చేయవచ్చు.

ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ

ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం ఒకటి కంటే ఎక్కువ కార్లను కొనుగోలు చేస్తే.. అన్ని వాహనాలకు విడిగా మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి భారీగా ప్రీమియం కట్టాలి. అలా కాకుండా కార్లు అన్నింటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకోవచ్చు. అంటే ఒక్క పాలసీతో అన్ని కార్లకు కలిపి కవరేజీ పొందవచ్చు. దీంతో ప్రీమియం ఆటోమేటిక్‌గా తగ్గుతుంది.

LIC Policy: నెలకు రూ.2,000 పొదుపు చేస్తే రూ.48 లక్షల రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

‘పే హౌ యు డ్రైవ్’ యాడ్ ఆన్

ఇది సేఫ్టీ రైడింగ్‌కు ఇచ్చే రివార్డు లాంటిది. డ్రైవింగ్ అలవాట్లు, ప్రొఫైల్‌ను ట్రాక్ చేసే 'పే-హౌ-యు-డ్రైవ్' మోడల్‌ను IRDAI ఇటీవల ప్రారంభించింది. ఈ యాడ్ ఆన్‌తో ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించే పాలసీహోల్డర్లకు మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారు లేదా స్పీడ్ లిమిట్ దాటిన వారి కంటే అన్ని రూల్స్ ఫాలో అయ్యేవారు తక్కువ ప్రీమియం చెల్లించవచ్చు. ఈ యాడ్ ఆన్ రోడ్ సేఫ్టీకి కూడా సపోర్ట్ చేస్తుంది.

డిడక్టబుల్స్‌తో బెనిఫిట్స్

మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో డిడక్టబుల్స్ అనేవి అవుట్ ఆఫ్ ది పాకెట్ కాస్ట్. ఇన్సూరెన్స్ డిడక్టబుల్ అంటే.. క్లెయిమ్‌ చేసిన మొత్తాన్ని బీమా సంస్థ చెల్లించడానికి ముందు, పాలసీ హోల్డర్ తప్పనిసరిగా ఖర్చు చేయాల్సిన నిర్దిష్ట మొత్తం. బీమా చేసిన వ్యక్తి క్లెయిమ్ సమయంలో భరించడానికి అంగీకరించే మొత్తం ఇది. ఈ డిడక్టబుల్స్‌ను జాగ్రత్తగా, రిస్క్ ప్రొఫైల్ ప్రకారం ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీరు డిడక్టబుల్ మొత్తాన్ని నిల్‌గా ఉంచితే, మీరు జేబులో నుంచి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకుండా మొత్తం క్లెయిమ్ అమౌంట్ అందుకుంటారు. కానీ దీనికి అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి తక్కువ అవకాశం ఉన్న నమ్మకమైన డ్రైవర్ అయితే, అధిక డిడక్టబుల్‌ను ఎంచుకొని, ప్రీమియం ఆదా చేయవచ్చు.

First published:

Tags: Auto News, Cars, Insurance, Motor insurance, Personal Finance

ఉత్తమ కథలు