Home /News /business /

BORN BLIND NOW HE BECAME SUCCESSFUL ENTREPRENEUR KNOW ABOUT INSPIRING STORY OF BOLLANT INDUSTRIES FOUNDER SRIKANTH BOLLA SS BK

Success Story: విధి రాతను మార్చి ఆంట్రప్రెన్యూర్‌గా మారిన ఓ అంధుడి విజయగాథ ఇది

Success Story: విధి రాతను మార్చి ఆంట్రప్రెన్యూర్‌గా మారిన ఓ అంధుడి విజయగాథ ఇది

Success Story: విధి రాతను మార్చి ఆంట్రప్రెన్యూర్‌గా మారిన ఓ అంధుడి విజయగాథ ఇది

Success Story | పుట్టుకతోనే అంధుడు అతను. కానీ ఇప్పుడు ఓ పరిశ్రమ వ్యవస్థాపకుడిగా ఎంతోమంది దివ్యాంగులకు, యువతీయువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు శ్రీకాంత్ బొల్ల. అతని విజయగాథ తెలుసుకోండి.

  M.Balakrishna, News18, Hyderabad

  ఒక పని చేయకపోతే నీవల్ల కాదు... కాదు అనే విమర్శను ఎదుర్కోవాలి అంటే ఎంతో దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలి. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కాల్సి ఉంటుంది. అన్ని ఉన్న కొందరి నిర్లక్ష్యంతో వారి గమ్యానికి చేరుకోలేరు. పుట్టుకతో అంధులమని ఏనాడూ వెనకడుగు వేయలేదు. తమ లోపాన్ని అంటి పెట్టుకొని చేతకాని వాళ్ళలా వీరు ఎప్పుడు ఒకరిపై ఆధార పడలేదు. తన జీవితాన్నే తామే పోషించుకోగలమన్న దైర్యం ఉన్నవాళ్లుగా తీర్చి దిద్దుతూ...చీకట్లో ఉన్న ఓ దీపం వీరి జీవితంలో వెలుగు నింపుతోంది. అతను  లోకాన్ని చూడలేను వ్యక్తి తనలాంటి పదిమందికి మార్గం కావాలని సంకల్పించాడు.

  అబ్దుల్ కాలం అభినందించిన.... రతన్ టాటా ప్రశంసలు కురిపించిన ఒదిగి ఉండే గుణాన్ని అలంభించుకొని.... మానవత్వం ఉన్న మనిషినని తన చేతల ద్వారా నిరూపించుకున్నాడు యువ వ్యాపారవేత్త శ్రీకాంత్ బోళ్ల. పుట్టుకతోనే తాను అంధుడైన విజయాలను అందుకుంటూ అవమానాలను తరిమికొట్టిన మహోన్నతమైన వ్యక్తి శ్రీకాంత్. 30 ఏళ్ళ వయస్సులోనే.... తన అంధత్వం అనేది తన విజయానికి అడ్డుకాదని 130 కోట్ల టర్న్ ఓవర్ ను సొంతం చేసుకున్నాడు అంధుడైన శ్రీకాంత్ బోళ్ల. అసలు అంతటి విజయాన్ని శ్రీకాంత్ ఎలా సాధించాడు. అయన సంకల్పం వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయో.... అయన గురించి తెలిసిన వాళ్లు చర్చించుకోక మానరు.

  Business Ideas: జాబ్ చేయకుండా డబ్బు సంపాదించాలా? ఈ 8 ఐడియాలు మీకోసమే

  bolla srikanth family, bolla srikanth history, bolla srikanth telugu, bollant industries ceo srikanth bolla, srikanth bolla biography, srikanth bolla interview, srikanth bolla speech, srikanth bolla story, srikanth bolla ted talk, ఆంట్రప్రెన్యూర్ శ్రీకాంత్ బొల్ల, శ్రీకాంత్ బొల్ల, శ్రీకాంత్ బొల్ల ఎవరు, శ్రీకాంత్ బొల్ల కథ, శ్రీకాంత్ బొల్ల బయోగ్రఫీ

  1991లో కృష్ణ జిల్లా శ్రీరామా పురంలోని జన్మించాడు శ్రీకాంత్ బోళ్ల. సాధారణ రైతు కుటుంభంలో జన్మించిన శ్రీకాంత్ అమ్మ., నాన్నలది మేనరికపు పెళ్లి. దింతో శ్రీకాంత్ పుట్టుకతో అంధవైకల్యంతో జన్మించాడు. మనిషికి చదువు అవసరం అనే భావనతో శ్రీకాంత్ ను గ్రామంలోని పాఠశాలకు పంపారు తల్లితండ్రులు. బడికి వెళ్లిన శ్రీకాంత్ కు ఉపాధ్యాయులు చెప్పే పాటలు అర్థమయ్యేవి కావు. దింతో హైదరాబాద్ లోని బేగంపేట అంధుల పాఠశాలలో శ్రీకాంత్ ను చేర్పించారు తల్లితండ్రులు.

  కానీ అక్కడకు వెళ్లిన బ్రెయిన్ లీ లిపి అర్థంకాక తడబడ్డ శ్రీకాంత్ ఉన్నత చదువులే తనకు ఆసరా అంటూగ్రహించి చదువులో రాణించాడు. ఇంటర్లో ఎంపీసీ ఇవ్వడానికి బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ నిరాకరించడంతో ఆరు నెలల పాటు కోర్టు మెట్లెక్కి తనకు ఎంపిసి వచ్చేలా పోరాటం చేసాడు. ఐఐటి కోర్స్ పూర్తి చేయలేవని అందరూ హేళన చేసారు. నీవల్ల కాదు అంటూ వెనక్కు నెట్టారు.... అలాంటి సమయంలోను వెనకడుగు వేయని ఇతను అమెరికాలో ఎంఐటీలో సీటు సాధించి అందరి ప్రశ్నలకు ఒకే దెబ్బతో సమాధానం ఇచ్చాడు. ఇలా అతను ఏమి చేసిన ఓటమిని ఎదురించి తానేంటో నీరుపించే ధైర్యమే శ్రీకాంత్ కు శ్రీరామా రక్షా. హేళన చేసిన ప్రతి సారి తానేంటో నిరూపించుకుంటూ అందరిని ఎదుర్కోవడం శ్రీకాంత్ స్పెషల్.

  Business Idea: లక్షల్లో ఆదాయం కావాలా? ఈ కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా

  bolla srikanth family, bolla srikanth history, bolla srikanth telugu, bollant industries ceo srikanth bolla, srikanth bolla biography, srikanth bolla interview, srikanth bolla speech, srikanth bolla story, srikanth bolla ted talk, ఆంట్రప్రెన్యూర్ శ్రీకాంత్ బొల్ల, శ్రీకాంత్ బొల్ల, శ్రీకాంత్ బొల్ల ఎవరు, శ్రీకాంత్ బొల్ల కథ, శ్రీకాంత్ బొల్ల బయోగ్రఫీ

  శ్రీకాంత్ 9వ తరగతి చదువుతున్న సమయంలో ఓ మహత్తరమైన అవకాశం దక్కింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని లీడ్ ఇండియా కార్యక్రమంలో కలిసే అవకాశం కలిగింది. శ్రీకాంత్ ప్రతిభ చూసి ఆశ్చర్య పోయిన అబ్దుల్ కలాం.... పలు ప్రసంగాలలో శ్రీకాంత్ ప్రస్తావన తెచ్చే వారు. తనకు శ్రీకాంత్ ఆదర్శమని అబ్దుల్ కలాం చెప్పారంటే శ్రీకాంత్ ప్రతిభ ఎలాంటిదో ఇట్టే అర్థమైంపోతుంది. అమెరికాలో ఎంఐటి చదువుతున్న సమయంలో తన గురువైన స్వర్ణాలతో కలసి సమన్వయ స్వచ్చంధ సంస్థ స్థాపించారు. మూడు వేల మందికి పైగా దివ్యగులకు పలు రకాల ఉపాధి శిక్షణలు అందించారు.

  శిక్షణ పూర్తి అయినా దివ్యాంగులను ఎవరు పనిలోకి తీసుకోక పోవడంతో చాలించి పోయిన శ్రీకాంత్.... తానే స్వంతంగా ఓ డిస్పోసబుల్ కంపెనీని స్థాపించాడు. బోళ్ళంట్ కంపెనీ పేరిట పరిశ్రమను ఏర్పాటు చేసి వేల మంది దివ్యాంగుల జీవితంలో వెలుగు నింపాడు. అలా ప్రారంభించిన ఈ కంపెనీ.... వ్యర్ధాలతో చేసే పేపర్ పెట్లు., ప్యాకేజీకి వినియోగించే అట్టలను ముందుగా వీరి కంపెనీలో తాయారు చేయడం మొదలెట్టారు.

  Online Business: రూ.12 లక్షల పెట్టుబడితో బిజినెస్... కోట్ల రూపాయల టర్నోవర్

  ప్యాకేజింగ్ పరిశ్రమలలో 30 బిలియన్ డాల్లర్ ల వ్యాపారం ఉండటంతో శ్రీకాంత్ ను ఈ వ్యాపారం వైపు వచ్చేలా చేసాయి. నాణ్యమైన వస్తువుల తయారీ చేస్తూ ప్రపంచ స్థాయికి అనుగుణంగా ఉత్పత్తులు తాయారు చేస్తున్నారు. శ్రీకాంత్ కృషిని చూసి ముచ్చటపడ్డ వ్యాపార దిగ్గజం రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఐదు వందల మందిలో అధిక శాతం దివ్యంగులే ఉన్నారు. వారికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి పనిని సైతం అందిస్తున్నాడు.

  'ఈ ప్రపంచానికి నా తరపున ప్రత్యేక చేయాలి.....నా ఉనికి ఈ ప్రపంచంలో చిరస్థాయిగా ఉండాలని కోరుకున్న. ప్రతి ఒక్కరు పుట్టి చనిపివడం సర్వసాధారణం కానీ ఏమి సంధించామన్నదే ముఖ్యం. ప్రపంచానికి వెలుగునిచ్చే జ్ఞాన దీపం దీపం వెలిగించాలని కోరుకున్న. పరిశ్రమ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు బ్యాంకులో ఎలాంటి ఋణం తీసుకోలేదా. రుణ దాతల సహకారంతో.... ఇన్నాళ్లు కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చాము. వెంచర్ కాపిటల్ రైస్ చేయడానికి ఈక్విటీలో ప్రవేశించనున్నాం. డిఫరెంట్ కన్సల్టింగ్., అడ్వైసింగ్ కంపెనీలు సహాయ సహకారాలు అందించుస్తున్నాయి. వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ గా మూడు ఏళ్ళలో తీసుకురానున్నాం' అంటూ న్యూస్18 తో శ్రీకాంత్ బోళ్ల చెప్పారు.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, Business Ideas, BUSINESS NEWS, Businessman

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు