Home /News /business /

BOOKINGS FOR THE SECOND INSTALLMENT OF OLA ELECTRIC SCOOTERS HAVE BEEN POSTPONED AND CLICK HERE TO KNOW THE NEXT BOOKING DATES PRV GH

Ola S1 Electric Scooter: ఓలా ఎస్​1 ఎలక్ట్రిక్​ స్కూటర్​ రెండో విడత బుకింగ్స్​ వాయిదా.. డిసెంబర్ 16న బుకింగ్​ విండో ఓపెన్​

ఓలా ఈ స్కూటర్​

ఓలా ఈ స్కూటర్​

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఓలా ఎస్​1 ఎలక్ట్రిక్ స్కూటర్​ (Ola S1 Electric Scooter) మొదటి విడత అమ్మకాల్లో దుమ్మురేపాయి. వీటి బుకింగ్స్ (bookings)​ ప్రారంభమైన రెండు రోజుల్లోనే స్టాక్​ అయిపోయింది.

భారత ఎలక్ట్రిక్​ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఓలా ఎస్​1 ఎలక్ట్రిక్ స్కూటర్​ (Ola S1 Electric Scooter) మొదటి విడత అమ్మకాల్లో దుమ్మురేపాయి. వీటి బుకింగ్స్ (bookings)​ ప్రారంభమైన రెండు రోజుల్లోనే స్టాక్​ అయిపోయింది. దీంతో రెండో విడత బుకింగ్స్​ కోసం కస్టమర్లు వెయిట్​ చేస్తున్నారు. అయితే నవంబర్ 1 నుంచి రెండో విడత బుకింగ్స్ (Second phase bookings)​ ప్రారంభిస్తామని గతంలో ఓలా స్పష్టం చేసింది. కానీ డిసెంబర్​ 16 వరకు రెండో విడత బుకింగ్స్​ను వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

మొదటి విడత బుకింగ్​లో ఊహించని రెస్పాన్స్..

తాజా నిర్ణయంపై ఓలా స్కూటర్ (Loa scooter)​ సీఈవో భవిష్​ అగర్వాల్​ ట్వీట్​ చేస్తూ “మా ఓలా ఉత్పత్తులకు కస్టమర్ల నుంచి వస్తున్న అనూహ్య స్పందన పట్ల ఎంతో సంతోషిస్తున్నాం. మొదటి విడత బుకింగ్​లో ఊహించని రెస్పాన్స్​ వచ్చింది. అయితే, ఆర్డర్లు, డెలివరీకి మధ్య సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా రెండో విడత బుకింగ్స్​ను డిసెంబర్​ 16కు వాయిదా వేశాం. బుకింగ్​ చేసుకున్న వారి ఇంటికి సాధ్యమైనంత త్వరగా ఓలా స్కూటర్​ను డెలివరీ చేసేందుకు ప్లాన్​ చేస్తున్నాం.” అని తెలిపారు.

మొత్తం మూడు వేరియంట్లలో లభ్యం..

ఓలా ఈ–స్కూటర్‌ మొత్తం మూడు వేరియంట్ల (Three variants) లో లభిస్తుంది. మొదటి బేసిక్​ వేరియంట్ 2kW మోటార్​తో వస్తుంది. ఈ బేసిక్​ వేరియంట్ (basic variant) గరిష్టంగా గంటకు 45 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. రెండో మిడ్ వేరియంట్ (mid variant) 4kW మోటార్​తో వస్తుంది. ఈ మిడిల్ వేరియంట్ (middle variant) గరిష్టంగా 70kmph వేగంతో ప్రయాణించగలదు. మూడోది టాప్ ఎండ్ వేరియంట్ (Top end variant). దీనిలో 7kW మోటార్‌ను అమర్చింది. ఈ టాప్-ఎండ్ వేరియంట్ గరిష్టంగా 95kmph వేగంతో ప్రయాణించగలదు.

ఛార్జ్ చేయడానికి రెండున్నర గంటల సమయం..

ఛార్జింగ్​ స్టేషన్​లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను జీరో నుంచి పూర్తిగా ఛార్జ్ చేయడానికి (for charging) దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుంది. హైపర్ ఛార్జింగ్ స్టేషన్‌లో కేవలం 18 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇంట్లో ఉండే సాధారణ ప్లగ్‌ని ఉపయోగించి స్కూటర్ పూర్తిగా ఛార్జ్ (charge)చేయడానికి ఐదున్నర గంటలు పడుతుంది. ఛార్జింగ్​ పూర్తవ్వగానే యాప్‌ (APP)లో నోటిఫికేషన్‌ కూడా వస్తుంది.

7 -అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే..

ఈ స్కూటర్ 7 -అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే (Touch screen display)ను కలిగి ఉంటుంది. స్కూటర్ స్క్రీన్​పై జీపీఎస్ (GPS)​ నావిగేషన్​కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఈ స్కూటర్​ 4జీ కనెక్టివిటీతో వస్తుంది. యూట్యూబ్​, కాలింగ్ మొదలైన ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. ఇది కీలెస్ ఇగ్నిషన్‌తో పాటు 'ఫైండ్ మై స్కూటర్' ఫీచర్‌తో కూడా వస్తుంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Ola, Ola e Scooter, Ola Electric Scooter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు