హోమ్ /వార్తలు /బిజినెస్ /

Skoda Rapid: స్కోడా రాపిడ్ టిఎస్ఐ కార్ల డెలివరీ ప్రారంభం...కేవలం రూ. 25 వేలకే బుకింగ్

Skoda Rapid: స్కోడా రాపిడ్ టిఎస్ఐ కార్ల డెలివరీ ప్రారంభం...కేవలం రూ. 25 వేలకే బుకింగ్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

భారత మార్కెట్లో కొత్త రాపిడ్ 1.0 టిఎస్ఐ ఎటిని 9.49 లక్షల ధరతో విడుదల చేసింది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైన ఈ కారును సులభంగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.

ప్రపంచంలోనే ప్రసిద్ధ ఆటోమొబైల్ సంస్థ అయిన స్కోడా స్టైలిష్ కార్లకు పెట్టింది పేరు. తాజాగా స్కోడా కంపెనీ భారత మార్కెట్లోకి సరికొత్త రాపిడ్ టీఎస్ఐని తీసుకొచ్చింది. గురువారం భారత మార్కెట్లో కొత్త రాపిడ్ 1.0 టిఎస్ఐ ఎటిని 9.49 లక్షల ధరతో విడుదల చేసింది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైన ఈ కారును సులభంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ కారును దేశంలోని అన్ని స్కోడా డీలర్షిప్ సెంటర్లతో పాటు స్కోడా ఆటో ఇండియా వెబ్సైట్ ద్వారా రూ.25 వేల టోకెన్ ఫీజు చెల్లించి అనేక మంది కస్టమర్లు ఇప్పటికే బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న వినియోగదారులకు సెప్టెంబర్ 18 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.


అట్రాక్టివ్ ఫీచర్స్

స్కోడా రాపిడ్ టిఎస్ఐ ఎటి 1.0 లీటర్, త్రీ సిలిండర్ 1.0 టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 110 పిఎస్ (81 కిలోవాట్ల) శక్తిని 5,000 నుంచి- 5,500 ఆర్‌పిఎమ్ వద్ద మరియు 175 ఎన్ఎమ్ పీక్ టార్క్ 1,750 నుండి 4,000 ఆర్‌పిఎమ్ వద్ద నమోదు చేస్తుంది. ఈ కారు ఇంజిన్ ఆరు- స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. 16.24 కెఎంపిఎల్ ఫుయల్ ఎకానమీని అందిస్తుంది. ఇంతకుముందు రాపిడ్ రేంజ్లో వచ్చిన 1.6 ఎంపిఐ ఇంజిన్‌కు ధీటుగా కొత్త రాపిడ్ 1.0 టిఎస్ఐ ఎటి 5% ఎక్కువ శక్తిని మరియు 14% ఎక్కువ టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అలాగే, ఇంతకుముందు ఉన్న మోటారుకు ధీటుగా ఇంధన సామర్థ్యంలో 9% పెరుగుదలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ "రిఫ్రెషడ్ రాపిడ్ టిఎస్ఐ పరిధిలో ఆరు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ప్రవేశపెట్టడంతో చెక్ మార్క్ ఈ విభాగంలో బెంచ్ మార్కును పెంచింది. ఇది సరికొత్త సాంకేతికత, డైనమిక్ డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాక ఇది ఉత్తమంగా అమ్ముడవుతుంది." అన్నారు. 2022 నాటికి భారతదేశంలో స్కోడా షోరూమ్‌ల సంఖ్యను రెట్టింపు చేయాలని యోచిస్తున్నామని, భవిష్యత్తులో 15 కొత్త నగరాల్లోకి ప్రవేశించనున్నట్లు గురువారం వర్చువల్ లాంచ్ సందర్భంగా కంపెనీ ప్రకటించింది.

First published:

Tags: Automobiles, Business, Cars

ఉత్తమ కథలు