హోమ్ /వార్తలు /బిజినెస్ /

Citroen eC3: దుమ్మురేపుతోన్న ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కి.మి. వెళ్లొచ్చు.. రూ.25 వేలతో బుక్ చేసుకోండిలా!

Citroen eC3: దుమ్మురేపుతోన్న ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కి.మి. వెళ్లొచ్చు.. రూ.25 వేలతో బుక్ చేసుకోండిలా!

Citroen eC3: దుమ్మురేపుతోన్న ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కి.మి. వెళ్లొచ్చు.. రూ.25 వేలతో బుక్ చేసుకోండిలా!

Citroen eC3: దుమ్మురేపుతోన్న ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కి.మి. వెళ్లొచ్చు.. రూ.25 వేలతో బుక్ చేసుకోండిలా!

Electric Car | మీరు కొత్తగా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? అయితే మీకు కొత్త కారు అందుబాటులోకి వచ్చింది. దీన్ని తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Electric Vehicles | మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం ఒక కొత్త ఆప్న్ అందుబాటులో ఉంది. సిట్రోయెన్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ కారును (Electric Car) మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని పేరు సిట్రోయెన్ ఇసీ3. ఈ కారు బుకింగ్స్ ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. అందువల్ల మీరు కారు (Car) కొనే యోచనలో ఉంటే ఈ కొత్త ఎలక్ట్రిక్‌ కారును ఒకసారి పరిశీలించొచ్చ. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. స్టైలిష్ లుక్‌తో అదరగొడుతోంది.

కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధరను వచ్చే నెలలో వెల్లడించనుంది. కస్టమర్లు ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ. 25 వేల టోకెన్ అమౌంట్‌ను ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త కారు నేరుగా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్ కారు టాటా టియాగో ఈవీతో పోటీ పడనుంది. అలాగే ఎలక్ట్రిక్ సెడాన్ కారు టాటా టిగోర్ ఈవీతో కూడా పోటీ పడే ఛాన్స్ ఉంది.

బైక్ క్రేజ్ వేరే లెవెల్.. ప్రతి నెలా 2 లక్షల మందికి పైగా కొంటున్నారు!

కంపెనీ ఈ కారు ధరను వెల్లడించకపోయినా కూడా దీని రేటు రూ. 9 లక్షల నుంచి రూ. 10 లక్షల దాకా ఉండొచ్చనే అంచనాలుఉన్నాయి. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఒకదాని పైరు లివ్, రెండో దాని పేరు ఫీల్. ఈ రెండు వేరియంట్లలోనూ 315 లాటర్ల బూట్ స్పేస్ ఉండనుంది.

ఇక ఈ నెలలో బ్యాంకులు పని చేసేది 3 రోజులే.. 5 రోజులు సెలవులు!

ఇక ఈ ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీ, మోటార్ విషయానికి వస్తే.. ఇందులో 29.2 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీని పవర్ 57 పీఎస్. టార్క్ 143 ఎన్ఎం. కంపెనీ 15 ఏఎంపీ హోమ్ చార్జర్ ఫెసిలిటీ కల్పిస్తోంది. ఈ చార్జర్‌తో కారు బ్యాటరీ 10.30 గంటల్లో ఫుల్ అవుతుంది. అలాగే కంపెనీ డీసీ ఫాస్ట్ చార్జర్ కూడా అందిస్తోంది. ఫాస్ట్ చార్జర్ ద్వారా అయితే కారు 10 నుంచి 80 శాతం బ్యాటరీ కేవలం 57 నిమిషాల్లోనే ఫుల్ అవుతుంది.

ఒక్కసారి ఈ కారును ఫుల్‌గా చార్జ్ చేస్తే.. ఏకంగా 320 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఇంకా ఈ కారులో 10 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, మ్యానువల్ ఏసీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, హైట్ అడ్జస్టబుల్ సీట్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

First published:

Tags: Budget cars, Cars, E cars, Electric Car, Electric Vehicles

ఉత్తమ కథలు