IRCTC Tatkal Rules: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? రూల్స్, ఛార్జెస్ వివరాలు తెలుసుకోండి

IRCTC Tatkal Train Ticket Booking Rules: తత్కాల్ టికెట్ ఎప్పుడు బుక్ చేయాలి? ఎలా బుక్ చేయాలి? తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నియమనిబంధల్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెలుసుకోండి.

news18-telugu
Updated: March 14, 2019, 7:47 PM IST
IRCTC Tatkal Rules: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? రూల్స్, ఛార్జెస్ వివరాలు తెలుసుకోండి
IRCTC Tatkal Rules: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? రూల్స్, ఛార్జెస్ వివరాలు తెలుసుకోండి
news18-telugu
Updated: March 14, 2019, 7:47 PM IST
వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. దానికి తోడు ఇది ఎన్నికల సీజన్. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లేవారు ఎక్కువగానే ఉంటారు. సెలవులనూ ఎంజాయ్ చేసేందుకు లగేజీ సర్దుకునేవాళ్లూ ఉంటారు. హోలీ, ఉగాది, శ్రీరామనవమి పండుగలూ ఉన్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు రైళ్లు కిటకిటలాడుతుంటాయి. రద్దీ ఎక్కువే. ట్రైన్ టికెట్ దొరకడమే కష్టం. ఎంత ముందుగా ప్లాన్ చేసుకున్నా వెయిటింగ్ లిస్ట్‌లో నెంబర్ ఎక్కడో ఉంటుంది. ఇలాంటివారిని ఆదుకునేదే తత్కాల్. మరి తత్కాల్ టికెట్ ఎప్పుడు బుక్ చేయాలి? ఎలా బుక్ చేయాలి? తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నియమనిబంధల్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెలుసుకోండి.

Read this: IRCTC Tatkal Autofill: తత్కాల్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ

IRCTC Tatkal ticket, IRCTC Tatkal train Ticket, Indian railways Tatkal ticket, Indian railways Tatkal train Ticket, IRCTC Tatkal Ticket rules 2019, IRCTC Tatkal Ticket charges 2019, IRCTC Tatkal Ticket timings, IRCTC Tatkal Ticket fees, IRCTC Tatkal Ticket refund rules, IRCTC Tatkal Ticket cancellation rules, irctc tatkal ticket booking tips, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్స్, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ టైమింగ్స్, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ ఛార్జీలు, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ క్యాన్సలేషన్



తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేయాలి?


ఒక రైలులో ఉండే మొత్తం సీట్లల్లో 30% తత్కాల్ కోటా కోసం కేటాయిస్తారు. వీటిని ట్రెయిన్ బయల్దేరడానికి ఒకరోజు ముందు బుక్ చేస్తారు. మరుసటి రోజు ప్రయాణించాలనుకునేవారు తత్కాల్‌లో టికెట్లు బుక్ చేస్తుంటారు. తత్కాల్ టికెట్ ఎవరైనా బుక్ చేయొచ్చు. తత్కాల్ టికెట్ కోసం సాధారణ ఛార్జీల కన్నా కాస్త ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే తత్కాల్ టికెట్లు క్షణాల్లో బుక్ అయిపోతుంటాయి. బుకింగ్ సమయంలో కాస్త ఆలస్యం చేసినా టికెట్ దొరకదు. అందుకే తత్కాల్ టికెట్లు జారీ చేసే సమయాన్ని గుర్తుంచుకోవాలి. ఏసీ క్లాస్(2A, 3A, CC, 3E) ఉదయం 10 గంటలకు, నాన్-ఏసీ క్లాస్(SL, FC, 2S) ఉదయం 11 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.in లేదా ఇండియన్ రైల్వేస్ కౌంటర్లలో తత్కాల్ టికెట్లు బుక్ చేయొచ్చు.



Read this: IRCTC: ఇక ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్ చార్టులు... ఖాళీ బెర్తులు మీరే చూసుకోవచ్చు

IRCTC Tatkal ticket, IRCTC Tatkal train Ticket, Indian railways Tatkal ticket, Indian railways Tatkal train Ticket, IRCTC Tatkal Ticket rules 2019, IRCTC Tatkal Ticket charges 2019, IRCTC Tatkal Ticket timings, IRCTC Tatkal Ticket fees, IRCTC Tatkal Ticket refund rules, IRCTC Tatkal Ticket cancellation rules, irctc tatkal ticket booking tips, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్స్, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ టైమింగ్స్, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ ఛార్జీలు, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ క్యాన్సలేషన్

తత్కాల్ టికెట్ నియమనిబంధనలు


ఒక పీఎన్ఆర్‌కు గరిష్టంగా నలుగురు ప్రయాణికులకు మాత్రమే తత్కాల్ టికెట్లు ఇస్తారు.
తత్కాల్ కోటాలో జనరల్ కోటా, లేడీస్ కోటా వర్తించవు.
ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌లో తత్కాల్ టికెట్లు ఉండవు.
తత్కాల్ బుకింగ్‌లో ఎలాంటి రాయితీ పొందలేరు.
సెకండ్‌‌ క్లాస్ టికెట్‌కు బేసిక్ ఫేర్‌లో 10 శాతం, మిగతా క్లాసులకు 30 శాతం ఛార్జీలు వసూలు చేస్తుంది ఐఆర్‌సీటీసీ.
స్లీపర్ క్లాస్‌ టికెట్లకు రూ.100 నుంచి రూ.200 ఛార్జీలు ఉంటాయి.
ఏసీ చైర్ కార్ టికెట్‌కు రూ.125 నుంచి రూ.225 మధ్య ఛార్జీలు ఉంటాయి.
తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ రాదు.
అనూహ్యంగా రద్దైనా, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లు రద్దైనా ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం ఛార్జీలుంటాయి.

IRCTC Tatkal ticket, IRCTC Tatkal train Ticket, Indian railways Tatkal ticket, Indian railways Tatkal train Ticket, IRCTC Tatkal Ticket rules 2019, IRCTC Tatkal Ticket charges 2019, IRCTC Tatkal Ticket timings, IRCTC Tatkal Ticket fees, IRCTC Tatkal Ticket refund rules, IRCTC Tatkal Ticket cancellation rules, irctc tatkal ticket booking tips, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్స్, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ టైమింగ్స్, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ ఛార్జీలు, ఐఆర్‌‌సీటీసీ తత్కాల్ టికెట్ క్యాన్సలేషన్

తత్కాల్ టికెట్ ఛార్జీల వివరాలు ఈ టేబుల్‌లో చూడండి



































క్లాస్ కనీస తత్కాల్ ఛార్జీలు గరిష్ట తత్కాల్ ఛార్జీలు
సెకండ్ సిట్టింగ్ రూ.10 రూ.15
స్లీపర్ రూ.90 రూ.175
ఏసీ చైర్ కార్ రూ.100 రూ.200
ఏసీ 3 టైర్ రూ.250 రూ.350
ఏసీ 2 టైర్ రూ.300 రూ.400

 

Photos: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న మహిళ ఏరియానా గ్రాండే

ఇవి కూడా చదవండి:

Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు లేదా? దరఖాస్తుకు 3 రోజులే గడువు... ఇలా అప్లై చేయండి

Save Money: రూ.1 కోటి పొదుపు చేయడానికి 6 స్టెప్స్

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా సరిదిద్దుకోవచ్చు
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు