హోమ్ /వార్తలు /బిజినెస్ /

LPG Gas Cylinder Booking: కేవలం రూ. 61కే గ్యాస్ సిలిండర్.. మరి కొన్ని రోజులే ఛాన్స్.. వివరాలివే

LPG Gas Cylinder Booking: కేవలం రూ. 61కే గ్యాస్ సిలిండర్.. మరి కొన్ని రోజులే ఛాన్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని ఆందోళన చెందుతున్నారా? అయితే.. పేటీఎం మీకు అందించే ఈ ఆఫర్ ద్వారా రూ. 800 వరకు డిస్కౌంట్ పొందండి.

  గ్యాస్ సిలిండర్ ధరలు ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. పెరిగిన ధరలతో ప్రజలు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ. 861కి చేరింది. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది సామాన్యులు ఇంత ధర పెట్టి సిలిండర్ ను బుక్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్ ధరలు తగ్గించాలని ప్రతిపక్షాలు, ప్రజల నుంచి ఎంత డిమాండ్ వస్తున్నా ఆయా గ్యాస్ కంపెనీలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ తరుణంలో ప్రమఖ పేమెంట్స్ యాప్ పేటీఎం(Paytm) గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు ప్రకటించింది. అంటే ఈ ఆఫర్ ద్వారా సిలిండర్ ను కేవలం రూ. 61కే సొంతం చేసుకోవచ్చు. పెరిగిన ధరల నేపథ్యంలో ఇది సూపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.

  పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేసుకుని ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

  1.మొదట మీరు మీ మొబైల్ ఫోన్‌లో పేటీఎం యాప్ లేక పోతే డౌన్‌లోడ్ చేసుకుని ఇన్ట్సాల్ చేసుకోవాలి.

  2.అనంతరం రీఛార్జ్&పే బిల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అనంతరం బుక్ గ్యాస్ సిలిండర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  3. అక్కడ మీరు మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకోవాలి.

  4.అనంతరం మీ ఐడీ లేదా మొబైల్ నంబర్ ను నమోదు చేసి గ్యాస్ బుక్ చేయాలి.

  5. బుక్ చేసిన 24 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్ స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది.

  6.ఈ స్క్రాచ్ కార్డును  రోజుల్లో ఉపయోగించాలి.

  7. తద్వరా మీకు రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

  8. క్యాష్ బ్యాక్ మొత్తం రూ. 10 నుంచి రూ. 800 వరకు ఉంటుంది.

  9.అయితే పేటీఎం ద్వారా మొదటి సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

  10. ఈ ఆఫర్ ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bharat Gas, HP gas, Indane Gas, Paytm

  ఉత్తమ కథలు