Home /News /business /

BOLLYWOOD ACTOR SONU SOOD LAUNCHES RURAL B2B TRAVEL TECH PLATFORM TRAVEL UNION SS

Sonu Sood: ట్రావెల్ యూనియన్ ప్రారంభించిన సోనూ సూద్... మీరూ డబ్బు సంపాదించండి ఇలా

Sonu Sood: ట్రావెల్ యూనియన్ ప్రారంభించిన సోనూ సూద్... మీరూ డబ్బు సంపాదించండి ఇలా
(image: Travel Union)

Sonu Sood: ట్రావెల్ యూనియన్ ప్రారంభించిన సోనూ సూద్... మీరూ డబ్బు సంపాదించండి ఇలా (image: Travel Union)

Sonu Sood | బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వ్యాపార అవకాశాన్ని అందిస్తున్నారు. ట్రావెల్ యూనియన్ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశారు.

    బాలీవుడ్ నటుడు సోనూ సూద్ బీ2బీ టెక్ ప్లాట్‌ఫామ్ అయిన ట్రావెల్ యూనియన్‌ను ప్రారంభించారు. వేలాది మంది చిరు వ్యాపారులు, ట్రావెల్ ఏజెంట్లు, టూరిజం సెగ్మెంట్‌లో ఉన్నవారికి మద్దతుగా నిలిచేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు గ్రామీణ ప్రాంతాల కస్టమర్ల అవసరాలను ట్రావెల్ ఏజెంట్స్ తీర్చేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ఏర్పాటైంది. స్పైస్ గ్రూప్‌లో భాగమైన స్పైస్ మనీ సంస్థ అధినేత దిలీప్ కుమార్ మోదీతో కలిసి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ట్రావెల్ యూనియన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గ్రామీణ భారతీయులు మొదట సవాళ్లు ఎదుర్కొన్నారని, వీరితో పాటు చిరు వ్యాపారులూ ఇబ్బందులు పడ్డారని సోనూ సూద్ అన్నారు. గ్రామీణ రవాణా రంగం చాలాకాలంగా అసంఘటితంగా ఉందన్నారు. ట్రావెల్ ఏజెంట్లు అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ట్రావెల్ యూనియన్ ఏర్పాటైందని, ఈ నెట్వర్క్‌లో చేరడం ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చని అన్నారు.

    SBI Gold Loan: ఎస్‌బీఐలో గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటుపై డిస్కౌంట్

    Gold Price Today: రికార్డు ధర నుంచి గోల్డ్ రేట్ పతనం... రూ.10,470 తగ్గిన బంగారం


    ట్రావెల్ యూనియన్‌లోని ట్రావెల్ ఏజెంట్లు కస్టమర్ల ప్రయాణ అవసరాలను తీరుస్తూ కమిషన్ ద్వారా డబ్బు సంపాదించొచ్చు. ట్రావెల్ యూనియన్‌లో ఎయిర్‌లైన్స్, రైల్వేస్, హోటళ్లు, హోల్‌సేల్ వ్యాపారులు, అగ్రిగేటర్లను కవర్ చేస్తుంది. భారతదేశంలో నడుస్తున్న అన్ని రైళ్లకు ఐఆర్‌సీటీసీ ద్వారా యాక్సెస్ లభిస్తుంది. 10,000 పైగా బస్ ఆపరేటర్లు, 10 లక్షలకు పైగా హోటళ్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇది కేవలం మెంబర్లు మాత్రమే ఉండే ప్లాట్‌ఫామ్. ఇందులో చేరడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కమిషన్ ద్వారా ఈ బిజినెస్ నడుస్తుంది. ప్రొడక్టీవ్ లింక్ బోనస్ ప్రతీ నెల, మూడు నెలలు, ఏడాదికోసారి లభిస్తుంది. ట్రాన్సాక్షన్ సమయంలో తమ వైపు నుంచి లేదా సప్లయర్ల నుంచి ఎలాంటి కన్వీనెన్స్ ఫీజు ఉండదని, దీంతో ఏజెంట్లకు లాభమని, కస్టమర్లతో ఉన్న సంబంధాన్ని బట్టి సర్వీస్ ఛార్జ్ తీసుకోవచ్చని ట్రావెల్ యూనియన్ ఫౌండర్ దిలీప్ మోదీ అన్నారు. ట్రావెల్ యూనియన్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీతో పాటు 11 భారతీయ భాషల్లో ఈ యాప్ ఉపయోగించొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Business, BUSINESS NEWS, Business plan, Good business, Online business, Small business, Sonu Sood, Sonu Sood foundation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు