BOB RECRUITMENT 2019 BANK OF BARODA JOB NOTIFICATION FOR 100 SENIOR RELATIONSHIP MANAGER AND TERRITORY HEAD POSTS APPLY BEFORE MARCH 29 SS
Bank Jobs: డిగ్రీ ఉంటే చాలు... బ్యాంక్ ఆఫ్ బరోడాలో 100 ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
(ప్రతీకాత్మక చిత్రం)
BOB Recruitment 2019 | దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 2019 మార్చి 29 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. బ్యాంకులో ఉద్యోగం చేయడం మీ లక్ష్యమైతే మీ కోసమే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు ఉన్నాయి. మార్చి 8న 100 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, టెర్రిటరీ హెడ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. 100 పోస్టుల్లో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు 96 కాగా, టెర్రిటరీ హెడ్ పోస్టులు 4. దరఖాస్తు చేయడానికి మార్చి 29 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.
BOB Recruitment 2019: ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 మార్చి 8
దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 2019 మార్చి 29
ప్రతీకాత్మక చిత్రం
BOB Recruitment 2019: ఖాళీలు, అర్హతల వివరాలు
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్- 96 పోస్టులు. వయస్సు 25-40 ఏళ్లు.
టెర్రిటరీ హెడ్- 4 పోస్టులు. 35-45 ఏళ్లు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.
అర్హత: ఈ రెండు పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ, విద్యాసంస్థ నుంచి డిగ్రీ.
దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 2019 మార్చి 29 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసినవాళ్లు ఆన్లైన్ అప్లికేషన్‌ను ప్రింటవుట్ తీసి భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం దాచుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.600 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.
Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.