Home /News /business /

BOB FINANCIAL NPCI TO LAUNCH BANK OF BARODA CREDIT CARDS ON RUPAY PLATFORM CHECK DETAILS JNK GH

Bank of Baroda: ఎన్‌పీసీఐతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఒప్పందం.. రూపే క్రెడిట్ కార్డు లాంచ్ చేయనున్న సంస్థ

త్వరలో బ్యాంక్ ఆఫ్ బరోడా - రూపే క్రెడిట్ కార్డు

త్వరలో బ్యాంక్ ఆఫ్ బరోడా - రూపే క్రెడిట్ కార్డు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఫైనాన్షియల్ తాజాగా ప్రకటించింది. రూపే ప్లాట్‌ఫామ్‌లో బీఓబీ క్రెడిట్ కార్డ్‌లను (ఈజీ, ప్రీమియర్ వేరియంట్‌లు) లాంచ్ చేయడానికే ఎన్‌పీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.

ఇంకా చదవండి ...
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) అనుబంధ సంస్థ అయిన బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్.. తమ కస్టమర్లకు తీపి కబురు అందించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) (NPCI) తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఫైనాన్షియల్ తాజాగా ప్రకటించింది. రూపే (RuPay) ప్లాట్‌ఫామ్‌లో బీఓబీ క్రెడిట్ కార్డ్‌లను  (Credit Card) (ఈజీ, ప్రీమియర్ వేరియంట్‌లు) లాంచ్ చేయడానికే ఎన్‌పీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.

బీఓబీ క్రెడిట్ కార్డ్‌ల ఈజీ, ప్రీమియర్ వేరియంట్‌లను జేసీబీ (JCB) ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌లో తాజాగా ప్రారంభించింది బీఓబీ ఫైనాన్షియల్. ఈ రెండు కార్డ్‌లు గ్లోబల్ యాక్సెప్టెన్స్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ కార్డ్‌లు సెలక్టెడ్ మర్చంట్ కేటగిరిలపై 5X రివార్డ్ పాయింట్‌లు, ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు, ముందస్తు, కొనుగోలు తర్వాత ఈఎంఐ ఆఫర్‌లు, కుటుంబ సభ్యుల కోసం మూడు కాంప్లిమెంటరీ యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌లు ఆఫర్ చేస్తాయి. అంతేకాదు బీఎఫ్ఎస్ఎల్ (BFSL) ద్వారా ఎనేబుల్ అయిన అనేక మర్చంట్ ఆఫర్‌లతో సహా మరిన్ని ప్రయోజనాలు అందుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డులు అందించే రకరకాల బెనిఫిట్స్ గురించి ఎన్‌పీసీఐ, బీఓబీ ఫైనాన్షియల్ తమ ప్రకటనలో పేర్కొన్నాయి.

LIC Policy: రోజూ రూ.41 మీవి కాదనుకుంటే రూ.63 లక్షల రిటర్న్స్ పొందొచ్చు


“ఈజీ క్రెడిట్ కార్డుదారులు ఖర్చు చేసిన ప్రతి రూ.100కి ఒక రివార్డ్ పాయింట్‌ను పొందుతారు. కిరాణా కొనుగోళ్లు (grocery purchases), డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లలో షాపింగ్ చేయడం, సినిమా టిక్కెట్‌ల కోసం ఈ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా ఖర్చు చేసిన ప్రతి రూ.100కి 5 రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి" అని బీఓబీ ఫైనాన్షియల్ తెలిపింది. ప్రీమియర్ క్రెడిట్ కార్డ్‌ల వినియోగదారులు తాము వెచ్చించే ప్రతి రూ.100కి 2 రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. ట్రావెల్, ఇంటర్నేషనల్, డైనింగ్ కోసం ప్రీమియర్ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు ఖర్చు చేసే ప్రతి రూ.100కి 5X రివార్డ్ పాయింట్‌లను (10 రివార్డ్ పాయింట్‌లు) పొందవచ్చు.

“రూపే ప్లాట్‌ఫామ్‌లో బీఓబీ క్రెడిట్ కార్డ్‌లను తీసుకురావడానికి ఎన్‌పీసీఐతో చేతులు కలపడం సంతోషంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బీఎఫ్ఎస్ఎల్ రెండూ తమ ఇతర ప్రొడక్ట్స్ కోసం ఎన్‌పీసీఐతో బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. బీఓబీ క్రెడిట్ కార్డ్‌లతో ఈ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. ఈజీ, ప్రీమియర్ వేరియంట్‌లు సంబంధిత కస్టమర్ సెగ్మెంట్‌లలో పాపులర్ అవుతాయని మేం ఆశిస్తున్నాం. ఎన్‌పీసీఐ రూపే కార్డ్‌లపై తీసుకువస్తున్న ఆఫర్‌లు, ప్రయోజనాల ద్వారా ఇవి భారీ ఎత్తున ప్రజలు ఆకట్టుకుంటాయి," అని బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శైలేంద్ర సింగ్ అన్నారు.

Team India: టీమ్ ఇండియాలో క్రికెటర్లపై ఒత్తిడి తగ్గించడానికి బీసీసీఐ సరికొత్త ఫార్ములా.. వేర్వేరు జట్లకు ప్రత్యామ్నాయం




కార్డ్‌ల లావాదేవీల నిర్వహణ కోసం కార్డ్ ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఫిజర్వు (Fiserv) సేవలను బీఎఫ్ఎస్ఎల్, ఎన్‌పీసీఐ ఉపయోగించుకుంటున్నాయి. స్మూత్ డిజిటల్ ఎనేబుల్‌మెంట్ కోసం ఫిజర్వు ఏపీఐలు మైక్రో-సర్వీసులను కూడా వాడుకుంటున్నాయి.
Published by:John Kora
First published:

Tags: Bank of Baroda, Credit cards

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు