BOB E AUCTION BUY PROPERTY ANYWHERE IN INDIA WITHIN FEW DAYS HERE DETAILS NS GH
BoB e-auction: బ్యాంక్ ఆఫ్ బరోడా మెగా ఈ-వేలం.. తక్కువ ధరకే ఎలాంటి వివాదాలు లేని ఆస్తులు.. ఇలా కొనేయండి
ప్రతీకాత్మక చిత్రం
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్లియర్ టైటిల్‌తో కూడిన ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. తాజాగా బ్యాంక్ ఈ వేలం ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్లియర్ టైటిల్‌తో కూడిన ఆస్తులను కొనాలనుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. ఆసక్తి గల కస్టమర్ల కోసం మెగా ఈ-వేలం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మెగా ఈ-వేలంలో పాల్గొని క్లియర్ టైటిల్ గల ఆస్తులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి గల కస్టమర్లు మరిన్ని వివరాల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ www.bankofbaroda.in సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కస్టమర్లు తీసుకున్న లోన్లను తిరిగి చెల్లించని సందర్భంలో.. తమ వద్ద తనఖా పెట్టిన ఆస్తులను ఆర్థిక సంస్థలు చట్ట ప్రకారం వేలం వేయవచ్చు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ప్రక్రియను ప్రారంభించింది. మెగా ఈ-వేలంపై బ్యాంక్ ఆఫ్ బరోడా ట్వీట్ చేస్తూ ‘‘భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆస్తులు సొంతం చేసుకోవాలని చాలా మందికి కలగా ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే వారి కల నెరవేరనుంది. మా బ్యాంక్ నిర్వహించనున్న మెగా ఈ-వేలం ద్వారా దేశంలో ఎక్కడైనా క్లియర్ టైటిల్‌తో కూడిన ఆస్తులను ఆన్లైన్లోనే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, వాటికి రుణాలకు కూడా మా బ్యాంక్ నుంచే పొందవచ్చు” అని పోస్ట్ చేసింది. SARFAESI చట్టం ప్రకారం ఆగస్టు 18న ఈ మెగా ఈ-వేలం ప్రారంభం కానుంది. Petrol Price Down: గుడ్ న్యూస్.. పెట్రోల్ పై రూ. 3 తగ్గింపు.. రూ. 100 దిగువకు చేరిన ధర
వేలంలో కొనుగోలుకు వచ్చేవి..
బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహిస్తున్న మెగా ఈ-వేలంలో దేశం నలుమూలలా అనేక ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. ఇళ్లు, ఫ్లాట్లు, ఆఫీస్ స్పేస్, భూమి/ ప్లాట్లు, ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ కొనుగోలు చేయవచ్చు.
ఈ-వేలంతో ప్రయోజనాలు..
ఈ-వేలంలో కొనుగోలు చేసిన ఆస్తులకు క్లియర్ టైటిల్ ఉంటుంది. ఎటువంటి వివాదాలు లేని ఆస్తులను మాత్రమే ఇందులో అమ్మకానికి పెడతారు. కొనుగోలు చేసిన ఆస్తిని తక్షణమే స్వాధీనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అన్ని లీగల్ డాక్యుమెంట్లను అందజేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువ సమయంలోనే ఆస్తిని మీ పేరు మీదకి మ్యుటేషన్ చేస్తారు.
మీరు కొనుగోలు చేసిన ఆస్తిపై బ్యాంక్ ఆఫ్ బరోడా తక్కువ వడ్డీతో కూడిన రుణ సదుపాయం కూడా కల్పిస్తుంది. సులభతర వాయిదాల్లో తీసుకున్న రుణాన్ని చెల్లించవచ్చు. కాగా, మరిన్ని వివరాలకు ఇండియన్ బ్యాంక్స్ ఆక్షన్స్ మార్టిగేజ్ ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ (IBAPI) పరిధిలోని eBkray పోర్టల్‌ను సందర్శించాలని బ్యాంక్ ఆఫ్ బరోడా సూచించింది. ఆసక్తి గల కస్టమర్లు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆస్తి కొనుగోలు చేయాలనుకునే రాష్ట్రం, జిల్లాలను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న ఆస్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.