హోమ్ /వార్తలు /బిజినెస్ /

Loan Offers: రుణాలపై డిస్కౌంట్లు.. లోన్ తీసుకునే వారికి బ్యాంక్ అదిరే ఆఫర్లు!

Loan Offers: రుణాలపై డిస్కౌంట్లు.. లోన్ తీసుకునే వారికి బ్యాంక్ అదిరే ఆఫర్లు!

శుభవార్త.. లోన్ తీసుకునే వారికి బ్యాంక్ అదిరే ఆఫర్లు!

శుభవార్త.. లోన్ తీసుకునే వారికి బ్యాంక్ అదిరే ఆఫర్లు!

Banks | లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? పర్సనల్ లోన్, కార్ లోన్, లేదంటే హోమ్ ఇలా.. ఏదో ఒకరకమైన రుణం పొందాలనే యోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పండుగ సీజన్ నేపథ్యంలో ఒక బ్యాంక్ అదిరే ఆఫర్లు అందిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Bank Of Baroda | దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) తాజాగా ఫెస్టివ్ ఆఫర్లు తీసుకువచ్చింది. కుషియోన్ కా త్యోహార్ పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లు పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. పండుగ సీజన్‌లో లోన్ (Loan) తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.

    బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఫెస్టివ్ ఆఫర్‌లో భాగంగా హోమ్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది. అంతేకాకుండా వడ్డీ రేటు కూడా ఆకర్షణీయగా ఉంది. 7.95 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే కార్ లోన్ పొందాలని భావిస్తే.. ఇదే వడ్డీ రేటు ఉంది. అంటే తక్కువ వడ్డీ రేటుకే కారు కొనుగోలుకు బ్యాంక్ నుంచి రుణం పొందొచ్చు.

    సామాన్యులకు భారీ ఊరట.. రూ.90కే వంట నూనె.. ధరలు ఇంకా తగ్గుతాయా?

    అంతేకాకుండా కస్టమర్లకు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నో ప్రిపేమెంట్ చార్జీలు లేదా పార్ట్ పేమెంట్ చార్జీలు, ప్రాసెసింగ్ చార్జీల్లో రాయితీ, దీర్ఘకాల రీపేమెంట్ ఫెసిలిటీ (7 ఏళ్ల వరకు) వంటి ప్రయోజనాలు పొందొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కే ఖురాన మాట్లాడుతూ.. పండుగ సీజన్ ప్రారంభం అవుతోందని, ఫెస్టివ్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.

    దసరా ఆఫర్.. ఈ స్కూటర్‌పై ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్!

    అంతేకాకుండా బ్యాంక్ డిజిటల్ లెండింగ్ క్యాంపెయిన్‌ కూడా నిర్వహిస్తోంది. కస్టమర్లకు డిజిటల్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. ప్రి అప్రూవ్డ్ పర్సనల్ లోన్ , పర్సనల్ లోన్, ఆటో లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ , ముద్రా లోన్, ఎంఎస్ఎంఈ లోన్, గోల్డ్ లోన్, బరోడా కిసాన్ క్రెడిట్ కార్డు వంటి రుణాలు ఆన్‌లైన్‌లో పొందొచ్చు. బ్యాంక్ ప్రస్తుత కస్టమర్లు లేదా కొత్త కస్టమర్లు బ్యాంక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా రుణాల కోసం అప్లై చేసుకోవచ్చు.

    బ్యాంక్ కస్టమర్లు రుణ ఆపర్లతో పాటుగా అధిక వడ్డీ రేటును కూడా సొంతం చేసుకోవచ్చు. బరోడా త్రిరంగ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఇది స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్. 444 రోజులు లేదా 555 రోజుల టెన్యూర్‌తో ఎఫ్‌డీ అకౌంట్ తెరవొచ్చు. 444 రోజుల ఎఫ్‌డీ అయితే 5.75 శాతం, 555 రోజుల ఎఫ్‌డీ అయితే 6 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు 0.5 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. ఈ ఏడాది చివరి వరకు ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Bank loan, Bank of Baroda, Banks, Car loans, Home loan

    ఉత్తమ కథలు