ఈ మధ్యకాలంలో ఈ-కామర్స్(E Commerce) సంస్థలు కస్టమర్లకు భారీగా ఆఫర్లు(Offers) ఇస్తున్నాయి. ఒక్క రూపాయి చేతిలో లేకపోయినా ఎంతటి విలువైన వస్తువునైనా క్షణాల్లో ఇంటికి తీసుకెళ్లిపోండంటూ మెసేజ్‌లు చేస్తున్నాయి. ఈ ఆఫర్ చూసి కంపెనీలకు మీరు స్పెషల్(Special) అని భావిస్తే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే కేవలం మన క్రెడిట్ హిస్టరీని బట్టే వారు మనల్ని నమ్ముతున్నారు. ఆఫర్లు ఇస్తున్నారు కదా అని.. అవసరమున్నా, లేకపోయినా వస్తువులు కొనేవారూ ఉన్నారు. కానీ ఇలా అప్పులు చేయడం కరెక్టేనా? అప్పులు చేస్తూ పోతే.. రుణాలపైనే ఆధారపడుతున్నామని ఆయా క్రెడిట్ సంస్థలు భావిస్తాయా? 'బై నౌ.. పే లేటర్'(Buy now-pay later) మీ క్రెడిట్ స్కోర్‌ను(credit score) ప్రభావితం చేస్తుందా? ఇలాంటి అంశాలపై అవగాహన కలిగిఉండటం చాలా ముఖ్యం.
బై నౌ-పే లేటర్(BNPL).. గత రెండు, మూడేళ్లుగా బాగా పాపులర్ ట్రెండ్‌గా మారింది. ఈ తరహా ఆఫర్లలో భాగంగా సులభంగా రుణాలు పొందగలుగుతున్నారు. ఇన్స్టంట్, నో-కాస్ట్ ఫైనాన్సింగ్ వంటివి సులువుగా లభిస్తున్నప్పటికీ చాలామంది సమయానికి చెల్లింపులు చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. దీనితో క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతోంది. అందువల్ల ఇతర రుణాల మాదిరిగానే, బీఎన్‌పీఎల్ రుణాలను సైతం సకాలంలో తిరిగి చెల్లించేలా చూసుకుంటేనే హెల్దీ క్రెడిట్ స్కోర్ సాధ్యమవుతుంది.
భారతదేశంలో రుణాలు పొందాలంటే ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా చూసేది క్రెడిట్ స్కోర్. 300 నుంచి 900 పాయింట్ల మధ్య క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు దీనిని లెక్కిస్తాయి. క్రెడిట్ హిస్టరీ సరిగాలేని వారు క్రెడిట్ కార్డ్‌కు అర్హత లేని వ్యక్తులకు రుణాలు లభించడం కష్టమే. అయితే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు సైతం బై నౌ-పే లేటర్(BNPL) కింద ఆయా సంస్థలు రుణాలు అందింస్తున్నాయని Tavaga అడ్వైజరీ సర్వీసెస్ సీఈఓ నితిన్ మాథుర్ అన్నారు. BNPL క్రెడిట్ ఇండస్ట్రీ, రుణ నియంత్రణ సంస్థల దృష్టిని ఆకర్షించింది. ఇది త్వరలోనే వినియోగదారుల క్రెడిట్ స్కోర్లను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
HQ-17 Missile: ఆర్మీ ఆధునీకరణలో చైనా దూకుడు.. మిలిటరీ వ్యవస్థలోకి సరికొత్త మిస్సైల్.. అది ఎలా పనిచేస్తుందంటే..
వాస్తవానికి BNPL అనేది వ్యక్తిగత రుణం. దీన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తులు ఎంచుకున్న ప్లాన్ రకాన్ని బట్టి సకాలంలో చెల్లింపులు చేయలేకపోతే వడ్డీ విధిస్తారు. భారానికి మించి చేసే అధిక ఖర్చుల వల్ల క్రెడిట్ స్కోర్ ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది అని మాథుర్ హెచ్చరించారు. సాంప్రదాయ లోన్లకు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వ్యక్తులు ఆమోదం పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ పొందాలన్నా డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం కావచ్చు. అయితే BNPLకి వచ్చేసరికి సులువుగా రుణాలు లభిస్తాయని చెబుతున్నారు CashBean వైస్ ప్రెసిడెంట్ అన్షుమన్ నరైన్. అయితే BNPL రుణాలు పొందే ముందు దీనిలో ఉన్న రిస్కులను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.