జర్మనీకి చెందిన లగ్జరీ(Luxury) కార్ల తయారీ సంస్థ BMW తాజాగా తన పాపులర్ X3 మోడల్‌ను రిఫ్రెష్ చేసింది. గురువారం కొత్త ఎక్స్ 3 ఎస్‌యూవీ డీజిల్(Diesel) వేరియంట్‌ను విడుదల చేసింది. మొదట ఇది కేవలం పెట్రోల్(Petrol) ఇంజిన్‌తో మాత్రమే విడుదలైంది. తాజా లాంచింగ్‌తో ఇకపై డీజిల్ ఇంజిన్‌లోనూ లభించనుంది. దీంతో, రెండు పెట్రోల్ వేరియంట్లతో పాటు ఒక డీజిల్ వేరియంట్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ లేటెస్ట్ లగ్జరీ కారు మోడల్ స్థానికంగా చెన్నైలోని(Chennai) బీఎండబ్ల్యూ ప్లాంట్‌లో తయారైంది. ఇది పెట్రోల్ ట్రిమ్‌తో పాటే దేశవ్యాప్తంగా ఉన్న బీఎండబ్ల్యూ డీలర్షిప్ సెంటర్లలో అందుబాటులో ఉంటుంది. ధరల పరంగా చూస్తే.. కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్3 xDrive20d ట్రిమ్ వేరియంట్ రూ. 65.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక, xDrive30i స్పోర్ట్స్ ఎక్స్ ప్లస్ ట్రిమ్ దర రూ. 59.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
2 .0- లీటర్ 4 -సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో..
కొత్త బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 డీజిల్ వేరియంట్.. ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీతో కూడిన శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారులో 2 .0- లీటర్ 4 -సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చింది. ఈ ఇంజిన్ గరిష్టంగా1 1,750 ఆర్పీఎం నుంచి 2,500 ఆర్పీఎం వద్ద 90 హెచ్‌పి శక్తిని, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గరిష్టంగా 213 kmph వేగంతో ప్రయాణించగలదు. కేవలం 7.9 సెకన్లలో 0 నుంచి -100 kmph వేగాన్ని అందుకోగలదు. కొత్త BMW X3 మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, బ్రూక్లిన్ గ్రే, సోఫిస్టో గ్రే, బ్లాక్ సఫైర్, కార్బన్ బ్లాక్ వంటి వివిధ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
గంటకు 213 కిలోమీటర్ల వేగంతో..
ఈ లేటెస్ట్ డీజిల్ ఇంజిన్ కారు BMW సర్వీస్ ఇన్‌క్లూజివ్, BMW సర్వీస్ ఇన్‌క్లూజివ్ ప్లస్ వంటి సర్వీస్ ప్యాకేజీలతో విడుదలైంది. ఈ సర్వీస్ ప్యాకేజీలు 3 సంవత్సరాలు/40,000 కి.మీల నుండి 10 సంవత్సరాలు/2,00,000 కి.మీల వరకు మెయింటెనెన్స్ వర్క్ లేదా కండిషన్ బేస్డ్ సర్వీస్ (CBS)ను కవర్ చేస్తాయి. ఈ సర్వీస్ ధర కిలో మీటర్‌కు రూ. 1.53 నుండి ప్రారంభమవుతుంది. దీనికి అదనంగా BMW X3 ఆప్షనల్ రిపేర్ ఇన్‌క్లూజివ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్‌యూవీ లాంచింగ్ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు కొత్త మోడళ్లను భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.