• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • BMW TO RELEASE NEW ELECTRIC SCOOTER SOON KNOW SPECIFICATIONS SS GH

BMW Electric Scooter: బీఎండబ్ల్యూ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

BMW Electric scooter: బీఎండబ్ల్యూ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (ప్రతీకాత్మక చిత్రం)

BMW Electric Scooter | బీఎండబ్ల్యూ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
ఆటోమొబైల్ రంగంలో జర్మన్ సంస్థ బీఎండబ్ల్యూ ప్రముఖ కంపెనీగా వెలుగొందుతోంది. అధునాతన కార్లు, బైక్​లతో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీనీ వేగవంతం చేసింది. కొత్త మోడళ్లను అధిక సంఖ్యలో టెస్ట్​ చేస్తోంది. ఇదే తరుణంలో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ను బీఎండబ్ల్యూ మార్కెట్లోకి తీసుకురానుంది. బీఎండబ్ల్యూ డెఫినిషన్ సీఈ 04 మోడల్​ ఈ-స్కూటర్‌ను సంస్థ ఆవిష్కరించింది. ప్రస్తుతం టెస్టింగ్​ దశలో ఉన్న డెఫినిషన్ సీఈ 04 స్కూటర్లను త్వరలోనే భారీ సంఖ్యలో బీఎండబ్ల్యూ ఉత్పత్తి చేయనుంది. టెస్టింగ్ కోసం రోడ్లపైకి వచ్చిన ఈ మోడల్ కెమెరాలకు చిక్కింది. ఈ స్కూటర్ స్పోర్ట్స్​ లుక్​తో అదిరిపోయేలా ఉంది. దీని డిజైన్ చూస్తుంటే డుకాటి స్పోర్ట్స్​ 1000 బిపోస్టో స్ఫూర్తిగా తీసుకున్నట్టుంది. ఫేమస్ సినిమా డ్రోన్ లెగసీలో బిపోస్టో మోడల్ వినియోగించిన సంగతి తెలిసిందే.

డిఫినిషన్ సీఈ 04 ఫస్ట్​లుక్​లో సూపర్ స్టైలిష్​గా కనిపిస్తోంది. యూత్​కు నచ్చే విధంగా ట్రెండీగా ఉంది. ప్రస్తుతానికి ప్రొడక్షన్ వివరాలను ఈ ప్రముఖ జర్మనీ ఆటోమొబైల్ సంస్థ వెల్లడించలేదు. ఈ మోడల్​లో ఇంటిగ్రేటెడ్​ ఎల్​ఈడీలతో వీ షేప్ హెడ్​ల్యాంప్​ ఉంది. సరిగ్గా ముందు భాగం మధ్యలో హెడ్​ల్యాంప్ స్టైలిష్​గా ఉంది. దాంతో పాటు 10.25 ఇంచుల టచ్​స్క్రీన్ ఇన్​స్ట్రుమెంట్ ఈ స్కూటర్​కు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మంచి అందాన్ని తేవడంతో పాటు అదనపు ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇన్ఫోటైన్​మెంట్​ సౌకర్యాలు కూడా ఉండవచ్చు.

Money Transfer: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? 14 గంటలు ఆ సేవలు బంద్

EPF Withdrawal: కరోనాతో మరణించినవారి ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డ్రా చేయండిలా

బీఎండబ్ల్యూ డెఫినెషన్​ సీఈ 04 ఫుట్​ఏరియా హెచ్​-షేప్​లో ఉంది. చాలా వరకు స్కూటర్లు ఉండే విధంగానే బీఎండబ్ల్యూ దీని ఫుట్​ఏరియాను డిజైన్ చేసింది. మరోవైపు సీటు కాంట్రాస్ట్​ కలర్లతో ఉండే అవకాశం ఉంది. స్కూటర్ బాడీకి తగ్గట్టు సీట్ కలర్​ నిండుగా ఉండనుంది. వెనుకభాగంలోనూ ఎల్​ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా వీల్ ఆధారిత బీఎల్​డీసీ హబ్ మోటార్​తో వస్తుండగా.. బీఎండబ్ల్యూ మోడల్​లో చైన్ డ్రైవర్ సిస్టమ్​తో మిడ్ రేంజ్​ ఎలక్ర్టిక్ మిల్​ ఉండనుంది.

Gold Hallmarking: హాల్‌మార్కింగ్ అంటే ఏంటీ? ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండిలా

ప్రస్తుతానికైతే డెఫినెషన్ సీఈ 04కు సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్​ను బీఎండబ్ల్యూ వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బీఎండబ్ల్యూ సీ ఎవల్యూషన్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లుగా ఉంది. అయితే కొత్తగా తెచ్చే ఎలక్ర్టిక్ స్కూటర్లు సైతం ఇదే వేగం లేదా అంతకన్నా మించిన వేగంతోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా బీఎండబ్ల్యూ డెఫినెషన్ సీఈ 04 లుక్స్ పరంగా అదుర్స్ అనిపించేలా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటరే అయినా స్పోర్ట్స్​ లుక్​లో ఉంది. మరి దీన్ని బీఎండబ్ల్యూ ఎప్పుడు విడుదల చేస్తుందో చూడాలి.
Published by:Santhosh Kumar S
First published: