news18-telugu
Updated: November 11, 2020, 6:42 PM IST
BMW Bike R9T (ప్రతీకాత్మక చిత్రం) (Image: bmw)
జర్మనీకి చెందిన లగ్జరీ వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) 2021 చివరికల్లా భారత మార్కెట్లోకి సరికొత్త R9 టీ మోడల్‌ను విడుదల చేయనుంది. ఇటీవలే దీనికి సంబంధించిన ఫీచర్లను వెల్లడించింది. కాగా, బీఎమ్‌డబ్ల్యూ R9 టీ మోడల్ త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ ప్రీమియం బైక్ భారత మార్కెట్లో మాత్రం వచ్చే ఏడాది చివర్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. బీఎండబ్ల్యూ R9 టీ బైక్‌కు సంబంధించిన ఫీచర్లను వెల్లడించింది సంస్థ. వాటిపై ఓలుక్కేయండి.
మొత్తం నాలుగు మోడళ్లలో..కొత్త బీఎమ్‌డబ్ల్యూ ఆర్ 9 టీ బైక్ స్టాండర్డ్, ప్యూర్, స్క్రాంబ్లర్, అర్బన్ జి/ఎస్ అనే నాలుగు వేరియంట్లలో విడుదల కానుంది. ఈ మోడళ్లు వివిధ కలర్ కాంబినేషన్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. అర్బన్ జి/ఎస్ మోడల్ విషయానికి వస్తే ఆల్పైన్ వైట్ విత్ టేప్, బ్లాక్ స్టార్మ్ మెటాలిక్/ రేసింగ్ రెడ్, ఎడిషన్ 40 ఇయర్స్ జిఎస్ వెర్షన్లలో లభిస్తుంది. మిగతా మూడు మోడళ్లు స్టాండర్డ్ గ్రానైట్ గ్రే మెటాలిక్ మాట్లో లభిస్తాయి. ఇవి కూడా వివిధ కలర్ కాంబినేషన్స్‌లో అందుబాటులో ఉంటాయి.
కొత్త ఇంజిన్‌తో వస్తుంది
EU–5 నిబంధనలకు అనుగుణంగా బీఎండబ్ల్యూ పాత ఇంజిన్‌ను అప్డేట్ చేసింది సంస్థ. నూతన బైక్‌లో ఇంజన్ గరిష్ట శక్తి 110 హెచ్‌పీ నుంచి 109 హెచ్‌పికి మార్చబడింది. ఈ బైక్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 116 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఎల్ఈడీ లైటింగ్ యూనిట్‌తో అట్రాక్టివ్‌గా
బీఎండబ్ల్యూ R9 టీ 2021 వెర్షన్‌కి చెందిన రెయిన్, రోడ్ రైడింగ్ మోడ్ల మాదిరిగానే డైనమిక్ బ్రేక్ కంట్రోల్ (DBC), ట్రావెల్- డిపెండెంట్ డంపింగ్ (WAD)లతో కూడిన కొత్త సస్పెన్షన్ స్ట్రట్ను కూడా చేర్చింది. యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్‌తో వచ్చే ఈ బైక్ క్లాసిక్ సర్క్యులర్ ఇన్‌స్ట్రుమెంట్‌తో కొత్త డయల్, ఎల్ఈడీ లైటింగ్ యూనిట్లును కలిగి ఉంది.
యూఎస్బీ సాకెట్ ఛార్జింగ్ ఫీచర్
బీఎండబ్ల్యూ R9 టీ బైక్‌లో సౌకర్యవంతమైన నిర్వహణ కోసం ట్రావెల్ డిపెండెంట్ డంపింగ్ (WAD)తో వచ్చే కొత్త సస్పెన్షన్ స్ట్రట్ను చేర్చింది. దీని నాలుగు మోడళ్లలోనూ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్‌ను కూడా అందించింది. ఈ సాకెట్ సహాయంతో ప్రయాణంలోనే ఉండగానే స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేయవచ్చు. దీనిలోని వైట్ ఎల్ఈడీ ఇండికేటర్స్ అన్ని వేరియంట్లకు ప్రామాణికంగా వస్తాయి. అంతేకాక, దీనిలోని LED హెడ్‌లైట్ రన్నింగ్ లైట్/ పార్కింగ్ లైట్‌గా పనిచేస్తుంది.
ధర, లభ్యత
బీఎమ్‌డబ్ల్యూ ఆర్9 టీ త్వరలో అంతర్జాతీయం మార్కెట్లోకి వస్తుంది. భారత మార్కెట్లోకి మాత్రం 2021 చివరికల్లా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం R9 టీ మోడల్ రూ.17 లక్షల ప్రారంభ ధరలకు అందుబాటులో ఉండగా, వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న కొత్త మోడల్ కూడా అదే ధర పరిధిలో లభించే అవకాశం ఉంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 6, 2020, 9:28 PM IST