BMW R18 Cruiser: మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఆర్ 18 క్రూజర్ బైక్.. ధరెంతంటే..

పూర్తి స్థాయి నిర్మాణ యూనిట్ (CBU) కింద ఈ బైక్‌లను భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ఇవాళ్టి నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయని బీఎండబ్ల్యూ ప్రతినిధులు తెలిపారు.

news18-telugu
Updated: September 20, 2020, 3:19 PM IST
BMW R18 Cruiser: మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఆర్ 18 క్రూజర్ బైక్.. ధరెంతంటే..
బీఎండబ్ల్యూ ఆర్ 18 క్రూజర్ బైక్
  • Share this:
బీఎండబ్ల్యూ.. ఆటోరంగంలో ఆ బ్రాండ్‌కు ఉన్న క్రేజే వేరు. అది కారైనా.. బైకైనా..! ప్రతి ఒక్కరికీ బీఎండబ్ల్యూ కొనాలని డ్రీమ్ ఉంటుంది. జర్మనీకి చెందిన ఈ దిగ్గజ సంస్థ నుంచి మరో సూపర్ బైక్ వచ్చింది. బీఎండబ్ల్యూ R18 పేరిట కొత్త క్రూయిజర్‌ బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది బీఎండబ్ల్యూ మోటార్డ్‌. ఈ బైక్‌తో క్రూయిజర్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టినట్లయింది. బీఎండబ్ల్యూ R18 రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఒకటి స్టాండర్డ్ మోడల్ కాగా.. రెండోది ఫస్ట్ ఎడిషన్ వేరియెంట్..! స్టాండర్డ్‌ మోడల్‌ ధర రూ.18.9 లక్షలు. ఇక ఫస్ట్‌ ఎడిషన్‌ పేరిట తీసుకొస్తున్న బైక్‌ ధర రూ.21.9 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇవి ఎక్స్ షోరూం ధరలు. ఇతర చార్జీలు కలిపితే బైక్ ధర మరింత పెరుగుతుంది.

బీఎండబ్ల్యూ R18 క్రూజన్ బైక్ 1802 సీసీ ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌, ఆరు గేర్లతో వస్తోంది. బైక్ ఇంజిన్‌ 4,750 ఆర్‌పీఎం వద్ద 89.75 బీహెచ్‌పీని విడుదల చేస్తుంది. 3000 ఆర్‌పీఎం వద్ద 158 ఎన్‌ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో రివర్స్‌ గేర్‌ సదుపాయం కూడా ఉంది. ఇందులో ఎల్ఈడీ లైటింగ్ సెటప్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, స్విచబుల్ ఆటోమెటిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ASC) అదనపు ఆకర్షణలు. ఇందులో రెయిన్, రోల్, రాక్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఫోర్ పిస్టన్ ఫిక్స్‌డ్ కాలిపర్స్‌తో ముందు చక్రానికి డబుల్ డిస్క్, వెనక చక్రానికి సింగిల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.

పూర్తి స్థాయి నిర్మాణ యూనిట్ (CBU) కింద ఈ బైక్‌లను భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ఇవాళ్టి నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయని బీఎండబ్ల్యూ ప్రతినిధులు తెలిపారు. BMW Motorrad డీలర్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

BMW R5ని స్ఫూర్తిగా తీసుకొని ఈ బైక్‌ను రూపొందించారు. 1930ల్లో వచ్చిన ఆ బైక్ స్టైల్లోనే బీఎండబ్ల్యూ ఆర్ 18ని డిజైన్ చేశారు. గుండ్రి హెడ్ ల్యాంప్, పొడవాటి హ్యాండిల్ బార్స్, భారీ ఎగ్జాస్ట్ పైప్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బీఎండబ్ల్యూ R‌18 ద్వారా క్రూయిజర్‌ విభాగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని... ఈ రోజు కోసమే ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారని బిఎండబ్ల్యూ మోటార్డ్ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పాహ్‌ తెలిపారు. ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న డుకాటీ డియావెల్‌ 1260, ఇటీవలే వచ్చిన ట్రయాంఫ్‌ రాకెట్‌ 3 జీటీ బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 20, 2020, 3:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading