బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా (BMW Motorrad India) కొత్తగా నాలుగు ‘టూరింగ్ రేంజ్’ మోటార్‌సైకిళ్లను ఇండియాలో లాంచ్ చేసింది. వీటిలో బీఎండబ్ల్యూ R 1250 RT ధర రూ.23.95 లక్షలు కాగా, బీఎండబ్ల్యూ K 1600 Bagger ధర రూ.29.90 లక్షలుగా ఉంది. బీఎండబ్ల్యూ K 1600 GTL మోడల్ ధర రూ.32 లక్షలు, బీఎండబ్ల్యూ K 1600 Grand America మోటార్ సైకిల్ ధర అత్యధికంగా రూ.33 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా పేర్కొంది. బైక్స్‌ను ముందుగా బుక్ చేసుకున్న కొనుగోలుదారులకు ఈ నెల నుంచే డెలివరీలు ప్రారంభించనుంది. దీంతోపాటు భారతదేశంలోని అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో కొత్త టూరింగ్ రేంజ్ యాక్సెసరీస్, లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన వస్తువులను విక్రయించనుంది.
కొత్త బైక్స్ లాంచింగ్‌పై మాట్లాడారు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్. ‘ప్రతి బీఎండబ్ల్యూ మోటోరాడ్ మోడల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కటి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. హై పర్పార్మెన్స్, ఎమోషనల్, ఎక్స్‌క్లూజివ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే కొత్త బీఎండబ్ల్యూ మోటోరాడ్ టూరింగ్ మోటార్‌సైకిళ్లు 'స్పిరిట్ ఆఫ్ ది ఓపెన్ రోడ్' నినాదానికి రుజువుగా నిలుస్తాయి. రెండు చక్రాలపై ఎలిగెన్స్, పవర్, లగ్జరీకి పర్యాయపదంగా ఉంటాయి.’ అని విక్రమ్ చెప్పారు.
బీఎండబ్ల్యూ R 1250 RT మోటార్ సైకిల్ కొత్త ఫెయిరింగ్, ఫుల్ LED హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. ఈ బైక్‌లో బీఎండబ్ల్యూ షిప్ట్‌క్యామ్ టెక్నాలజీతో 1254 cc 2-సిలిండర్ బాక్సర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7,750 rpm వద్ద 134 bhp శక్తిని, 6,250 rpm వద్ద 143 Nm అత్యధిక టార్క్‌ను అందిస్తుంది.
R 1250 RT మోటార్ సైకిల్ 200 kmph గరిష్ట వేగాన్ని అందుకుంటూ.. ప్రారంభం నుంచి 100 kmph మార్కును చేరుకోవడానికి కేవలం 3.7 సెకన్లు పడుతుంది.
బీఎండబ్ల్యూ K 1600 GTL, బీఎండబ్ల్యూ K 1600 B, బీఎండబ్ల్యూ K 1600 Grand America విషయానికి వస్తే.. ఇవన్నీ 1649 cc 6-సిలిండర్ ఇన్-లైన్ ఇంజిన్‌తో రూపొందాయి. ఈ ఇంజిన్ 6,750 rpm వద్ద 158 bhp, 5,250 rpm వద్ద 180 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డైనమిక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ ESA, ఆడియో సిస్టమ్ 2.0, ఇంటిగ్రేటెడ్ మ్యాప్ నావిగేషన్‌తో 10.25-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే వంటి ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్ మల్టిపుల్ కలర్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.
* అన్ని బైక్‌లకు మూడేళ్ల వారంటీ
అల్టిమేట్ లగ్జరీ టూరింగ్ మోటార్‌సైకిల్ రేంజ్ కొత్త బీఎండబ్ల్యూ R 1250 RT, బీఎండబ్ల్యూ K 1600 GTL, బీఎండబ్ల్యూ K 1600 Baggar, బీఎండబ్ల్యూ K 1600 Grand America భారతదేశంలోని టూరింగ్ విభాగంలో లగ్జరీని, ప్రత్యేకతను తీసుకొచ్చాయి. లెజెండరీ 2-సిలిండర్ బాక్సర్, 6-సిలిండర్ ఇంజిన్ పర్ఫార్మెన్స్, అత్యుత్తమ రైడ్ సౌకర్యం, ప్రత్యేకమైన ఫీచర్లు పొడవైన హైవేలపై రిలాక్స్‌డ్ క్రూజింగ్‌ను అందిస్తాయి. భారతదేశంలోని అన్ని బీఎండబ్ల్యూ బైక్‌లు మూడేళ్లు, అపరిమిత కిలోమీటర్లకు ప్రామాణిక వారంటీతో వస్తాయి. అదనపు ఖర్చుతో వారంటీని నాలుగు, ఐదు సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.