హోమ్ /వార్తలు /బిజినెస్ /

BMW C400 GT: భారత్‌లో లాంచ్‌ అయిన BMW C400 GT స్కూటర్.. ప్రారంభ ధర ఎంతో తెలిస్తే...

BMW C400 GT: భారత్‌లో లాంచ్‌ అయిన BMW C400 GT స్కూటర్.. ప్రారంభ ధర ఎంతో తెలిస్తే...

BMW C400 GT స్కూటర్

BMW C400 GT స్కూటర్

ప్రఖ్యాత ఆటోమొబైల్‌ సంస్థ BMW మోటరాడ్‌ ఇండియా సరికొత్త మ్యాక్సీ స్కూటర్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. BMW C400 GT స్కూటర్‌ను సంస్థ ఆవిష్కరించింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.9.95 లక్షలుగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముతున్న స్కూటర్లలో ఇదే అత్యంత ఖరీదైనది కావడం విశేషం.

ఇంకా చదవండి ...

ప్రఖ్యాత ఆటోమొబైల్‌ సంస్థ BMW మోటరాడ్‌ ఇండియా సరికొత్త మ్యాక్సీ స్కూటర్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. BMW C400 GT స్కూటర్‌ను సంస్థ ఆవిష్కరించింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.9.95 లక్షలుగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముతున్న స్కూటర్లలో ఇదే అత్యంత ఖరీదైనది కావడం విశేషం.

ఈ స్కూటర్‌ పూర్తిగా విదేశాల్లోనే తయారవుతుంది. దీన్ని CBUగా.. అంటే కంప్లీట్‌ బిల్ట్‌ అప్‌గా భారత్‌కు తీసుకువస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న BMW డీలర్‌షిప్స్‌లో దీని బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆల్పైన్‌ వైట్‌, స్టైల్‌ ట్రిపుల్‌ బ్లాక్‌ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంది.

ఈ ప్రీమియం శ్రేణి మ్యాక్సీ స్కూటర్‌లోని ముఖ్యమైన, అత్యాధునిక ఫీచర్లను సంస్థ చేర్చింది. BS6 నిబంధనలకు అనుగుణంగా ఉండే 350సీసీ, వాటర్‌ కూల్డ్‌, సిలిండర్‌, ఫోర్‌ స్ట్రోక్‌, ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌ ఇంజిన్‌ దీని ప్రత్యేకగా చెప్పుకోవచ్చు. 7,500 ఆర్‌పీఎం దగ్గర 34 PS పవర్‌, 5,750 ఆర్‌పీఎం దగ్గర 35 Nm అత్యుత్తమ టార్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. CVT టెక్నాలజీ, గంటకు 139 కి.మీ వేగం అందుకోగల సామర్ధ్యం, ముందు భాగంలో 15 అంగుళాల టైర్‌ (120/70 R15), వెనుక భాగంలో 14 అంగుళాల (150/70 R14) టైర్.. వంటి స్పెసిఫికేషన్లతో ఈ సరికొత్త స్కూటర్‌ను రూపొందించారు.

సస్పెన్షన్‌ కోసం ముందు భాగంలో 35 ఎంఎం టెలిస్కోపిక్‌ ఫోర్కులు, వెనుక భాగంంలో 110 ఎంఎం ట్రావెల్‌, డ్యుయల్‌ స్ప్రింగ్‌ లోడెడ్‌ ఆబ్సార్బర్స్‌, ముందు భాగంలో 4 పిస్టన్‌ క్యాలిపర్స్‌తో డ్యుయల్‌ డిస్క్‌ బ్రేక్స్, వెనుక వైపు సింగిల్‌ డిస్క్‌ 1 పిస్టన్‌ ఫ్లోటింగ్‌ క్యాలిపర్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లను సీ400 జీటీ స్కూటర్‌లో పొందుపరిచారు. ఈ వెహికిల్‌ బరువు 202 కేజీలు ఉంటుంది.

ఇది కూడా చదవండి: Amazon Great Indian Festival: కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా.. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ ఇంత తక్కువకు వస్తుంటే ఇంకేంటి లేట్..

ఈ BMW C400 GT స్కూటర్‌కు LED హెడ్‌లైట్‌, LED టెయిల్‌ లైట్‌, LED టర్న్‌ ఇండికేటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కీ లేకుండా కూడా ఈ మ్యాక్సీ స్కూటర్‌ను స్టార్ట్ చేయవచ్చు. BMW మోటరాడ్‌తో కనెక్టివిటీ కలిగిన 6.5 అంగుళాల కలర్‌ డిస్‌ప్లే, USB ఛార్జింగ్‌ సాకెట్‌తో పాటు ఆప్షనల్‌గా హీటెడ్‌ గ్రిప్స్స్‌, సీట్‌ ఉన్నాయి.

ఈ రేంజ్‌లో BMW మోటరాడ్‌ సంస్థకు భారతదేశంలో పోటీ లేదు. రూ.9.95 లక్షల ప్రారంభ ధరతో ఇది అందుబాటులో ఉంది. భారతదేశపు నగర ప్రయాణ సెగ్మెంట్‌లో ఈ BMW C 400 GT రాక కొత్త శకానికి నాంది పలుకుతుందని BMW గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పావా అన్నారు. దీంతో సునాయాసంగా నగర ప్రయాణమే కాదు దూర ప్రాంతాలకు కూడా ఎంతో హాయిగా వెళ్లవచ్చని తెలిపారు.

First published:

Tags: Bikes, Bmw, Business, SCOOTER, Technology

ఉత్తమ కథలు