BMW M5 Competition: బీఎండబ్ల్యూ నుంచి M5 కాంపిటీషన్​ సెడాన్​ కారు విడుదల

BMW M5 Competition: బీఎండబ్ల్యూ నుంచి M5 కాంపిటీషన్​ సెడాన్​ కారు విడుదల

BMW M5 Competition | బీఎండబ్ల్యూ ఎం5 కాంపిటీషన్ కార్ రిలీజ్ అయింది. ఈ కారు ధర, ఫీచర్స్, ఇతర వివరాలు తెలుసుకోండి.

  • Share this:
జర్మన్​ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త ఎమ్​ 5 కాంపిటీషన్ ఫేస్​లిఫ్ట్ సెడాన్​ కారు​ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ కొత్త బీఎండబ్ల్యూ ఎం 5 కారును సుమారు రూ. 1.62 కోట్ల ధర వద్ద విక్రయించనుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనిలో అప్​డేటెడ్​ ఫీచర్స్​తో పాటు అప్​డేటెడ్​ డిజైన్​ను అందించారు. బెటర్​ పర్ఫార్మెన్స్​ ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ముఖ్యంగా ఈ కారులోని లేజర్ లైట్​ హెడ్​ ల్యాంప్​లు, రివైజ్డ్​ టెయిల్​ లాంప్స్​, ఎల్​ ఆకారపు డిఆర్​ఎల్​ ఫీచర్లు దీన్ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

కొత్త బీఎండబ్ల్యూ ఎం 5 కాంపిటీషన్​లో 6 ఎయిర్​ బ్యాగ్స్​, మిర్రర్​ క్యాప్స్​, లేజర్​ లైట్స్​, ఆటోమేటిక్​ టెయిల్​ గేట్​, ఫోర్​ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, ఎలక్ట్రిక్​ అడ్జస్టెబుల్​ సీట్స్​, కొత్త షాక్​ అబ్జార్బర్స్, ట్రాక్ మోడ్, సెంట్రలైజ్డ్ ఇంటెలిజెంట్ కంట్రోల్‌, డైనమిక్​ స్టెబిలిటీ కంట్రోల్​, కార్నరింగ్​ బ్రేక్​ కంట్రోల్​, డైనమిక్​ ట్రాక్షన్​ కంట్రోల్​ వంటి అదనపు హంగులను అందించింది. BMW M5 కాంపిటీషన్ మొత్తం ఐదు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బ్రాండ్స్ హాచ్ గ్రే, మోటెగి రెడ్ మెటాలిక్, టాంజానిట్ బ్లూ II మెటాలిక్, అవెన్చురిన్ రెడ్ II మెటాలిక్, మాట్​ ఫ్రోజెన్ బ్లూస్టోన్ మెటాలిక్ ఫినిషింగ్‌ వంటి కలర్స్​లో అందుబాటులో ఉంటుంది.

Udyogni Scheme: మహిళల కోసం ఉద్యోగిని స్కీమ్... రూ.3,00,000 వరకు లోన్

IRCTC Goa Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో గోవా టూర్... ప్యాకేజీ వివరాలివే

ఈ కారులో వెనుక భాగంలో అప్​డేటెడ్​ ఎగ్జాస్ట్​ టిప్స్​ను కూడా చేర్చింది. ఇది ఎగ్జాస్ట్​ టిప్స్​తో పాటు కొత్త ఆప్రాన్​, డిఫ్యూజర్​ డిజైన్​ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిలో 20 ఇంచెస్​ అల్లాయ్​ వీల్స్​ను కూడా అందించింది. మొత్తానికి బీఎండబ్ల్యూ డబ్ల్యూ మునుపటి మోడల్స్​ కంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఆన్​లైన్​లో బుకింగ్స్ ప్రారంభం


బీఎండబ్ల్యూ ఎం 5 కాంపిటీషన్ కారు క్యాబిన్​ లోపల ఉండే ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​లో పెద్ద మార్పు చేసింది. దీనిలో సరికొత్త ఐడ్రైవ్​ సిస్టమ్​ 12.3 ఇంచెస్​ టచ్​స్క్రీన్, వైర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో, కార్​ప్లే కనెక్టివిటీ వంటి వాటిని అందించింది. ఈ లగ్జరీ కారులోని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అడాప్టివ్​ డంపర్స్​, ట్రాక్​ మోడ్​, యాంబియంట్​ లైటింగ్​, స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీతో టచ్​ స్క్రీన్​, సిగ్నల్స్ కంట్రోల్​, వాయిస్​ అసిస్ట్​, 12.3 అంగుళాల డిజిటల్​ డిస్​ప్లే వంటివి చేర్చింది. వీటితో పాటు క్లైమేట్​ కంట్రోల్​, వైర్​లెస్​ ఫోన్​ ఛార్జింగ్​, హ్యాండ్స్​ ఫ్రీ పార్కింగ్, 16–స్పీకర్​ హర్మన్​ కోర్డాన్​ సరౌండ్​ సౌండ్​ సిస్టమ్​ కూడా అందుబాటులోకి తెచ్చింది.

Top 10 Brands in India: ఈ సంస్థలో జాబ్ కావాలి... ఉద్యోగులు కోరుకుంటున్న టాప్ 10 బ్రాండ్స్ ఇవే

Jio New Plan: జియో నుంచి కొత్త ప్లాన్... రోజూ 3జీబీ డేటా

ఈ కొత్త మోడల్‌లో సన్​రూఫ్​, కార్బన్​ సిరామిక్​ బ్రేక్​లు, సాఫ్ట్ క్లోజ్​ డోర్స్​, వెంటిలేటెడ్​ సీట్లు, మసాజ్​ ఫంక్షన్​తో ముందు సీట్లు, రియర్​ సీట్​ ఎంటర్​టైన్​మెంట్​, 260 డిగ్రీ కెమెరా వంటి అదనపు ఫీచర్లను కూడా చేర్చింది. ఇవన్నీ దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటాయి. ఇక, బీఎండబ్ల్యూ ఎమ్​ 5 కాంపిటీషన్​ ఫేస్​ లిఫ్ట్​లోని ఇంజిన్​ విషయానికి వస్తే, ఇందులో 4.4 లీటర్​, టర్బో వి 8 ఇంజిన్​ను అమర్చారు. ఈ ఇంజిన్​ 625 బిహెచ్​పి పవర్​, 750 ఎన్​ఎమ్​ టార్క్​ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్​కు 8–స్పీడ్​ ఆటోమేటిక్​ గేర్​ బాక్స్​ను జత చేశారు. తద్వారా కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published: