ప్రముఖ లగ్జరీ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బీఎండబ్ల్యూ (BMW) మరో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. M సిరీస్‌లో కొత్తగా రిలీజ్ అయిన ఈ కారు కేవలం 3.3 సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు. BMW M5 కాంపిటీషన్ 50 జహ్రే M ఎడిషన్ పేరుతో లాంచ్ అయిన ఈ కారు ధర రూ.1.18 కోట్లు (ఎక్స్-షోరూమ్) కావడం విశేషం. బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ స్పోర్ట్స్ స్పెషల్ ఎడిషన్‌ను ఓ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా కంపెనీ లాంచ్ చేసింది. ఈ ప్రీమియం వెహికల్ స్పెసిఫికేషన్ల గురించి పూర్తి వివరాలు..
BMW కంపెనీ 10 కొత్త స్పెషల్ ఎడిషన్ ప్రొడక్టులను లాంచ్ చేస్తామని ఇటీవల ప్రకటించింది. ఇందులో కొత్తగా లాంచ్ చేసిన M5 కాంపిటీషన్ 50 జహ్రే M ఎడిషన్ (BMW M5 Competition 50 Jahre M Edition) ఒకటి. దీని ధర స్టాండర్డ్ M5 కాంపిటీషన్ కంటే దాదాపు రూ.6 లక్షలు ఎక్కువ. ఈ లిమిటెడ్ ఎడిషన్ సెడాన్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 50 జహ్రే M ఎడిషన్‌లోని ఇతర కార్ల మాదిరిగానే M5 కాంపిటీషన్ కూడా బ్లూ, పర్పుల్, రెడ్ సెమిసర్కిల్స్ను ఉపయోగించుకునే ప్రత్యేక '50 జహ్రే ఆఫ్ M' బ్యాడ్జింగ్‌తో వస్తుంది.
ఎల్ఐసీ కొత్త పాలసీ.. తీసుకుంటే అదిరే బెనిఫిట్స్!
M5 కాంపిటీషన్ 50 జహ్రే M ఎడిషన్ M ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీ, 4.4L V8 ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు కేవలం 3.3 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. BMW M డివిజన్ అందించే అత్యంత శక్తివంతమైన V8 ఇంజిన్.. 625 bhp టాప్ పవర్, 750 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ ప్యాడిల్ షిఫ్టర్లతో 8-స్పీడ్ M స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంది. ఇది BMW M xDrive ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంది.
రైతులకు శుభవార్త.. మరో కొత్త స్కీమ్ తెచ్చిన మోదీ, లాభాలివే!
50 జహ్రే M ఎడిషన్ కొత్త BMW ఇండివిజువల్ లైట్స్ షాడోలైన్ అప్ ఫ్రంట్‌లో అట్రాక్టివ్‌గా ఉన్నాయి. BMW లేజర్‌లైట్, కిడ్నీ గ్రిల్‌ను కనెక్ట్ చేసే L-షేప్ లైట్ ట్యూబ్‌లకు డార్క్-టిన్టెడ్ యాక్సెంట్‌ను యాడ్ చేస్తుంది. సిగ్నేచర్ BMW కిడ్నీ గ్రిల్ పైన కనిపించే ఐకానిక్ '50 జహ్రే M' లోగో అవెంచురిన్ రెడ్ పెయింట్ షేడ్‌లో కనిపిస్తుంది. M లోగో వీల్ హబ్ క్యాప్స్ వద్ద కూడా ఉంటుంది. కారు సెలూన్ రెడ్ ఎమ్ కాంపౌండ్ బ్రేక్‌లతో 20-అంగుళాల జెట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. బ్రాండ్ BMW కిడ్నీ గ్రిల్ సరౌండ్, M-స్పెసిఫిక్ డబుల్ బార్లు, M గిల్స్పై మెష్, మిర్రర్ క్యాప్స్, బూట్ లిడ్‌పై అదనపు రియర్ స్పాయిలర్ వంటి అనేక ప్రదేశాలలో హై-గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌ను ఉపయోగించారు. వెనుక LED బార్లతో కొత్త 3D రియర్ లైట్లు వస్తాయి.
తాజా కారు 3D నావిగేషన్, 12.3 అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7.0 అడ్వాన్స్డ్ కాక్‌పిట్ కాన్సెప్ట్ BMW లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లతో వస్తుంది. BMW వర్చువల్ అసిస్టెంట్, BMW జెస్చర్ కంట్రోల్ & వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. కంపెనీ 16 స్పీకర్లతో కూడిన హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా అందించింది.
50 జహ్రే M ఎడిషన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అటెన్టివ్నెస్ అసిస్టెన్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC) సహా డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (DTC), ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ కంట్రోల్ (EDLC), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC) వంటివి ఉన్నాయి. ఇది సరౌండ్ వ్యూ కెమెరాతో పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్‌ను కూడా అందిస్తోంది. సెలూన్ రివర్సింగ్ అసిస్టెంట్ ఫీచర్ ఈ ప్రీమియం వెహికల్ మరో ప్రత్యేకత.
M5 కాంపిటీషన్ 50 జహ్రే M ఎడిషన్ క్యాబిన్లో M మల్టీఫంక్షన్ సీట్లు ఉన్నాయి. సీట్ బెల్ట్‌లు, M ఫుట్‌రెస్ట్, పెడల్స్, M లెదర్ స్టీరింగ్ వీల్ అందిస్తోంది. 50 జహ్రే M ఎడిషన్‌లో సీట్ హీటింగ్, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్, ఆటోమేటిక్ టెయిల్‌గేట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆరు డిమ్మబుల్ లైట్లతో యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4-జోన్ A/C, BMW హెడ్-అప్ డిస్ప్లే, BMW డిస్ప్లే కీ, వెల్కమ్ లైట్ కార్పెట్, సాఫ్ట్ క్లోజ్ డోర్స్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. కంఫర్ట్ యాక్సెస్ సిస్టమ్ స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా వస్తుంది, ఇందులో కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ లాకింగ్, టైల్గేట్ కాంటాక్ట్‌లెస్ ఓపెనింగ్ ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, Bmw, Bmw car, Cars