BMW EV BMW UNVEILS NEW ELECTRIC CAR BMW I4 EV SEDAN LAUNCHES NEXT MONTH GH VB
BMW Electric Vehicles: సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ.. ఆ రోజు నుంచి మార్కెట్లోకి..
ప్రతీకాత్మక చిత్రం
ప్రీమియం ఆటోమొబైల్ బ్రాండ్ బీఎమ్‌డబ్ల్యూ (BMW) కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. ఈ సంస్థ ఆల్-ఎలక్ట్రిక్ i4 సెడాన్‌ను ఇండియాలో ఏప్రిల్ 28న ఆవిష్కరించింది. ఈ కారు సేల్స్ మే 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టూవీలర్(Two Wheeler), ఆటోమొబైల్(Auto Mobile Brands) బ్రాండ్లు ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) తయారీపై ఎక్కువ పెట్టుబడులు(Investment) పెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో(Global Market) ఇప్పుడిప్పుడే ఈవీలకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో.. ఈ మర్కెట్లో సెటిల్ అయ్యేందుకు కంపెనీలో(Company) కొత్త ప్లాన్లతో ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రీమియం ఆటోమొబైల్ బ్రాండ్ బీఎమ్‌డబ్ల్యూ (BMW) కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. ఈ సంస్థ ఆల్-ఎలక్ట్రిక్ i4 సెడాన్‌ను ఇండియాలో ఏప్రిల్ 28న ఆవిష్కరించింది. ఈ కారు సేల్స్ మే 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. BMW తాజా ఎలక్ట్రిక్ వెహికల్ 590 కి.మీ. డిస్టెన్స్ పరిధిని అందించే EVగా కంపెనీ చెబుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఈ కారు eDrive40, M50 xDrive వంటి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లు లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా పనిచేస్తాయి. ఇది 83.9kWh ఎనర్జీ కెపాసిటీ, 80.7kWh నెట్ (యూజబుల్) కెపాసిటీతో వస్తుంది. బీఎండబ్ల్యూ eDrive40 వేరియంట్‌ను భారతదేశానికి తీసుకువస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెకానికల్స్ పరంగా చూస్తే.. eDrive 40 వెనుక యాక్సిల్ వద్ద ఎలక్ట్రిక్ ఛాంబర్ ఉంటుంది. ఇది గరిష్టంగా 340 బిహెచ్పి పవర్, 430ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు కేవలం 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించగలదని BMW పేర్కొంది. మరోవైపు M50 xDrive వేరియంట్ 544hp పవర్‌ను, 795Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో 100kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.
i4 eDrive 40 వేరియంట్ ఏకంగా 590km (WLTP సైకిల్) రైడింగ్ రేంజ్‌ను అందిస్తుందని బీఎండబ్ల్యూ తెలిపింది. ఇది ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న ఇతర లగ్జరీ EVల కంటే చాలా ఎక్కువ రేంజ్ కావడం గమనార్హం. అదే సమయంలో పర్ఫార్మెన్స్ బేస్డ్ M50 xDrive వేరియంట్ మాత్రం 510km (WLTP సైకిల్) రైడింగ్ రేంజ్‌తో వస్తుంది. ఛార్జింగ్ స్పెసిఫికేషన్స్ చూస్తే.. i4 ఈవీ కారు 200kW రేట్‌తో ఛార్జ్ చేయగలదు. దీంతో eDrive40 వేరియంట్ కేవలం 10 నిమిషాల రీఛార్జ్‌తో 164km రైడింగ్ పరిధిని అందించగలదు. eDrive40 మోడల్ కారు గరిష్టంగా 116kW వరకు బ్యాటరీని టాప్ అప్ చేయగల రీజనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఈ i4 ఈవీ ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.