కార్ల తయారీ కంపెనీలు ఇటీవల ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఫోకస్ పెట్టాయి. కార్లలో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ (BMW) కూడా ఇదే పంథాలో నడుస్తోంది. కొత్త ప్రయోగాలు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు న్యూ BMW 7 సిరీస్ కారు వేదికైంది. కారులో వెనుక సీటు ప్రయాణీకుల కోసం అదిరిపోయే ఫీచర్ల (Features)తో టీవీ (Television)ని తీసుకొస్తుంది. 8K స్క్రీన్ (Screen), 31 అంగుళాలతో (Inches) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కారు రూఫ్ (car Roof)కు టీవీ (TV) ప్రత్యేకమైన ఏర్పాటుతో పోల్డ్ చేయవచ్చు. అవసరమైనప్పుడు మళ్లీ పాప్ డౌన్ అవుతుంది. దీంతో ప్రయాణికులు థియేటర్ ఫీలింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
4D ఆడియో సపోర్ట్..
టీవీ (Television) ఆన్ చేసినప్పుడు బయటి నుంచి వచ్చే వెలుతురును ఆపడానికి కారు వెనుక విండోలు, గ్లాస్... రెండిటిలోనూ సన్ షేడ్ (Sun shades)లు ఆటోమెటిక్‌గా క్లోజ్ అవుతాయి. మూన్‌రూఫ్ కూడా క్లోజ్ అవుతుంది. రియర్ లైట్స్ డిమ్‌గా మారుతుంది. ప్రత్యేక సౌండ్ ఎఫెక్ట్ బోవర్స్ & విల్కిన్స్ డైమండ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ద్వారా హన్స్ జిమ్మర్ ప్లే అవుతుంది. ఇది BMW "4D ఆడియో" కు సపోర్ట్ చేస్తుంది. మల్టీమీడియా ఎక్స్ఫీరియన్స్ (Multimedia Experience) కోసం వైబ్రేషన్స్ వచ్చేలా దీన్ని సీటుకు అమర్చారు. ఈ ఫీచర్ ఒక రోజు క్రితం వరకు మోడ్రన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఒక దృశ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చింది.
లాంజ్ సీటు మాదిరి కారులో వెనుక సీటు వెనక్కి వంగి ఉంటుంది. దీంతో ఒక వైపు తిరిగి పడుకునే విధంగా ఫుట్‌రెస్ట్‌లతో బాగా విశ్రాంతి తీసుకోవచ్చు. విలాసవంతమైన సీట్లతో వచ్చే దిండుపై తలని ఉంచి రెస్ట్ తీసుకోవచ్చు. ఈ సమయంలో వ్యక్తి బయటి ప్రదేశాలను చూసే వ్యూ కోణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డోర్ హ్యాండిల్ వద్ద స్మార్ట్‌ఫోన్ పరిమాణంలో ఉన్న స్క్రీన్‌ను అమర్చారు. దీంతో ఒకవైపు తిరిగి విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా ఎంటర్ టైన్ మెంట్ లభిస్తుందన్న మాట.
టీవీ స్క్రీన్ విషయానికి వస్తే... కారులోని ఆన్‌బోర్డ్‌పై అమెజాన్ ఫైర్ టీవీని అమర్చింది బీఎండబ్ల్యూ. కారు సొంత 5G ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ సేవలు ప్రసారం అవుతాయి. అవసరమని అనిపిస్తే స్క్రీన్‌ను టచ్ ఇన్‌పుట్‌ల ద్వారా కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ ఫీచర్ ఫర్ఫెక్ట్ గా లేదు. స్క్రీన్‌ను కారు సీలింగ్‌లోకి మడవాల్సిన అవసరం ఉన్నందున దీన్ని అప్పుడప్పుడు ఉపయోగించాల్సి ఉంటుంది.
కారు ముందు భాగంలో 56-అంగుళాల పెద్ద స్క్రీన్‌లతో ..
కాగా, ఇప్పటికే Mercedes-Benz EQS ఎలక్ట్రిక్ సెడాన్ వంటి వాటిలో 56-అంగుళాల పెద్ద స్క్రీన్‌లతో కారు ముందు భాగంలో బహుళ ఆవిష్కరణలకు దారితీసింది. దీంతో ఫీచర్ల విషయంలో ఆటోమెుబైల్ కంపెనీల మధ్య పోటీ పెరిగింది. తాజాగా స్టీరింగ్ వీల్స్, ట్రాన్స్‌మిషన్ టన్నెల్స్ పై పరిమితులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేని వెనుక సీటు విషయంలోనూ పోటీ పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇది స్నోబాల్ ఎఫెక్ట్, ఇది ఆవిష్కరణ నుండి ప్రారంభమవుతుంది మరియు ఆటోమేకర్‌ల కోసం టాప్ ట్రంప్‌ల గేమ్‌గా మరియు వారి తాజా ఆఫర్‌ల స్పెక్ షీట్‌గా మారుతుంది. ఈ ఫీచర్‌లు మరింత సరసమైన మాస్-మార్కెట్ ఎంపికలకు తగ్గుముఖం పట్టడంతో, అతిపెద్ద లబ్ధిదారుడు తుది వినియోగదారుగా ఉంటాడు. మరియు ఆటో మేకర్స్ మధ్య ఆవిష్కరణలు టాప్ ట్రంప్ గేమ్ మాదిరి స్నోబాల్ ఎఫెక్ట్‌కు దారితీస్తున్నాయి . అందుకు తగ్గటే తాజా ఆఫర్లు స్పెక్ షీట్‌గా మారుతున్నాయి.
The new i7 has a luxury drive at its heart. Where will the entertainment take you? Unmissable on-screen action with the BMW Theatre Screen or gazing up at the stars through the Sky Lounge panoramic glass roof? #THEi7 pic.twitter.com/RnNRtmdRAu
— BMW (@BMW) April 21, 2022
ఈ ఫీచర్‌లు మరింత సరసమైన మాస్-మార్కెట్ ఎంపికలకు తగ్గుముఖం పట్టడంతో అతిపెద్ద లబ్ధిదారుడు తుది వినియోగదారుడు ఉండనున్నాడు. ఆటోమేకర్‌ల మధ్య ప్రస్తుత డైలీ రేసులో వీలైనంత త్వరగా ఫీచర్లను ఎక్కువ కారు ఆప్షన్‌లకు తీసుకురావడంలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. దీంతో మాస్ మార్కెట్ సెగ్మెంట్‌కు చేరువ అయ్యేందుకు వేగం పెంచాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bmw car, LED TV, New features, Smart TV, Televison News