BMW C400 GT scooter: రేపే బీఎమ్‌డబ్ల్యూ C400 GT స్కూటర్​ లాంఛింగ్​... భారత్​లో అత్యంత ఖరీదైన, పవర్​ఫుల్ స్కూటర్​గా రికార్డు

BMW C400 GT scooter: రేపే బీఎమ్‌డబ్ల్యూ C400 GT స్కూటర్​ లాంఛింగ్​... భారత్​లో అత్యంత ఖరీదైన, పవర్​ఫుల్ స్కూటర్​గా రికార్డు

BMW C400 GT scooter | భారతదేశంలో అత్యంత ఖరీదైన, పవర్‌ఫుల్ స్కూటర్ బీఎండబ్ల్యూ సీ400 జీటీ (BMW C400 GT) మంగళవారం ఇండియాలో లాంఛ్ కానుంది. బీఎండబ్ల్యూ ఆవిష్కరించబోయే ఈ స్కూటర్ విశేషాలు తెలుసుకోండి.

  • Share this:
భారత టూవీలర్​ మార్కెట్​ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ట్రెడిషనల్​ స్కూటర్లు, బైక్​లకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన భారత వినియోగదారులు.. ఇప్పుడు ఖరీదైన స్పోర్ట్స్​ బైక్​లు, స్కూటర్లను సైతం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఆటోమొబైల్​ సంస్థలు అధునాతన స్కూటర్లను మార్కెట్​లోకి ప్రవేశపెడుతున్నాయి. తాజాగా జర్మన్​ లగ్జరీ టూవీటర్​ బ్రాండ్​ బీఎండబ్ల్యూ మరో కొత్త ప్రొడక్ట్‌ను ప్రవేశపెట్టింది. ప్రీమియం మాక్సీ స్కూటర్​ C400 GT రిలీజ్​ డేట్​ను అనౌన్స్​ చేసింది. దీన్ని అక్టోబర్ 12న భారత మార్కెట్​లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇది భారతీయ మార్కెట్లో అత్యంత ప్రీమియం స్కూటర్‌గా రికార్డు సాధించనుంది.

Aadhaar Card Fraud: ఆధార్‌ కార్డు విషయంలో వెంటనే ఈ పనిచేయకపోతే మోసపోతారు జాగ్రత్త

ఈ మ్యాక్సీ స్కూటర్ సుమారు రూ.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటికే లక్ష రూపాయల టోకెన్ అడ్వాన్స్​తో ప్రీ-బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఇందులో సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125, అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160, యమహా ఏరో 155 స్కూటర్లకు భిన్నమైన అప్​డేటెడ్​ ఫీచర్లను అందించారు.

Mutual Fund: ప్రతీ నెలా కొంత పొదుపు చేస్తే రూ.51 లక్షల రిటర్న్స్

భారత్​లో అత్యంత ఖరీదైన స్కూటర్​


ఈ స్కూటర్‌లో అనేక అడ్వాన్స్‌డ్​ ఫీచర్లను సంస్థ అందించింది. ఇది హైవేపై నడపడానికి చాలా అనువుగా ఉంటుంది. బిఎమ్​డబ్ల్యూ సి400 జిటి పూర్తి స్థాయి మజిక్యులర్​ బాడీ ప్యానెల్స్​తో వస్తుంది. ట్రెడిషనల్​ స్కూటర్​ మాదిరిగానే ఇందులో సైడ్ ఇంజిన్​ను చేర్చింది. పొడవైన విండ్ స్క్రీన్​, పుల్​ బ్యాక్​ హ్యాండిల్​ బార్​, పెద్ద స్టెప్​ సీట్​, డ్యుయల్​ ఫుట్​రెస్ట్​ వంటివి అందించింది.

ఈ స్కూటర్​ రైడింగ్​ పొజిషన్​ చాలా సౌకర్యవంతంగా, దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులోని కొన్ని ముఖ్య ఎలక్ట్రానిక్స్, రైడ్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది పూర్తి ఎల్​ఈడీ లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ సీట్, ఏబీఎస్​, యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్, బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటర్​లో 350 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్​ను బీఎండబ్ల్యూ అందించింది. ఈ ఇంజిన్ 33.5 బిహెచ్‌పి, 35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైడ్-బై-వైర్ థొరెటల్, ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్​తో వస్తుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్​లో బీఎమ్​డబ్ల్యూ C400GT కి ప్రత్యక్ష పోటీలేదు.
Published by:Santhosh Kumar S
First published: