BMW i4 Sedan: బీఎండబ్ల్యూ తొలి ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4 ఆవిష్కరణ.. 4 సెకండ్లలోనే 100 కి.మీ వేగం.. ఇతర ప్రత్యేకతలివే..

BMW i4. (Image source: BMW)

తన మొట్టమొదటి విద్యుత్ కారు.. బీఎండబ్ల్యూ ఐ4 మోడల్ ను త్వరలో తీసుకురానుంది. తాజాగా ఈ సెడాన్ ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్ ఫుల్లీ ఎలక్ట్రిక్ 4 డోర్ గ్రాన్ కూపేగా అందుబాటులోకి రానుంది.

  • Share this:
ఇటీవల కాలంలో విద్యుత్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఆటో సంస్థలు ఎలక్ట్రిక్ కార్ల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ద్విచక్రవాహనాలను, కార్లను విద్యుత్ ఆధారిత వెహికల్స్ గా మారుస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో జర్మన్ లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్లూ కూడా చేరింది. పూర్తి స్థాయిలో తన మొట్టమొదటి విద్యుత్ కారు.. బీఎండబ్ల్యూ ఐ4 మోడల్ ను త్వరలో తీసుకురానుంది. తాజాగా ఈ సెడాన్ ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్ ఫుల్లీ ఎలక్ట్రిక్ 4 డోర్ గ్రాన్ కూపేగా అందుబాటులోకి రానుంది. ఈ ఏడాదే మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు ఈ జర్మన్ కార్ల తయారీ సంస్థ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. స్పోర్టీనెస్, కంఫర్ట్, సస్టేయినబుల్ లాంటి అంశాల్లో మెరుగైన ప్రదర్శన చేసే విధంగా ఈ విద్యుత్ సెడాన్ ను రూపొందించినట్లు బీఎండబ్ల్యూ సంస్థ పేర్కొంది.

ఈ సరికొత్త బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్ విభిన్న వర్షన్లలో విడుదల కానుంది. దీని రేంజ్ 590 కిలోమీటర్ల(WLTP) వరకు ఉంటుందని అంచనా, అయితే ఈపీఏ వర్షన్ అయితే 300 మైళ్ల(482 కిలోమీటర్ల) వరకు ఉంటుందని తెలుస్తోంది. దీని పవర్ ఔట్ పుట్ 390 కిలోవాట్లు లేదా 530 హార్స్ పవర్ ను కలిగి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. అంతేకాకుండా 4 సెకండ్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది.

ఈ కారుతో పాటు బీఎండబ్ల్యూ సంస్థ 8వ వర్షన్ గురించి కూడా ప్రకటించింది. ఐడ్రైవ్ ఆపరేటింగ్ సిస్టంతో సరికొత్త డ్యాష్ బోర్డు లేఅవుట్, విజువల్ డిజైన్ తో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. క్లాస్ డ్రైవింగ్ డైనిమిక్స్, జీరో లోకల్ ఎమిషన్స్ విడుదల చేసే ఈ వాహనం లుక్ పరంగా అదరగొడుతుందని ఈ సంస్థకు బోర్డు మేనేజ్మెంట్ సభ్యులు పీటర్ నోటా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు లగ్జరీ కార్లతో వాహన ప్రియులను మనసు దోచుకున్న బీఎండబ్ల్యూ ఇకపై విద్యుత్ వాహనాలతోనూ ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు, సాంకేతికత, ఇంజిన్ సామర్థ్యం, ధర లాంటి విషయాలను బహిర్గత పరచలేదు. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది. అయితే తాజాగా ఆవిష్కరించిన ఈ కారు మాత్రం స్టైల్ పరంగా వేరే స్థాయిలో ఉంది.
Published by:Nikhil Kumar S
First published: