Gold rate: పెరిగిన ధరలతో ఒకే సారి బంగారం కొనుగోలు చేయలేకపోతున్నారా..అయితే EMI పథకం మీ కోసం..

నెలవారీ చెల్లింపులతో ఆభరణాలు (monthly gold schemes) కొనాలనే వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాంటి పరిమితులు లేకుండా, వచ్చే సంవత్సరం దీపావళి నాటికి బంగారం, ఇతర ఆభరణాలు కొనడానికి ఈ పథకాలు వీలు కల్పిస్తున్నాయి.

news18-telugu
Updated: November 25, 2020, 3:57 PM IST
Gold rate: పెరిగిన ధరలతో ఒకే సారి బంగారం కొనుగోలు చేయలేకపోతున్నారా..అయితే EMI పథకం మీ కోసం..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Monthly gold schemes: వచ్చే సంవత్సరం పండుగ సీజన్‌ కోసం జ్యువెలర్స్ సంస్థలు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. నెలవారీ చెల్లింపులతో ఆభరణాలు (monthly gold schemes) కొనాలనే వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాంటి పరిమితులు లేకుండా, వచ్చే సంవత్సరం దీపావళి నాటికి బంగారం, ఇతర ఆభరణాలు కొనడానికి ఈ పథకాలు వీలు కల్పిస్తున్నాయి. ఈ పథకంలో చేరితే తగ్గింపులు ఇస్తామని కొన్ని కంపెనీలు ప్రకటించాయి. బ్లూస్టోన్ అనే జ్యువెలరీ బ్రాండ్ సంస్థ సరికొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. మంథ్లీ గోల్డ్ స్కీమ్‌లో చేరిన వారికి మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌లో 50శాతం డిస్కౌంట్‌ ఆఫర్ ఇస్తామని ప్రకటించింది. ఇలాంటి తగ్గింపులను ఆయా సంస్థలు పరిమిత కాలానికి అందిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.48,700 వరకు ఉంది.

ప్రత్యేకత ఏంటి?

మంథ్లీ గోల్డ్ స్కీమ్‌లో చేరే పెట్టుబడిదారులు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇలా డిపాజిట్ చేసిన మొత్తం డబ్బుతో 12 నెలల తరువాత నగలు కొనవచ్చు. ఒక సంవత్సరం వరకు చేసిన పెట్టుబడిని నగల రూపంలో తిరిగి పొందవచ్చు. కొన్ని కంపెనీలు ఈ పథకాన్ని 11 నెలల కాలానికి కూడా అందిస్తాయి. ఇలాంటి సందర్భంలో నెలవారీ చెల్లింపులు 10 నెలల వరకు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి భారీ మొత్తంలో డబ్బు చెల్లించి నగలు కొనడానికి బదులుగా ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించి ఆర్థిక భారం పడకుండా నగలు సొంతం చేసుకోవచ్చు.

నియమాలు తెలుసుకోవాలి
ఈ గోల్డ్ స్కీమ్‌ల వల్ల మరో ఉపయోగం ఉంది. సంవత్సరం కాలానికి స్కీమ్‌ను ఎంచుకుంటే 11 నెలలకు డబ్బు చెల్లిస్తే చాలు. వినియోగదారుల తరఫున చివరి ఒక నెల వాయిదాలను ఆయా సంస్థలే చెల్లిస్తాయి. దాదాపు అన్ని జ్యువెలర్ కంపెనీలు ఈ స్కీమ్‌ను కొద్దిపాటి మార్పులతో అందిస్తున్నాయి. వీటిని ఎంచుకునే ముందు వినియోగదారులు నియమ నిబంధనలు పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రముఖ సంస్థలనే ఎంచుకోవాలి
తనిష్క్, జోస్ అలుక్కాస్, మలబార్ గోల్డ్ వంటి ప్రముఖ సంస్థలు మంథ్లీ గోల్డ్ స్కీమ్‌లను అందిస్తున్నాయి. వీటిని ఎంచుకోవాలనుకునే వారు తమ అవసరాలను బట్టి ఆయా సంస్థల్లో ఆరా తీయాలి. పెద్ద కంపెనీలు అందించే గోల్డ్ స్కీమ్‌లు పారదర్శకంగా ఉండే అవకాశం ఉంది. వినియోగదారులు చేసే చెల్లింపుల వివరాలు, అన్ని రశీదులు, కంపెనీలు ఇచ్చే ఇతర ధ్రువీకరణ పత్రాలను గడువు ముగిసే వరకు భద్రపరచుకోవాలి. మోసపూరిత ప్రకటనలు, నమ్మశక్యం కాని ఆఫర్లను ఇస్తామని చెప్పే కొత్త జ్యువెలర్స్‌కు వెళ్లకపోవడమే మంచిది.
Published by: Krishna Adithya
First published: November 25, 2020, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading