హోమ్ /వార్తలు /బిజినెస్ /

Elon Musk: ఒక్కొక్కరు నెలకు రూ.660 కట్టాల్సిందే.. అన్నంతపని చేసిన ఎలాన్ మస్క్!

Elon Musk: ఒక్కొక్కరు నెలకు రూ.660 కట్టాల్సిందే.. అన్నంతపని చేసిన ఎలాన్ మస్క్!

 Elon Musk: ఒక్కొక్కరు నెలకు రూ.660 కట్టాల్సిందే.. అన్నంతపని చేసిన ఎలాన్ మస్క్!

Elon Musk: ఒక్కొక్కరు నెలకు రూ.660 కట్టాల్సిందే.. అన్నంతపని చేసిన ఎలాన్ మస్క్!

Twitter Blue tick | మీరు ట్విట్టర్ వాడుతున్నారా? బ్లూ టిక్ ఉందా? లేదంటే కొత్తగా బ్లూటిక్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Blue Tick Charges | ఎలాన్ మస్క్ అనుకున్నంత పని చేశారు. ట్విట్టర్ (Twitter) అకౌంట్ వెరిఫికేష్ ప్రక్రియను మారుస్తామంటూ వెల్లడించిన ఆయన తాజాగా బ్లూటి (Blue tick)క్ చార్జీలను సవరించారు. తొలిగా 20 డాలర్లు అని ప్రతిపాదించినా కూడా ఎలాన్ మస్క్ తర్వాత ఈ రేటును 8 డాలర్లకు తగ్గించారు. బ్లూటిక్ కలిగి ఉండాలంటే ట్విట్టర్ యూజర్లు నెలకు దాదాపు రూ.664 చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

20 డాలర్లు చాలా ఎక్కువ అని చాలా మంది నెటిజన్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో ఎలాన్ మాస్క్ ట్విట్టర్ బ్లూటిక్ చార్జీలను 8 డాలర్లుగా నిర్ణయించారు. దీంతో ట్విట్టర్ బ్లూటిక్ కోరుకునే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. మన దేశంలో ట్విట్టర్ వాడే వారు కోట్లలో ఉన్నారు. ట్విట్టర్ యాక్టివ్ యూజర్లు మన దేశంలో 24 మిలియన్లకు పైగానే ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి 8 డాలర్లు వేసుకున్నా కూడా 24 మిలియన్ల మంది నుంచి ట్విట్టర్‌కు నెలకు రూ. 1660 కోట్లు లభించనున్నాయి.

ఒక్కసారి చార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త కారు!

అలాగే అమెరకాలో 77 మిలియన్లు, జపాన్‌లో 58 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అంటే నెలకు ట్విట్టర్ ఆదాయం ఏ స్థాయిలో పెరగబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఎలాన్ మస్క్ ఒక్క నిర్ణయంతో కంపెనీ రాతను మార్చబోతున్నారు. కాగా ఎలాన్ మాస్క్ 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ బుక్ చేసుకోండిలా

అంతేకాకుండా ఎలాన్ మస్క్ యూజర్లకు పలు అదనపు ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. బ్లూటిక్ కలిగిన వారికి ప్రియారిటీ రిప్లేస్, మెన్షన్స్ అండ్ సెర్చ్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి. వీటి ద్వారా స్పామ్ లేదా స్కామ్‌ను ఓడించొచ్చని మాస్క్ పేర్కొంటున్నారు. ఇంకా లాంగ్ వీడియో లేదా ఆడియోను పోస్ట్ చేయొచ్చు. సగం వరకు యాడ్స్ ఉండొచ్చు. అంతేకాకుండా ఈయన పేవాల్ బైపాస్‌ను పబ్లిషర్స్‌కు కూడా అందుబాటులోకి తెచ్చారు. ట్విట్టర్‌తో కలిసి పని చేసే వారికి ఈ ఫెసిలిటీ ఉంటుందని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోల్‌కు రెస్పాన్స్ ఇచ్చారు. స్టీఫెన్ కింగ్ ట్వీట్‌కు రిప్లే ఇచ్చారు. ‘బ్లూటిక్ కోసం నెలకు 20 డాలర్లు చెల్లించాలా? వాళ్లే నాకు చెల్లించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనికి మస్క్ రిప్లే ఇచ్చారు. ‘మే ఇతరులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ట్విట్టర్ మొత్తంగా అడ్వర్లైజర్ల మీదనే ఆధారపడలేదు. అందుకే 8 డాలర్లు’ అంటూ ట్వీట్ చేశారు.

First published:

Tags: Elon Musk, Twitter

ఉత్తమ కథలు