Bank News | ప్రముఖ స్మాల్ సేవింగ్ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్ అకౌంట్ (Bank Account) సర్వీసులు అందిస్తోంది. మహిళలు ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన మహిళలు (Women) అందరూ ఈ ఖాతాను తెరవొచ్చు. ఈ అకౌంట్ తెరవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చొ ఒకసారి తెలుసుకుందాం.
మహిళలు బ్యాంక్‌లో ఈ ఖాతా తెరవడం ద్వారా 7 శాతం వరకు వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కస్టమర్లకు బ్యాంక్ స్పెషల్‌గా డిజైన్ చేసిన రూపే ప్లాటినం డెబిట్ కార్డు అందిస్తోంది. ఈ డెబిట్ కార్డ్ ద్వారా రోజుకు రూ. 40 వేల వరకు బ్యాంక్ అకౌంట్ నుంచి ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఇతర బ్యాంకుల ఏటీఎం ద్వారా 20 ట్రాన్సాక్షన్లను చార్జీలు లేకుండా నిర్వహించొచ్చు. పీఓఎస్ మెషీన్ ద్వారా అపరిమిత లావాదేవీలు చేయొచ్చు.
రూ.400 పొదుపుతో రూ.10 లక్షల కారు కొనేయండిలా!
అంతేకాకుండా కస్టమర్లకు ఈ డెబిట్ కార్డు కలిగి ఉండటం ద్వారా ఉచితంగా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. అలాగే డెబిట్ కార్డుపై పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయి. అలాగే ఉచిత నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు కూడా ఉన్నాయి. ప్రతి నెలా మంత్లీ ఇమెయిల్ స్టేట్‌మెంట్ ఉచితంగా లభిస్తుంది. ఆరు నెలలకు ఒకసారి ఫిజికల్ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఉచితంగా పొందొచ్చు. టూవీలర్ లోన్స్‌పై ఆకర్షణీయ వడ్డీ రేటు ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్ ఒకరికి ఉచిత అకౌంట్ ఓపెన్ చేసే బెనిఫిట్ ఉంది. దీనికి మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు.
బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట.. దిగొచ్చిన ధరలు, షాకిచ్చిన వెండి!
ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లు ఉంటే చాలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుందని గుర్తించుకోవాలి. అలాగే ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావించే వారు మరో విషయాన్న గుర్తించుకోవాలి. మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. నెలకు మినిమమ్ బ్యాలెన్స్ రూ. 10 వేలు ఉండాల్సిందే. ఒకవేళ ఈ మినిమమ్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే మాత్రం చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు బ్యాంక్ ఖాతా తెరిచే ముందు ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. తర్వాతనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకా ఇతర బ్యాంకులు కూడా మహిళలకు ప్రత్యేకమైన సేవింగ్స్ అకౌంట్ సర్వీసులు అందిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Banks, Saving account, Small finance banks, Women