BLAUPUNKT THOMSON INFINIX SMART ANDROID TV DISCOUNT SALE OFFERS IN FLIPKART BIG BILLION DAYS AK GH
Discounts on Smart TVs: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఈ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్
ప్రతీకాత్మక చిత్రం
ఎనిమిది రోజుల పాటు సాగే ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బ్లాపంక్ట్, ఇన్ఫినిక్స్, థామ్సన్‌తో సహా అనేక ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌టీవీలు భారీ డిస్కౌంట్‌తో రానున్నాయి.
దేశంలో పండుగ సీజన్ సమీపిస్తుండటంతో ఈ–కామర్స్ దిగ్గజాలు ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో అక్టోబర్ 3 నుంచి 10 వరకు సేల్ నిర్వహించనుంది. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బ్లాపంక్ట్, ఇన్ఫినిక్స్, థామ్సన్‌తో సహా అనేక ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌టీవీలు భారీ డిస్కౌంట్‌తో రానున్నాయి. దీంతో పాటు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఇలా అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.
బ్లాపంక్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బ్లాపంక్ట్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. బ్లాపంక్ట్ 32 అంగుళాల సైబర్ సౌండ్ స్మార్ట్‌టీవీ అసలు ధర రూ. 14,999 వద్ద ఉండగా.. దీన్ని రూ. 13,999కు అందుబాటులోకి తెస్తుంది. ఇతర బ్లాపంక్ట్ సైబర్‌సౌండ్ టీవీ మోడళ్లపై కూడా రూ. 3,500 డిస్కౌంట్ ప్రకటించింది. బ్లాపంక్ట్ నుంచి తొలిసారి అమ్మకానికి రానున్న 65 అంగుళాల మోడల్ రూ. 55,999 ధర వద్ద లభిస్తుంది. ఇది అక్టోబర్ 3న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అందుబాటులో ఉంటుంది.
ఇన్ఫినిక్స్ ఎక్స్1 సిరీస్ స్మార్ట్ టీవీ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ మోడల్స్‌పై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇన్ఫినిక్స్ 32 ఎక్స్ 1 స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 15,999 వద్ద ఉండగా.. దీనిపై రూ. 3 వేల డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా దీన్ని కేవలం రూ. 11,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇదే లైనప్‌లోని 40X1, 43X1 స్మార్ట్ టీవీ మోడళ్లపై రూ. 4,000 డిస్కౌంట్ అందిస్తోంది.
థామ్సన్ స్మార్ట్ టీవీ ఆఫర్లు
థామ్సన్ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్, ఓత్ ప్రో అనే రెండు సిరీస్‌లలో లభిస్తాయి. థామ్సన్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 14,999 ఉండగా.. దీన్ని రూ. 12,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, థామ్సన్ 24 అంగుళాల స్మార్ట్‌టీవీ అసలు ధర రూ. 9,999 వద్ద ఉండగా... ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 7,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.