• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • BLACK MONEY STASHED OUTSIDE INDIA IS WORTH AROUND RS 9 41 LAKH CRORE SAYS REPORT SS

Black money: ఇండియా దాటిన బ్లాక్ మనీ రూ.9.41 లక్షల కోట్లు

Black money: ఇండియా దాటిన బ్లాక్ మనీ రూ.9.41 లక్షల కోట్లు

Black money: ఇండియా దాటిన బ్లాక్ మనీ రూ.9.41 లక్షల కోట్లు

1980 నుంచి 2010 మధ్య దేశం దాటిన నల్ల ధనం 384 బిలియన్ డాలర్ల నుంచి 490 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా.

  • Share this:
    అక్షరాలా 9 లక్షల 41 వేల కోట్లు... అవును రూ.9.41 లక్షల కోట్ల నల్లధనం భారతదేశం దాటిపోయింది. ఓ అధ్యయనంలో బయటపడ్డ నిజమిది. మొత్తం అక్రమ సంపాదనలో దేశం దాటిన బ్లాక్ మనీ 10వ వంతు మాత్రమే. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (NIFM) యూపీఏ హయాంలో దేశం దాటిన, దేశంలోకి వచ్చిన నల్లధనంపై అధ్యయనం జరిపిందని ది ప్రింట్ ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది. 2014 ఆగస్ట్ నాటి 'ప్రస్తుత విలువ'ను బట్టి ఈ లెక్కలు తేల్చింది. నివేదికను ఎన్‌డీఏ ప్రభుత్వానికి సమర్పించింది.

    నల్లధనంపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్(NCAER) కూడా మరో అధ్యయనాన్ని జరిపింది. 1980 నుంచి 2010 మధ్య దేశం దాటిన నల్ల ధనం 384 బిలియన్ డాలర్ల నుంచి 490 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా వేసింది. ఆ నివేదికను 2014 జులైలో ప్రభుత్వానికి సమర్పించింది. ఇది మొత్తం నల్లధనంలో 2.8 శాతం అని NCAER లెక్క తేల్చింది.

    ఇక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) కూడా నల్లధనంపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. 1997 నుంచి 2009 మధ్య జీడీపీలోని 0.2 శాతం నుంచి 7.4 శాతం మధ్య సంపద దేశం దాటిందని లెక్కించింది NIPFP. 2013 డిసెంబర్‌లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మూడు సంస్థలు జరిపిన అధ్యయన ఫలితాలు వేర్వేరుగా ఉన్నా... లక్షల కోట్లు దేశం దాటాయని అర్థమవుతోంది.

    Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


    ఇవి కూడా చదవండి:

    EPFO: ఎన్నికల ముందు మరో వరం... ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు

    Samsung Galaxy M10, M20: జియో యూజర్ల కోసం ఫిబ్రవరి 22న ఎక్స్‌క్లూజీవ్ సేల్

    Personal Finance: మీ బ్యాంక్ అకౌంట్ వాడట్లేదా? ఇలా క్లోజ్ చేసెయ్యండి

     
    First published: