BLACK FRIDAY SALE IS A GROWING RAGE IN INDIA BUT DO YOU KNOW WHAT IT MEANS
బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే ఏంటీ? ఇండియాలో ఎందుకు?
REUTERS/Shannon Stapleton
అమెరికాకు చెందిన బ్లాక్ ఫ్రైడే సేల్ కల్చర్ ఇప్పుడు ఇండియాకు పాకింది. ఎగువ, మధ్య తరగతి ప్రజల్లో కొనుగోళ్లు శక్తి పెరగడంతో వారిని టార్గెట్ చేస్తున్నాయి కంపెనీలు. అమెరికన్ రీటైల్ కంపెనీలు భారతదేశంలో విస్తృతంగా వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో... అక్కడి షాపింగ్ కల్చర్‌ను ఇక్కడ అలవాటు చేస్తున్నారు.
బ్లాక్ ఫ్రైడే సేల్... కొన్ని రోజులుగా ఇండియాలో బాగా వినిపిస్తున్న మాట ఇది. ఇ-కామర్స్ సైట్లతో పాటు పలు సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. నవంబర్ 23న ఈ సేల్ నిర్వహించాయి. అసలేంటి ఈ బ్లాక్ ఫ్రైడే సేల్? ఇదేమైనా మార్కెట్ గిమ్మిక్కా? కస్టమర్లను వలలో వేసుకునే టెక్నిక్కా? అందరి అనుమానాలు ఇవే. వాస్తవానికి ఇది అమెరికాలో ఉండే కల్చర్. ప్రతీ ఏడాది ఇలా బ్లాక్ ఫ్రైడే సేల్ అమెరికాలో మామూలే. ఇది అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్. అమెరికన్లు డాలర్లకు డాలర్లు ఖర్చుచేసే రోజు ఇది. బ్లాక్ ఫ్రైడే సేల్ అంటారు కానీ... గురువారం నుంచే కస్టమర్ల కోసం షాపులు తెరిచి ఉంచుతారక్కడ. కారణం... భారీగా లాభాలను పొందడమే.
అసలు బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటీ? యూఎస్ క్యాలెండర్లో షాపింగ్ డేగా ఎలా మారింది?
అమెరికాలో ప్రతీ సంవత్సరం నవంబర్‌లో నాలుగో గురువారం థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటారు అమెరికన్లు. ఆ రోజు వారికి జాతీయ సెలవు దినం. క్రిస్మస్ రాకను సూచిస్తూ శాంటా క్లాజ్ పరేడ్స్ జరుగుతుంటాయి. పెద్దపెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను అడ్వర్టైజ్ చేసుకునేందుకు ఈ పరేడ్లను స్పాన్సర్ చేస్తుంటాయి. అలా థ్యాంక్స్ గివింగ్ డేకు వ్యాపార రంగు పులుముకుంది. ఇక థ్యాంక్స్ గివింగ్ డే మరుసటి రోజు రోడ్లన్నీ రద్దీగా కనిపించేవి. 1975లో తొలిసారిగా న్యూ యార్క్ టైమ్స్ బ్లాక్ ఫ్రైడే అన్న మాటను ఉపయోగించింది. అప్పట్నుంచీథ్యాంక్స్ గివింగ్ డే మరుసటి రోజు వచ్చే శుక్రవారం బ్లాక్ ఫ్రైడేగా మారిపోయింది. ఈ రోజును క్యాష్ చేసుకునేందుకు షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు రీటైలర్లు. వాల్‌మార్ట్ లాంటి సంస్థలైతే 'బ్లాక్ థర్స్డే' పేరుతో గురువారం నుంచే సేల్స్ నిర్వహిస్తున్నాయి.
బ్లాక్ ఫ్రైడే ఇండియాలో ఎలా మొదలైంది?
అమెరికాకు చెందిన బ్లాక్ ఫ్రైడే సేల్ కల్చర్ ఇప్పుడు ఇండియాకు పాకింది. ఎగువ, మధ్య తరగతి ప్రజల్లో కొనుగోళ్లు శక్తి పెరగడంతో వారిని టార్గెట్ చేస్తున్నాయి కంపెనీలు. అమెరికన్ రీటైల్ కంపెనీలు భారతదేశంలో విస్తృతంగా వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో... అక్కడి షాపింగ్ కల్చర్‌ను ఇక్కడ అలవాటు చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఇ-కామర్స్ కంపెనీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్ కంపనీలు 'బ్లాక్ ఫ్రైడే సేల్' పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించాయి.