HOME »NEWS »BUSINESS »bitcoin vs gold which is better investment mk gh

Gold or Bitcoin: బంగారం లేదా బిట్‌కాయిన్.. దేనిలో పెట్టుబడి అధిక రాబడినిస్తుంది...

Gold or Bitcoin: బంగారం లేదా బిట్‌కాయిన్.. దేనిలో పెట్టుబడి అధిక రాబడినిస్తుంది...
ప్రతీకాత్మకచిత్రం

2019లో బిట్ కాయిన్ (bitcoin) ధర 7,000 డాలర్లుగా ఉంది. కాగా, 2020 సెప్టెంబర్ నెలలో బిట్ కాయిన్ ధర 1,000 డాలర్లను తాకింది. అక్టోబర్లో దీని ధర 13,000 డాలర్లు చేరుకోగా, నవంబర్లో 17,000 డాలర్లు, డిసెంబర్లో 25,000 డాలర్లను చేరుకుంది.

  • Share this:
కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం(inflation) కరెన్సీ ముద్రణపై పెద్ద ప్రభావాన్ని చూపింది. దీంతో కరెన్సీ విలువ పడిపోయే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య మార్కెట్లో బంగారం (gold), బిట్ కాయిన్(bitcoin)లలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా, బిట్కాయిన్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీని విలువ అంతకంతకూ పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం దీని విలువ 25,000 డాలర్లకు చేరుకుంది. గత వారం రోజుల్లోనే దీని ధర 3.15 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం, బిట్ కాయిన్(bitcoin) మార్కెట్ క్యాపిటల్ 350 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనితో సమానంగా బంగారంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాగా, బంగారం(gold) ప్రస్తుత మార్కెట్ క్యాపిటల్ 10 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, బంగారంతో పోలిస్తే బిట్కాయిన్ రిటర్న్స్(Returns) బాగా ఇస్తుండటంతో బిట్ కాయిన్ కొనేందుకు ప్రజలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రిప్టోకరెన్సీ కేవలం ఏడాది కాలంలోనే 40.46 శాతం మేర రిటర్న్స్ అందించింది. 2019 డిసెంబర్ నుంచి 1.8 కోట్ల కొత్త వ్యాలెట్లు క్రియేట్ చేసుకుంటూ మార్కెట్లో దూసుకెళ్లింది.

బిట్ కాయిన్ గత చరిత్ర



2019లో బిట్ కాయిన్ (bitcoin) ధర 7,000 డాలర్లుగా ఉంది. కాగా, 2020 సెప్టెంబర్ నెలలో బిట్కాయిన్ ధర 1,000 డాలర్లను తాకింది. అక్టోబర్లో దీని ధర 13,000 డాలర్లు చేరుకోగా, నవంబర్లో 17,000 డాలర్లు, డిసెంబర్లో 25,000 డాలర్లను చేరుకుంది. అంతకంతకూ పెరుగుతున్న బిట్ కాయిన్ ర్యాలీ ఎక్కడ ఆగుతుందో అంచనా వేయడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం బిట్ కాయిన్ ర్యాలీ కొనసాగుతోంది. రోజు రోజుకు దీని ధర రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఇండియాలో ప్రస్తుతం ఒక బిట్ కాయిన్(bitcoin) కొనాలంటే దాదాపు 18 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. దాదాపు 12 ఏళ్ల క్రితం మొదలైన ఈ క్రిప్టోకరెన్సీ బంగారానికి సవాలు విసురుతోంది.

బంగారం లేదా బిట్‌కాయిన్?

కరోనా కాలంలో బంగారంతో పాటు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడుల వెల్లువ మొదలైంది. ఇది 2020 సంవత్సరంలో 200 శాతం రాబడిని ఇచ్చింది. మార్కెట్లో స్థిరత్వం లేని కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ(Crypto currency) వ్యాపారం మళ్లీ పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం బారత దేశంలో సుమారు 50–60 లక్షల బిట్ కాయిన్ వినియోగదారులు ఉన్నారు. అయితే, కరోనా పరిస్థితుల్లో బంగారం(gold) తో పాటు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మరోవైపు సురక్షిత పెట్టుబడి మార్గంగా భావించే బంగారంలో పెట్టుబడులు పెరుగుతుండటంతో దీని ధర కూడా అమాంతం పెరుగుతోంది.
Published by:Krishna Adithya
First published:December 29, 2020, 17:41 IST