BITCOIN VS DOLLAR RATE CRYPTOCURRENCY BITCOINS JOURNEY FROM 2000 TO 20000 BITCOIN HITS 20000 FOR FIRST TIME MK GH
Bitcoin: 5 ఏళ్ల క్రితం జస్ట్ 20 వేలు పెట్టి ఉంటే..17 లక్షలు మీ సొంతం..బిట్‌కాయిన్ రికార్డ్
ప్రతీకాత్మకచిత్రం
ప్రపంచంలోనే అత్యంత విలువైన డిజిటల్ కరెన్సీగా క్రిప్టోకరెన్సీ(Cryptocurrency) బిట్‌కాయిన్ (Bitcoin) అవతరించింది. గత కొద్ది నెలలుగా Bitcoin ధర ఎప్పుడూ ఊహించని విధంగా పెరిగిపోతుంది. డిసెంబర్ 18న Bitcoin ధర 22,916 డాలర్లను తాకి చారిత్రాత్మక మార్క్ ను దాటేసింది.
ప్రపంచంలోనే అత్యంత విలువైన డిజిటల్ కరెన్సీగా క్రిప్టోకరెన్సీ(Cryptocurrency) బిట్‌కాయిన్ (Bitcoin) అవతరించింది. గత కొద్ది నెలలుగా Bitcoin ధర ఎప్పుడూ ఊహించని విధంగా పెరిగిపోతుంది. డిసెంబర్ 18న Bitcoin ధర 22,916 డాలర్లను (16,85,145.54Indian Rupee) తాకి చారిత్రాత్మక మార్క్ ను దాటేసింది. కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చినా మున్ముందు కరోనా(Coronavirus) ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉండటంతో పాటు అమెరికాలో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టాక డాలర్ విలువ మరింత క్షీణిస్తుందనే వార్తల నేపథ్యంలో బిట్ కాయిన్ కొనుగోళ్లు పెరిగాయి. సమీప భవిష్యత్తులో ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండటంతో Bitcoin విలువ మరింత వృద్ధి చెందనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ నెలలో Bitcoin విలువ 10.5 శాతం పెరిగి 23,655 డాలర్ల మార్క్ ను చేరుకొని ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి ని నెలకొల్పింది. Bitcoinప్రారంభం అయినప్పటి నుండి, దీని ప్రయాణం భారీ హెచ్చుతగ్గుల మధ్య కొనసాగింది. అయితే, ఈ క్రిప్టోకరెన్సీ చుట్టూ అనేక వివాదాల కూడా ఉన్నాయి. ఎందుకంటే, బిట్ కాయిన్లకు ప్రపంచంలోని ఏ సెంట్రల్ బ్యాంక్ రెగ్యులేషన్స్ వర్తించవు. 2008లో Bitcoin ప్రస్థానం మొదలవ్వగా.. 2013లో తొలిసారి దీని విలువ వెయ్యి డాలర్లు దాటింది. క్రమంగా పుంజుకొని 12 ఏళ్లలోనే 20 వేల డాలర్లను చేరుకుంది. 2017 జనవరిలో 1,000 డాలర్లుగా ఉన్న Bitcoin విలువ అదే ఏడాది డిసెంబరులో 19,000 డాలర్లకు చేరుకొని రికార్డు స్థాయిలో ట్రేడ్ అయ్యింది.
గత మూడేళ్లలో Bitcoin వాల్యూలో హెచ్చుతగ్గులు..
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ కి అంగీకారం లభించడం, అధిక రాబడి ఆర్జిస్తుండటంతో Bitcoin ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతుంది. 2017 ప్రారంభం నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో క్రిప్టోకరెన్సీ 'ఆల్-టైమ్ హై'ని చేరుకుంది. 2017 జనవరిలో $1000 ఉన్న దీని ధర మే చివరిలో మొదటిసారి $ 2,000 మార్కును తాకింది. అదే నెలలో $ 3,000 ను అధిగమించింది. ఆ తర్వాత హెచ్చుతగ్గులు నమోదు చేసింది. $ 3,000 సాధించిన ఒక రోజు తర్వాత దీని ధరలో 300 డాలర్ల పతనం నమోదైంది. కాగా, సెప్టెంబర్ మొదటి వారంలో $ 5,000 మార్క్‌ను దాటిన దీని విలువ, అక్టోబర్‌లో $ 5,000 పైన పెరిగి, నవంబర్, డిసెంబర్ నాటికి, ఆల్ టైమ్ హైకి చేరుకుంది. డిసెంబరులో, క్రిప్టోకరెన్సీ విలువ $ 19,000 మార్కును దాటి మునుపటి అన్ని అధిక రికార్డులను బద్దలుకొట్టింది. ఆ తర్వాత దీని చలామణిపై అనేక ఊహాజనిత వార్తలు రావడంతో 30 శాతం తగ్గి 12,000 డాలర్లకు పడిపోయింది.
2019 ఏప్రిల్‌లో, Bitcoin ఆరు నెలల గరిష్టానికి చేరుకోగా, జూన్‌లో దీని విలువ $ 12,935కు పెరిగింది. అదే నెలలో, వర్చువల్ కరెన్సీ అధిక అస్థిరతను చూపించడంతో దీని విలువ $ 1,800కు పడిపోయింది.
2020లో కరోనా సంక్షోభంతో Bitcoin వాల్యూ మరింత పెరిగింది. త్వరలోనే క్రిప్టోకరెన్సీలను కూడా ఇతర కరెన్సీల వలే అంగీకరిస్తారన్న అంచనాలతో దీని విలువ మరింత వృద్ధి చెందుతూ వస్తోంది. అక్టోబర్ నుండి, యుఎస్ ఆధారిత ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేపాల్ (PayPal) తన నెట్‌వర్క్‌లో బిట్కాయిన్లను ఉపయోగించడానికి వినియోగదారులను అనుమతించడం దీని వృద్ధికి మరింత తోడ్పడింది.నవంబర్ నెలలో, Bitcoin వరుసగా ఐదు రోజులు లాభపడి మరింత పైకి ఎగబాకింది. తద్వారా దాదాపు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.