ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరొందిన బిట్‌కాయిన్ కొత్త ఏడాదిలో రికార్డులు సృష్టిస్తోంది. గత వారం తొలిసారిగా 30,000 డాలర్లు దాటిన బిట్‌కాయిన్ విలువ ఈ వారం 40,000 డాలర్లను తాకి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2021 మొదటి మూడు రోజుల్లోనే దీని విలువ సుమారు 5,000 డాలర్లు పెరిగి, 30,000 డాలర్లను చేరుకోగా, ప్రస్తుతం 10,000 డాలర్లు పెరిగి 40,000 డాలర్లను చేరింది. తాజా, ట్రేడింగ్ సెషన్లో దీని విలువ10.4 శాతం పెరిగి 1820 GMT వద్ద 40,380 డాలర్లను చేరుకుంది. 2017 నుంచి అంతకంతకూ పెరుగుతున్న ఈ క్రిప్టో కరెన్సీ 2020 డిసెంబర్ 16న మొదటిసారి 20 వేల డాలర్లగా నమోదైంది. ఆ తర్వాత రికార్డు స్థాయికి దూసుకెళ్లింది. డిసెంబర్ చివరి వారంలో దీని విలువ అంతకంతకూ పెరుగుతూ.. డిసెంబర్ 25న 25 వేలు, 27న 27 వేల డాలర్లను చేరుకుంది. ఇదే స్పీడుతో 2021 తొలి వారంలో మొదటిసారిగా 30,000 డాలర్లు దాటింది.
Gold Loan Interest Rates 2021: తక్కువ వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులివే...
Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారు? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా
కరోనా సంక్షోభం, అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబిడెన్ ఎన్నికవ్వడం కారణంగా పెట్టుబడిదారుల ఆలోచనలు మారుతున్నాయి. ఇదే ఇప్పుడు క్రిప్టోకరెన్సీ వాల్యూ పెరగడానికి ప్రధాన కారణమైంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానంలో భాగంగా కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాఢిలో పెట్టేందుకు మొదటి 100 రోజుల్లో ఉద్దీపన ప్యాకేజీని అమలు చేయనున్నారు. ఇది క్రిప్టోకరెన్సీ వాల్యూ పెరగడానికి కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు." అని కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఓండా(Oanda) మార్కెట్ విశ్లేషకుడు ఎడ్వర్డ్ మోయా చెప్పారు.
Aadhaar PVC Card: పాన్ కార్డ్ సైజులో ఆధార్ కార్డ్... సింపుల్‌గా ఆర్డర్ చేయండి ఇలా
LIC: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్ మీకోసమే
బిట్ కాయిన్‌ను అనుమతించిన ‘పేపాల్’
అయితే, 2007లో ప్రారంభమైన ఈ క్రిప్టోకరెన్సీ దాదాపు 12 సంవత్సరాల తర్వాత 2020 మార్చి నుండి పెరుగుదలను చూసింది. 2020 మార్చిలో 5,000 డాలర్ల వద్ద ఉన్న దీని విలువ ప్రస్తుతం 40,000 డాలర్లను చేరుకుంది. తాజాగా, ఆన్లైన్ చెల్లింపుల దిగ్గజం పేపాల్ తన ప్లాట్ఫామ్లో వినియోగదారులు క్రిప్టోకరెన్సీని కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. త్వరలోనే పేపాల్ లాగానే మరిన్ని డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ ఆన్లైన్ చెల్లింపులకు బిట్‌కాయిన్‌ను కూడా అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీని విలువ అమాంతం పెరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో బిట్ కాయిన్ బంగారానికి 'ప్రత్యామ్నాయ' కరెన్సీగా మారి, తీవ్ర పోటీని ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Santhosh Kumar S
First published:January 08, 2021, 17:12 IST