Home /News /business /

BIRTH TO DEATH UIDAI TO LAUNCH TWO AADHAAR PROGRAMMES TO COVER A PERSON ENTIRE LIFECYCLE SS

Aadhaar Card: జననం నుంచి మరణం వరకు... ఆధార్‌కు సంబంధించి మరో రెండు పైలట్ ప్రోగ్రామ్స్

Aadhaar Card: జననం నుంచి మరణం వరకు... ఆధార్‌కు సంబంధించి మరో రెండు పైలట్ ప్రోగ్రామ్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card: జననం నుంచి మరణం వరకు... ఆధార్‌కు సంబంధించి మరో రెండు పైలట్ ప్రోగ్రామ్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డ్ విషయంలో మరో రెండు పైలట్ ప్రోగ్రామ్‌లు చేపట్టబోతోంది. ఆధార్ నెంబర్ ఓ వ్యక్తి జీవిత చక్రం మొత్తం కవర్ అయ్యేలా చేయనుంది.

ఆధార్ కార్డ్... భారతీయ పౌరుల జీవనంలో ఓ భాగం అయిపోయింది. ఆధార్ కార్డ్ (Aadhaar Card) ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. ముఖ్యంగా పీఎం కిసాన్ (PM Kisan) లాంటి ప్రభుత్వ పథకాలు పొందడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 2010లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రారంభించింది. 2022 జూన్ 15 నాటికి 133,58,18,340 ఆధార్ నెంబర్లను జనరేట్ చేసింది యూఐడీఏఐ. అంటే 133 కోట్లకు పైనే ఆధార్ నెంబర్లను (Aadhaar Number) జనరేట్ చేసింది. యూఐడీఏఐ మరో రెండు పైలట్ ప్రోగ్రామ్స్‌ని చేపట్టబోతోంది. జననం నుంచి మరణం వరకు ఓ వ్యక్తి పూర్తి జీవితచక్రం కవర్ అయ్యేలా ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించబోతున్నట్టు ఎకనమిక్ టైమ్స్ కథనం పబ్లిష్ చేసింది.

ప్రస్తుతం పిల్లలకు ఆధార్ కార్డ్ ఎప్పుడు తీసుకోవాలన్నది తల్లిదండ్రుల ఇష్టం. పిల్లలు పుట్టగానే ఆధార్ నెంబర్ జనరేట్ చేయాలని యూఐడీఏఐ భావిస్తోంది. పుట్టిన పిల్లలకు ఆస్పత్రిలోనే ఆధార్ నెంబర్ జనరేట్ చేస్తుంది యూఐడీఏఐ. తర్వాత వారి బయోమెట్రిక్ డేటా అప్‌డేట్ చేయొచ్చు. ప్రస్తుతం పిల్లలకు ఐదేళ్లు దాటిన తర్వాత ఓసారి, 15 ఏళ్లు దాటిన తర్వాత ఓసారి బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేస్తున్నారు.

Aadhaar Card: పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం ఆధార్ ఇవ్వాల్సిందేనా? రూల్స్ తెలుసుకోండి

ఆస్పత్రుల్లో పిల్లలు పుట్టగానే మొదట ఆధార్ నెంబర్ జనరేట్ చేస్తారు. వారికి ఐదేళ్లు పూర్తైన తర్వాత యూఐడీఏఐ సిబ్బంది వెళ్లి బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేసి శాశ్వతంగా ఆధార్ నెంబర్ కేటాయిస్తారు. పుట్టినప్పుడు UIDAI నంబర్‌ను కేటాయించడం వల్ల పిల్లలు, వారి కుటుంబాలు ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనం పొందొచ్చని, సామాజిక భద్రతా కార్యక్రమాలన్నీ వారికి లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుత లెక్కలు చూస్తే 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిలో 93 శాతం మందికి మాత్రమే ఆధార్ నెంబర్లు వచ్చాయి. ఇక ఐదేళ్లలోపు పిల్లల విషయంలో అయితే వారికి తల్లిదండ్రులు ఆధార్ కార్డ్ తీసుకోవడం చాలా అరుదు. స్కూళ్లల్లో అడ్మిషన్ల సమయంలో ఆధార్ కార్డ్ అడిగినప్పుడు లేదా ఇతర అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే ఆధార్ కార్డుకు అప్లై చేస్తున్నారు. యూఐడీఏఐ ఈ ప్రోగ్రామ్ చేపడితే దాదాపు 100 శాతం మందికి ఆధార్ నెంబర్లు జారీ చేయడం సాధ్యమవుతుంది.

Aadhaar Card: ఆధార్ కార్డ్ ఒరిజినలేనా? వెరిఫై చేయడానికి అనేక మార్గాలు



జననం మాత్రమే కాదు, మరణం విషయంలోనూ యూఐడీఏఐ మరో ప్రోగ్రామ్ చేపట్టబోతోంది. మరణించినవారి ఆధార్ కార్డ్ వివరాలు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే డెత్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్‌లో ఆధార్ నెంబర్లను యాడ్ చేయబోతోంది. దీని ద్వారా చనిపోయినవారి ఆధార్ నెంబర్లు ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరణించినవారి ఆధార్ నెంబర్లు డెత్ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్‌లో అప్‌డేట్ అవుతాయి. యూఐడీఏఐ త్వరలోనే ఈ రెండు ప్రోగ్రామ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, UIDAI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు