హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bill Gates: బిల్ గేట్స్, మిలిందా గేట్స్ విడాకులు.. వారికి ఎంత ఆస్తులున్నాయ్? ఎవరికి ఎంత వస్తుంది?

Bill Gates: బిల్ గేట్స్, మిలిందా గేట్స్ విడాకులు.. వారికి ఎంత ఆస్తులున్నాయ్? ఎవరికి ఎంత వస్తుంది?

బిల్ గేట్స్, మిలిందా గేట్స్ విడాకులు తీసుకుంటున్నారనే చర్చ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, బిల్ గేట్స్, మిలిందా గేట్స్‌‌కు ఎంతఆస్తులు ఉన్నాయి? విడాకులు తీసుకుంటే ఎవరికి ఎంత ఆస్తి వస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.

బిల్ గేట్స్, మిలిందా గేట్స్ విడాకులు తీసుకుంటున్నారనే చర్చ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, బిల్ గేట్స్, మిలిందా గేట్స్‌‌కు ఎంతఆస్తులు ఉన్నాయి? విడాకులు తీసుకుంటే ఎవరికి ఎంత ఆస్తి వస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.

బిల్ గేట్స్, మిలిందా గేట్స్ విడాకులు తీసుకుంటున్నారనే చర్చ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, బిల్ గేట్స్, మిలిందా గేట్స్‌‌కు ఎంతఆస్తులు ఉన్నాయి? విడాకులు తీసుకుంటే ఎవరికి ఎంత ఆస్తి వస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇంకా చదవండి ...

  మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బిల్ గేట్స్, మెలిందా గేట్స్ 27 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. ఈ వయసులో వారు విడిపోవడానికి గల కారణాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని కోట్ల డాలర్ల విలువైన సంపదను ఇద్దరూ కలిసి పంచుకుంటారా, గేట్స్ ఫౌండేషన్ దాతృత్వ కార్యక్రమాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. బిల్ గేట్స్ సంపద విలువ సుమారు 130.5 బిలియన్ డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని కుబేరుల్లో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చేరిన గేట్స్, మధ్యలోనే చదువును వదిలేశారు. ఆ తరువాత 1975లో పాఠశాల స్నేహితుడు పాల్ అలెన్‌తో కలిసి టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ 1986లో IPOకు వెళ్లింది. ఆ సమయంలో గేట్స్‌కు మైక్రోసాఫ్ట్‌లో 49 శాతం వాటా ఉంది. ఐపీఓకు మంచి స్పందన రావడంతో ఆయన చూస్తుండగానే కోటీశ్వరుడు అయ్యాడు.


  మైక్రోసాఫ్ట్ కంపెనీ విలువ పెరుగుదలతో, బిల్ గేట్స్ త్వరలోనే ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మారారు. ఆ తరువాత గేట్స్ దంపతులు దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. కొన్ని కోట్ల డాలర్లను తమ ఫౌండేషన్‌కు కేటాయించారు. ఈ క్రమంలో ఇతర కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటూ మైక్రోసాఫ్ట్‌ కంటే ఎక్కువ మార్కెట్ విలువను సాధించాయి. దీంతో బిల్ గేట్స్ సంపద విలువ తగ్గి, ప్రపంచ కుబేరుడి హోదా కోల్పోయారు. ప్రస్తుతం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, లూయిస్ విట్టన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో తొలి మూడు స్థానాలు దక్కించుకున్నారు. వీరి తరువాత గేట్స్ నాలుగో స్థానంలో ఉన్నారు.


   గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు

  బిల్, మిలిందా గేట్స్ దంపతులు 2000లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ప్రజారోగ్యం, విద్య, వాతావరణ మార్పులపై ఈ ఫౌండేషన్ దృష్టి సారించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలలో ఒకటి కావడం విశేషం. కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించిన సమయంలో అవగాహన కార్యక్రమాలు, పరిశోధనలు, వ్యాక్సిన్ డ్రైవ్ కోసం సుమారు 1.75 బిలియన్ డాలర్లను ఈ ఫౌండేషన్ విరాళంగా ఇచ్చింది. 2019 నాటికి గేట్స్ ఫౌండేషన్ నికర ఆస్తుల విలువ 43.3 బిలియన్ డాలర్లుగా ఉంది.  అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన సేవా కార్యక్రమాల కోసం ఈ ఫౌండేషన్ 2019లో సుమారు ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 1994 నుంచి 2018 వరకు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 36 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఈ సంస్థకు విరాళాలు ఇచ్చారు. 2006లో వారెన్ బఫెట్ ఏకంగా 29 బిలియన్ డాలర్లు గేట్స్ ఫౌండేషన్‌కు విరాళంగా అందిచడం విశేషం. విడాకుల తరువాత కూడా ఈ ఫౌండేషన్ బాధ్యతలను ఇద్దరూ చూసే అవకాశాలు ఉన్నాయి.

  వకీల్ సాబ్ సినిమా చూసి నాకు ఫోన్ చేసి తిడుతున్నారు.. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తి.. ఎందుకంటే  ఆస్తుల విభజన ఎలా?

  బిల్ గేట్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు నివసిస్తున్న భవంతి విలువ 130.8 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని కింగ్ కౌంటీ డిపార్ట్మెంట్ ఆఫ్ అసెస్మెంట్స్ తెలిపింది. ఇది లేక్ వాషింగ్టన్‌లో.. సీటెల్, మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ఉన్న రెడ్‌మండ్‌ సమీపంలో ఉంది. దీంతో పాటు ఇతర ఆస్తులను బిల్ గేట్స్, మిలిందా గేట్స్ ఎలా పంచుకుంటారనే వివరాలపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదు. వీరిద్దరూ ఉమ్మడి ఆస్తులను విభజించుకొని పంచుకోవాలని భావిస్తున్నారు. కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో దీనికి సంబంధించిన సపరేషన్ అగ్రిమెంట్ దాఖలు చేశారు.
  నియమాలు ఏం చెబుతున్నాయి?

  పెళ్లి తరువాత కుటుంబం సంపాదించిన మొత్తం ఆస్తిని ఉమ్మడి ఆస్తిగా భావించాలని అమెరికా చట్టాలు చెబుతున్నాయి. విడాకులు తీసుకునే సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఈ ఆస్తులను సమానంగా విభజించి పంచుకోవాలి. అయితే ఒక్కరికే చెందే కొన్ని ప్రత్యేక ఆస్తులు మాత్రం విభజించడానికి వీల్లేదు. వారసత్వ సంపదగా వచ్చిన ఆస్తులు విడాకుల తరువాత కూడా వారి పేరుమీదే ఉంటాయి. గేట్స్ దంపతుల విడాకుల ప్రక్రియ ముగిసే సమయానికి వీరి ఆస్తుల విభజన అంశం ఒక కొలిక్కి రానుంది.

  First published:

  Tags: Bill Gates, Microsoft, United states

  ఉత్తమ కథలు