Home /News /business /

BIKE SCOOTERS WILL BE CHEAPER AFTER THE BUDGET THIS DEMAND AROSE TO INCREASE THE DEMAND MK

Budget 2022-23: కేంద్ర బడ్జెట్ తర్వాత 2 వీలర్ల ధరలు తగ్గే చాన్స్...నిపుణులు ఏమంటున్నారంటే..?

nirmala sitharaman

nirmala sitharaman

బడ్జెట్ 2022-23ఫై అన్ని వర్గాల నుంచి డిమాండ్ లు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో చతికిలపడిన ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించడానికి, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు తీసుకోవాలని అన్ని రంగాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Budget 2022-23:  బడ్జెట్ 2022-23ఫై అన్ని వర్గాల నుంచి డిమాండ్ లు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో చతికిలపడిన ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించడానికి, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు తీసుకోవాలని అన్ని రంగాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అటు ఈ సారి బడ్జెట్ లో టూ వీలర్ల ధరలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మఖ్యంగా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే, బడ్జెట్ తర్వాత ద్విచక్ర వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేట్లను 18 శాతానికి తగ్గించాలని, తద్వారా డిమాండ్ పెరుగుతుందని, ఆటోమొబైల్ డీలర్ల సంస్థ FADA కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఎడిఎ) ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన ఉత్పత్తి కాదని, అందువల్ల జిఎస్‌టి రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. FADA 26,500 డీలర్‌షిప్‌లను కలిగి ఉన్న 15,000 కంటే ఎక్కువ ఆటోమొబైల్ డీలర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

    28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని డిమాండ్‌

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు, ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేట్లను 18 శాతం వరకు తగ్గించాలని ఫడా ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది.

    ద్విచక్ర వాహనాలను విలాస వస్తువులుగా వినియోగించడం లేదని, నిత్యం పనికి సామాన్యులు వినియోగిస్తున్నారని ఫడా తెలిపారు. FADA ఇంకా మాట్లాడుతూ, "అందువలన, లగ్జరీ ఉత్పత్తులకు ఉద్దేశించిన రెండు శాతం సెస్‌తో పాటు 28 శాతం GST, ద్విచక్ర వాహన వర్గానికి తగినది కాదు."

    ముడిసరుకు పెరుగుదల కారణంగా వాహనాల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని, అటువంటి పరిస్థితిలో, GST రేటు తగ్గింపు ధర పెరుగుదలను ఎదుర్కోవడంలో , డిమాండ్‌ను పెంచడంలో సహాయపడుతుందని సంస్థ అభిప్రాయపడింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Budget 2022, Budget 2022-23, Union Budget 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు