Traffic Rules | మీకు కారు, టూవీలర్ వంటివి ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ (Rules) తెలుసుకోవాల్సిందే. లేదంటే జేబుకు చిల్లులు పడతాయి. భారీ పెనాల్టీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే వాహనదారులు ట్రాఫిక్ (Traffic) రూల్స్‌ను పూర్తి తెలుసుకోవాలి. రోడ్డు ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్‌ను కఠినంగా అమలు చేస్తూ ఉంటాయి. అయితే కొంత మంది ఈ ట్రాఫిక్ రూల్స్‌ను పట్టించుకోరు. వాటి గురించి పెద్దగా తెలుసుకోకపోవచ్చు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం రూ. 25 వేల వరకు జరిమాని ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే జరిమానా పడుతుంది. రూ.10 వేలు వరకు కట్టాల్సిందే. పాత వెహికల్స్‌కు ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు పెట్టకూడదు. కారు లేదా టూవీలర్ రెండింటికీ ఇదే వర్తిస్తుంది. అందువల్ల ఆర్‌టీవో ధ్రువీకరించిన హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ వెహికల్‌కు ఉండేలా చూసుకోండి.
రూ.45 వేలకే అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఒక్కసారి చార్జింగ్ పెడితే 100 కి.మి. వెళ్లొచ్చు!
అంతేకాకుండా చాలా మంది వెహికల్ స్టైలిష్ కోసం మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. భారీ జరిమానా పడుతుంది. కొంత మంది బైక్ సైలెన్సర్లను మారుస్తూ ఉంటారు. కొంత మంది అయితే సైలెన్సర్ తీసేస్తారు. అలాగే బైక్ లేదా కారులో మోడిఫికేషన్స్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏకంగా రూ. 25 వేలకు పైగా జరిమానా పడుతుంది. ఇంకా వెహికల్ సీజ్ కూడా కావొచ్చు.
యమ క్రేజ్.. జనాలు ఎక్కువగా కొంటున్న టాప్ 5 కార్లు ఇవే!
అందువల్ల వాహనదారులు ఈ రూల్స్‌ను గుర్తు పెట్టుకోవడం ఉత్తమం. ఎక్కువ సౌండ్ కోసం బైక్ సైలెన్సర్ మార్చడం, స్టైల్ కోసం వెహికల్‌ను మోడిఫికేషన్ చేయించడం వంటివి చేయొద్దు. చేస్తే మాత్రం రెండు రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. మోడిఫికేషన్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. అలాగే ట్రాఫిక్ చలానా పడితే డబ్బులు కట్టాలి. ఇలా రెండు రకాలుగా డబ్బులు పోగొట్టుకోవాలి. ఇంకా మళ్లీ వెహికల్‌ను మామూలుగా మార్చుకోవాలి. దీంతో మళ్లీ నష్టం కలుగుతుంది. అందుకే టూవీలర్ లేదా కారు కలిగిన వారు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. తొందరపడి టూవీలర్ లేదా కారును ఇష్టం వచ్చినట్లు మార్చుకోవద్దు. కంపెనీ డిజైన్‌ను మార్చకూడదు. ఇంకా హెల్మెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్ ఉన్నా కూడా పెట్టుకోకపోతే జరిమానా పడుతుంది. రూల్స్ ప్రకారం చూస్తే.. హెల్మెట్ స్ట్రిప్ సరిగా పెట్టుకోకపోయినా కూడా జరిమానా పడేందుకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bikes, CAR, Traffic challan, Traffic fine, Traffic penalty, Traffic rules