Home /News /business /

BIKE NEWS ARTICLE VESPA ELECTRIC SCOOTER INDIA LAUNCH CONFIRMED MK GH

Vespa electric scooter: భారత్‌లో విడుదలకానున్న వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్‌

Vespa VXL, SXL

Vespa VXL, SXL

తాజాగా Vespa సంస్థ కూడా మన దేశంలో ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో- 2020 ఈవెంట్‌లోనే Vespa electric scooterను Piaggio India సంస్థ ఆవిష్కరించింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric vehicles) ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆధరణను వాహన తయారీ సంస్థలు అందిపుచ్చుకుంటున్నాయి. కొత్త స్టార్టప్‌లతో పాటు పెద్ద కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీపై దృష్టి పెట్టాయి. తాజాగా Vespa సంస్థ కూడా మన దేశంలో ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో- 2020 ఈవెంట్‌లోనే Vespa electric scooterను Piaggio India సంస్థ ఆవిష్కరించింది. అప్పట్లో ఈ స్కూటర్ను భారత్‌లో విడుదల చేసే అంశంపై కంపెనీ స్పందించలేదు. తాజాగా వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేయాలని నిర్ణయించినట్లు Piaggio India మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డియెగో గ్రాఫీ (Diego Graffi) తెలిపారు. కానీ ఇది ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన వెస్పా ఎలెట్ట్రికా (Vespa Elettrica) మోడల్ కాదు. Elettrica ఆధారంగా.. కేవలం భారత వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను అభివృద్ధి చేస్తునట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఆ ఫీచర్లు ప్రత్యేకం..
Vespa electric scooter కోసం డిజైన్‌ను, టెక్నాలజీని తమ సంస్థే అభివృద్ధి చేస్తోందని డియోగో గ్రాఫీ తెలిపారు. ఈ టూవీలర్ పవర్‌ట్రెయిన్, టెక్నాలజీని బయటి వెండార్ల నుంచి తీసుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుతం Vespa Elettrica స్కూటర్లు యూరప్‌లో విడుదలయ్యాయి. ఇంట్లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. రౌండ్ హెడ్‌ల్యాంప్, కర్వి ఫ్రంట్ ఆప్రాన్, ముందు భాగంలో కాంట్రాస్ట్ కలర్ ఎయిర్‌వెంట్లు, apron మౌంటెడ్ ఇండికేటర్స్‌తో దీన్ని తయారు చేశారు. క్లీన్ డిజైన్‌తో ఉన్న సైడ్ ప్యానెల్స్, వెనుక భాగంలో స్పోర్ట్స్ LED టెయిల్ లైట్.. వంటివి కస్టమర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. అల్లాయ్ వీల్స్, 4.3-అంగుళాల digital instrument panel, బ్లూటూత్- స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అదనపు ఫీచర్లు కూడా ఈ బైక్‌ సొంతం.

మంచి బ్యాటరీ సామర్థ్యం
Vespa Elettrica నాలుగు కిలోవాట్ల brushless DC electric motorతో వస్తుంది. ఇది అత్యధికంగా 200 Nm టార్క్‌ను అందిస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్ల వరకు రైడ్ చేయవచ్చు. ఈ బైక్ బ్యాటరీని నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. భారత వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకొస్తున్నప్పటికీ, దీన్ని ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలను ఆ సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. వచ్చే సంవత్సరం ఈ బైక్ ఇండియాలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published:

Tags: Automobiles, Bike, CAR, Cars

తదుపరి వార్తలు